iDreamPost
android-app
ios-app

లవ్ మ్యారేజ్.. భర్త పనిమీద వెళ్తున్నాడని తెలిసి..

  • Published Jul 08, 2024 | 4:11 PM Updated Updated Jul 08, 2024 | 4:11 PM

అతడు ఓ డాక్టర్. సౌమ్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరి కాపురం హాయిగా సాగిపోతుంది. అంతలో భర్త పని మీద బయటకు వెళ్లాల్సి వచ్చింది. భార్యకు ఈ విషయం చెప్పాడు.

అతడు ఓ డాక్టర్. సౌమ్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరి కాపురం హాయిగా సాగిపోతుంది. అంతలో భర్త పని మీద బయటకు వెళ్లాల్సి వచ్చింది. భార్యకు ఈ విషయం చెప్పాడు.

  • Published Jul 08, 2024 | 4:11 PMUpdated Jul 08, 2024 | 4:11 PM
లవ్ మ్యారేజ్.. భర్త పనిమీద వెళ్తున్నాడని తెలిసి..

ఆ ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అతడు గవర్నమెంట్ డాక్టర్. ఆర్థిక కష్టాలు లేవు. పెళ్లయ్యి ఏడు నెలలు అవుతుంది. హాయిగా సాగిపోతున్న సంసారంలో ఒక్కసారి అలజడి. అంతే ప్రాణంగా ప్రేమించిన ప్రియురాలు, భార్యగా మారిందనుకున్న తరుణంలో.. అతడికి జీవితాంతం వేదన మిగిల్చేలా చేసింది. భార్యా భర్తల మధ్య చిన్న అపార్థం పెద్ద విపత్తునే తెచ్చిపెట్టింది. భర్త అస్సలు ఊహించలేదు భార్య ఇలా చేస్తుందని. కానీ ఇప్పుడు గుండెలు పగిలేలా విలపిస్తున్నాడు. కేవలం చిన్న మాట పట్టింపు జీవితాంతం కలిసి ఉండాలని ప్రమాణం చేసుకున్న ఇద్దరు ప్రేమికుల్ని విడదీసింది. భర్తకు కోలుకోలేని విషాదాన్ని మిగిల్చింది. ఇంతకు ఏం జరిగిందంటే..?

ట్రైనింగ్ కోసం వెళ్లాల్సిన డాక్టర్.. భార్యను ఒంటరిగా ఉంచడం ఇష్టం లేక తన తల్లి దగ్గరకు వెళ్లమని చెప్పడమే పాపమైంది. అత్త ఇంటికి వెళ్లడం ఇష్టం లేని భార్య ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన తమిళనాడులోని తెన్ కాశి జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే. సేలం జిల్లాకి చెందిన ఇనియావన్.. అదే జిల్లాలోని సెంగోతు వేల్ కుమార్తె సౌమ్య ఏడు నెలల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కళింగ పట్టిలో ప్రభుత్వ వైద్యునిగా పనిచేస్తున్నాడు ఇనియావన్. అయితే గత కొన్ని నెలలుగా ఉద్యోగానికి దగ్గరగా ఉంటుందని తెన్ కాశిలోని తిరువెంకటం అగ్రహారం వీధిలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని జీవిస్తున్నాడు. ఈ నేపథ్యంలో అతడు ట్రైనింగ్ కోర్స్ నిమిత్తం బయటకు వెళ్లాల్సి వచ్చింది.

దీంతో భార్యను ఒంటరిగా ఇంట్లో వదిలేసి వెళ్లడం సరికాదు అని భావించిన ఇనియావన్.. తన తల్లి దగ్గరకు వెళ్లు అని సూచించాడు. అయితే తాను అత్తారింటికి వెళ్లనని, తన పుట్టింటి దగ్గర దింపాయాలని కోరింది. ఇదే విషయంపై ఇద్దరి మధ్య అభిప్రాయా భేదాలు వచ్చాయి. ఇదే విషయంపై ఆదివారం రాత్రి కూడా ఇద్దరి మధ్య గొడవ జరిగింది. వద్దని భర్త చెప్పడంతో.. తన గదిలోకి వెళ్లికి వెళ్లి గడియ పెట్టుకుంది. అతడు ఎన్ని సార్లు తలుపుకొట్టినా తీయలేదు. అతడు మరో గదిలోకి వెళ్లాడు. ఇక అతడు తన పనిమీద వెళ్లిపోయాడు. ఎంతకు తలుపులు తీయకపోవడంతో ఇంటి యజమానికి ఆమె డోర్ బాదారు. అయినప్పటికీ తీయకపోవడంతో భర్తకు ఫోన్ చేసి చెప్పగా.. ఇంటికి వచ్చి తలుపులు పగులకొట్టి చూశాడు. భార్య సౌమ్య ఫ్యాన్ కు వేలాడుతూ ఉండటం చూసి షాక్ అయ్యాడు. పోలీసులకు సమాచారం అందింది. భార్య మరణాన్ని తట్టుకోలేకపోయిన భర్త కూడా ఆత్మహత్యకు యత్నించాడు. పోలీసులు అతడ్ని ఆసుపత్రికి తరలించాడు.

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş