iDreamPost
android-app
ios-app

భార్యతో లాయర్ అక్రమ సంబంధం.. నడిరోడ్డుపై నరికి దారుణ హత్య!

  • Published Nov 20, 2024 | 6:07 PM Updated Updated Nov 20, 2024 | 6:07 PM

Brutal: తమిళ నాడులో దారుణం జరిగింది. లాయర్ హత్య జరిగింది.

Brutal: తమిళ నాడులో దారుణం జరిగింది. లాయర్ హత్య జరిగింది.

  • Published Nov 20, 2024 | 6:07 PMUpdated Nov 20, 2024 | 6:07 PM
భార్యతో లాయర్ అక్రమ సంబంధం.. నడిరోడ్డుపై నరికి దారుణ హత్య!

తమిళనాడులో వరుస హత్యలు కలకలం రేపుతున్నాయి. క్లాస్ రూమ్ లో టీచర్ ని అతి దారుణంగా నరికి చంపిన ఘటన మరవకముందే తాజాగా మరో హత్య జరిగింది. ఈ హత్య అందరిని వణికిస్తుంది. తమిళనాడులో హొసూరులోని అనేకల్ సరిహద్దు సమీపంలోని కోర్టు ఆవరణలో ఈ హత్య జరిగింది. కన్నన్ అనే న్యాయవాదిని దారుణంగా నరికి చంపాడు హంతకుడు. ఈ సంఘటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. నడి రోడ్డు మీద పట్టపగలు ఈ దారుణం జరిగింది. ఇలాంటి హత్యలు సినిమాల్లోనే జరుగుతాయి. కానీ రియల్ గా నడి రోడ్డు మీదే జరగడంతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. భయంతో గజగజ వణికిపోయారు. ఇక ఈ హత్యకి సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. తెలుస్తున్న సమాచారం ప్రకారం హత్యకు గురైన వ్యక్తి పేరు కన్నన్‌. ఆయన్ని చంపిన హంతకుడి పేరు ఆనంద్. కన్నన్ ఒక లాయర్. ట్విస్ట్ ఏంటంటే అతన్ని దారుణంగా చంపిన ఆనంద్ ఎవరో కాదు.. కన్నన్ అసిస్టెంట్‌ అట. అంటే కన్నన్ కింద జూనియర్ లాయర్ గా పని చేస్తున్నాడు ఆనంద్. తన గురువునే అతి కిరాతకంగా రోడ్డుపై అడ్డంగా నరికి హత్య చేశాడు ఆనంద్. అసలు ఎందుకు ఇంతలా ఆనంద్ కన్నన్ ని దారుణంగా చంపాడు? అలా చంపే విధంగా కన్నన్ ఆనంద్ ని ఏం చేశాడు? ఈ హత్యకి అసలు కారణం ఏంటి? తెలిస్తే కచ్చితంగా షాక్ అవుతారు.

ఈ హత్యకు ప్రధాన కారణం అక్రమ సంబంధం. కన్నన్, ఆనంద్ భార్యల మధ్య అనుమానిత అక్రమ సంబంధం ఉందని తెలిసింది. ఆ కారణంగా వ్యక్తిగత వివాదాలు ఏర్పడ్డాయట. అందుకే ఈ దారుణ హత్య జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి.ఈ కారణం వలనే కోర్టు ఆవరణలో ఆనంద్ కొడవలితో కన్నన్ తల నరికి మరీ చంపాడట. ఈ హత్య అక్కడ ఉన్న న్యాయవాదులను సైతం వణికి పోయేలా చేసింది. హత్య జరిగిన ప్రాంతం హోసూర్ పోలీస్ స్టేషన్, కోర్టు రెండింటికి దగ్గరలో జరగడం షాకింగ్ గా మారింది. దీంతో ఆనంద్ కి ఎంత పగ ఉందో స్పష్టంగా తెలుస్తుంది. తన భార్య అక్రమ సంబంధం గురించి తెలిశాకా ఆనంద్ కన్నన్ పై పీకల్లోతు కోపాన్ని పెంచుకున్నాడట. అందుకే ఇంత కసితో చంపాడాని తెలిసింది.

ప్రస్తుతం ఈ ఘటనపై ఓ రేంజిలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి, కోర్టు బయట పైగా అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే ప్రాంతంలో ఇంత దారుణమైన హత్య ఎలా జరుగుతుందని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇక పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకొని హంతకుడిని అదుపులో తీసుకున్నారు. అతను దాడికి ఉపయోగించిన కొడవలితో సహా పలు ఆధారాలని కూడా సేకరిస్తున్నారు. ఆనంద్ కన్నన్ ని చంపుతుండగా కొందరు సెల్ ఫోన్ లో వీడియో తీశారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాని తెగ షేక్ చేస్తుంది. ఇక పట్టపగలే లాయర్ ని కోడవలితో నరికి చంపిన ఈ ఘటనపై మీరేమి అనుకుంటున్నారో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişen çok kazandiran casino sitelerigrandpashabet linkHoliganbetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetJojobetJojobetMadridbetMadridbetjojobetJojobetjojobetjojobetjojobetcasibomcasibomcasibomcasibomcasibom girişholiganbetjojobetjojobetcasibomJojobetbetciojojobetjojobet girişjojobet girişcasibomcasibombetistbetcio