iDreamPost
android-app
ios-app

Vishal: విశాల్‌పై హైకోర్డు జడ్జ్ సీరియస్.. ఎందుకంటే..?

Vishal: ఇటీవల వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నాడు కోలీవుడ్ యాక్టర్ విశాల్. ఈ మధ్య స్టాలిన్ నేతృత్వంలోని తమిళనాడు ప్రభుత్వం, నిర్మాణ సంస్థ రెడ్ జెయింట్ పై విరుచుకు పడిన సంగతి విదితమే. దీంతో బ్యాన్ అయ్యాడన్న వార్తలు వినిపించాయి. అంతలో..

Vishal: ఇటీవల వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నాడు కోలీవుడ్ యాక్టర్ విశాల్. ఈ మధ్య స్టాలిన్ నేతృత్వంలోని తమిళనాడు ప్రభుత్వం, నిర్మాణ సంస్థ రెడ్ జెయింట్ పై విరుచుకు పడిన సంగతి విదితమే. దీంతో బ్యాన్ అయ్యాడన్న వార్తలు వినిపించాయి. అంతలో..

Vishal: విశాల్‌పై హైకోర్డు జడ్జ్ సీరియస్.. ఎందుకంటే..?

కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నటిగానే కాకుండా సామాజిక అంశాలపై కూడా రియాక్ట్ అవుతుంటారు. అయితే మధ్యాకాలంలో వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నాడు. ఇండస్ట్రీపై డీఎంకే ప్రభుత్వం, రెడ్ జెయింట్ సంస్థల గుత్తాధిపత్యాన్ని ఎత్తి చూపాడు. సినీ పరిశ్రమపై వీరి జోక్యం ఏంటనీ, ఆ హక్కు ఎవరిచ్చారంటూ ప్రశ్నించాడు. ఈ వివాదం నేపథ్యంలో అతడిపై బ్యాన్ విధించారన్న వార్తలు వినిపించాయి. దీనికి ధీటుగానే సమాధానమిచ్చాడు ఈ కోలీవుడ్ వర్సటైల్ నటుడు. ఇదిలా ఉంటే.. లైకా ప్రొడక్షన్ వివాదంలో తాజాగా విశాల్ పై హైకోర్టు జడ్జి సీరియస్ అయ్యారు. ఆ నిర్మాణ సంస్థతో జరిగిన ఒప్పందంపై అతడ్ని ప్రశ్నించగా.. విశాల్ ఇచ్చిన సమాధానంతో మరోసారి చీవాట్లు తిన్నాడు.

పందెంకోడి 2 సమయంలో వద్ద విశాల్ 21.29 కోట్లను అప్పుగా తీసుకోగా, వాటిని చెల్లించేంత వరకు అన్ని సినిమా హక్కులను లైకాకే ఇవ్వాలనే ఒప్పందాన్ని కుదుర్చుకుంది కోలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ . అయితే ఈ ఒప్పందాన్ని ఉల్లంఘించాడు ఈ స్టార్ నటుడు. దీంతో విశాల్ డబ్బులు ఎగ్గొట్టాడంటూ 2022లో నిర్మాణ సంస్థ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. తొలిసారి వాదనలు విన్నధర్మాసనం రూ. 15 కోట్లు డిపాజిట్ చేయాలని, తన ఆస్తి వివరాలను సమర్పించాలని విశాల్‍ను హైకోర్టు ఆదేశించింది. అప్పటి వరకు ఆ సినిమాలు థియేటర్లలో, ఓటీటీల్లో విడుదల చేయకూడదని పేర్కొంది. అయితే  కోర్టు తీర్పును విశాల్ ఉల్లంఘించాడని జూన్ నెలలో కోర్టు ధిక్కరణ కేసు ఫైల్ చేసింది లైకా. తాజాగా విచారణ చేపట్టింది కోర్టు.

లైకాలో జరిగిన ఒప్పందంపై న్యాయమూర్తి ప్రశ్నించగా.. విశాల్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు జడ్జ్. ‘నేను కేవలం వైట్ పేపర్‌పై సంతకం చేశాను, లైకా సంస్థతో అగ్రిమెంట్ జరిగిందనే విషయం నాకు తెలియదు’ అని సమాధానం ఇచ్చాడు విశాల్. దీనిపై జడ్జ్ సీరియస్ అయ్యాడు ‘ఖాళీ పేపర్ పై మీరెలా సంతకం చేశారు.? తెలివిగా సమాధానం చెబుతున్నాననుకుంటున్నారా.? ఇదేమీ సినిమా షూటింగ్ కాదు.. కాస్త జాగ్రత్తగా బదులివ్వండి’ అని ఫైర్ అయ్యారు జడ్జి. అలాగే పందెంకోడి 2 విడుదలకు ముందే డబ్బు తిరిగి ఇస్తానని మాటిచ్చారా.. అని ప్రశ్నించగా.. సమాధానం చెప్పలేదట విశాల్. తర్వాత లైకా దగ్గర డబ్బులు అప్పుగా తీసుకున్నట్లు అంగీకరించినట్లు తెలుస్తుంది. అయితే ఈ కేసులో లైకా ప్రొడక్సన్స్ సమస్యను పరిష్కరించడానికి మధ్య వర్తిత్వాన్ని కోరినట్లు తెలుస్తుంది.