P Krishna
Tamilnadu Police Seize Truck: ఈ మధ్య కాలంలో దొంగలు రక రకాల పద్దతుల్లో చోరీలకు పాల్పపడుతూ పోలీసులకు సవాల్ విసురుతున్నారు. ముఖ్యంగా ఏటీఎం లను టార్గెట్ చేసుకొని భారీ దొంగతనాలకు పాల్పపడుతున్న ఘటనలు తరుచూ వెలుగు చూస్కతున్నాయి. అలాంటి ఘటన ఒకటి త్రిసూర్ జిల్లా జరిగింది.
Tamilnadu Police Seize Truck: ఈ మధ్య కాలంలో దొంగలు రక రకాల పద్దతుల్లో చోరీలకు పాల్పపడుతూ పోలీసులకు సవాల్ విసురుతున్నారు. ముఖ్యంగా ఏటీఎం లను టార్గెట్ చేసుకొని భారీ దొంగతనాలకు పాల్పపడుతున్న ఘటనలు తరుచూ వెలుగు చూస్కతున్నాయి. అలాంటి ఘటన ఒకటి త్రిసూర్ జిల్లా జరిగింది.
P Krishna
నేటి సమాజంలో లగ్జరీగా బతకాలంటే డబ్బు కావాలి. చాలా మంది తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించి సొసైటీలో రిచ్ గా లైఫ్ ఎంజాయ్ చేయాలని చూస్తున్నారు. అందుకోసం దొంగతనాలు, స్కీములు, డ్రగ్స్, హైటెక్ వ్యభిచారం ఇతర మోసాలకు పాల్పపడుతూ లక్షలు, కోట్లు సంపాదిస్తున్నారు. మరికొంత మంది కూర్చున్న చోటే అధునాతన టెక్నాలజీ ఉపయోగించి సైబర్ మోసాలకు పాల్పపడుతున్నారు. ఇక ఏటీఎం టార్గెట్ చేసుకొని డబ్బులు కొల్లగొడుతున్న వారి సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతుంది. నేరాలు చేసిన వారు ఎప్పటికైనా పోలీసులకు చిక్కిపోతుంటారు. త్రిస్సూర్‌లో భారీ దొంగతనం జరిగింది.. అయితే పోలీసులు వెంటనే ఈ కేసు ఛేదించారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
ఇటీవల కొన్ని దొంగతనాలు సినిమాలను తలపిస్తున్నాయి. త్రిసూర్ జిల్లాలోని మూడు వేర్వేరు ప్రాంతాల్లో ఏటీఎంలలో చోరీ జరిగింది.ఐస్‌బీఐ ఏటీఎం మిషన్లలో శుక్రవారం రాత్రి దొంగలు గ్యాస్ కట్టర్లు ఉపయోగించి నగదు దాచి ఉంచిన ట్రే కట్ చేసి రూ.65 లక్షలు దోచుకువెళ్లారు.దొంగలు సీసీ కెమెరాలను స్ప్రే పెయింట్‌తో కప్పారు. కాకపోతే ఐదుగురు వ్యక్తులు ముఖాన్ని కప్పుకుని ఏటీఎం వైపు వెళ్తున్న దృశ్యాలు అందాయి. ఏటీఎంలో చోరీ జరిగిన విషయం తెలుసుకొని బ్యాంకు అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఫోరెన్సిక్ బృందం, డాగ్ స్క్వాడ్ ఘటనాస్థలికి చేరుకున్నాయి. దొంగలు చోరీ చేసిన నగదుతో కంటైనర్‌లో పారిపోయేందుకు ప్రయత్నించగా వారిని నాలుగు కిలోమీటర్లకు పైగా సినిమా తరహాలో వెంబడించిన తమిళనాడు పోలీసులు కేరళలో కంటైనర్ ట్రక్కును స్వాధీనం చేసుకున్నారు.
తమిళనాడులోని నమక్కల్‌లో జరిగిన ఈ ఘటనలో పోలీసులతో జరిగిన ఎన్‌కౌంటర్ లో ఒక అనుమానితుడు మృతి చెందగా మరొకరు బుల్లెట్ గాయం అయ్యింది. గాయపడిన వ్యక్తిని చికిత్స కోసం కోయంబత్తూరుకు తరలించారు. ఈ ఆపరేషన్ లో ఇద్దరు తమిళనాడు పోలీసు అధికారులు సైతం గాయపడ్డారు. ఈ ఘటన దోపిడికి పాల్పపడిన ముఠా సభ్యులను అరెస్ట్ చేసే సమయంలో జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. గాయపడ్డ కుమారపాళం పోలీస్ ఇన్స్ పెక్టర్ తవమణి, పళ్లిపాళయం పోలీస్ అసిస్టెంట్ ఇన్స్‌పెక్టర్ రంజిత్ ప్రస్తుతం ప్రభుత్వం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. నిందితులు తమ కస్టడీలో ఉన్నారని నమక్కల్ పోలీస్ ఉన్నతాధికారులు తెలిపారు.కంటైనర్‌లో దాచి ఉంచిన కారుని చెక్ చేయగా నోట్ల కట్టలు బయటపడ్డాయి. అరెస్ట్ చేసిన నిందితులను తమిళనాడు లో న్యాయపరమైన లాంఛనాలు కంప్లీట్ చేసిన తర్వాత త్రిసూర్ కు తరలించనన్నుట్లు పోలీస్ అధికారులు తెలిపారు. భారీ దొంగతనాన్ని ప్రాణాలకు తెగించి పోలీస్ అధికారులపై ప్రశంసలు కురిపించారు ఉన్నతాధికారులు.