iDreamPost
android-app
ios-app

అందాన్ని ఎరగా వేసి ముగ్గురి జీవితాలను బలి చేసిన మహిళ!

ప్రజల రక్షణే ధ్యేయంగా విధులు నిర్వర్తిస్తుంటారు పోలీసులు. తమకు అన్యాయం జరిగిందని బాధితులు ఆశ్రయించేది కూడా ఖాకీలనే. అంత భాధ్యతాయుతమైన వృత్తిలో ఉన్న కొందరు.. వక్రమార్గంలో నడుస్తున్నారు.

ప్రజల రక్షణే ధ్యేయంగా విధులు నిర్వర్తిస్తుంటారు పోలీసులు. తమకు అన్యాయం జరిగిందని బాధితులు ఆశ్రయించేది కూడా ఖాకీలనే. అంత భాధ్యతాయుతమైన వృత్తిలో ఉన్న కొందరు.. వక్రమార్గంలో నడుస్తున్నారు.

అందాన్ని ఎరగా వేసి ముగ్గురి జీవితాలను బలి చేసిన మహిళ!

శాంతి భద్రతలను పరిరక్షిస్తూ..ప్రజలకు అండగా నిలవాల్సిన పోలీసులు.. వక్రమార్గంలో నడుస్తున్నారు. ఇది తప్పు అని చెప్పాల్సిన పోలీసులు..దిద్దుకోలేని మిస్టేక్స్ చేస్తున్నారు. 24/7 ప్రజా సేవకే పాటుపడుతూ.. అన్యాయం జరిగిన బాధితులకు తామున్నమంటూ భరోసానివ్వాల్సిన రక్షక భటులు.. రాంగ్ రూట్‌లో పయనిస్తున్నారు. తాజాగా ఇద్దరు ఖాకీలు తలదించుకునే పని చేసి పోలీసు వ్యవస్థకు మాయని మచ్చగా మారారు.  చివరకు సస్పెండ్‌కు గురయ్యారు. ఓ మహిళతో వివాహేతర సంబంధమే ఈ ఇద్దరు ఉద్యోగాలు పోయేలా చేసింది. ఇందుకు కారణమైంది రమణి. ఒక్కరు కాదు.. ఇద్దరు పోలీసులతో అక్రమ సంబంధం పెట్టుకుంది ఈ మహా ఇల్లాలు. ఆమె సరసాల గురించి భర్తకు తెలియడంతో నిలదీశాడు. ఈ విషయంపై భార్యాభర్తలకు గొడవలు జరగడంతో భార్యను చంపేసి పరారయ్యాడు. పరాయి మహిళతో వివాహేతర సంబంధం మూడు కుటుంబాలను చిదిమేసింది.

ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న కారణంగా ఓ ఎస్సై, హెడ్ కానిస్టేబుల్ సస్పెండైన ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కళ్లకురిచ్చి జిల్లా ఉళుందూర్ పేట సమీపంలోని పిల్లూర్‌కు చెందిన అశోక్, రమణి భార్యా భర్తలు. పేరుకు మాత్రమే ఆమె రమణీయం. కానీ తన అందంతో పోలీసులకు వలవేయడమే వ్యాపారంగా పెట్టుకుంది. తిరునావలూర్ ఎస్సై నందగోపాల్‌తో ఆమెకు పరిచయం ఏర్పడి.. అది కాస్త ఎఫైర్‌గా మారింది. ఈ బండారం భర్తకు తెలిసింది. ఇది సహించలేని భర్త భార్యను నిలదీశాడు. ఇద్దరి మధ్య గొడవ జరిగి భార్య రమణిని దారుణంగా హత్య చేసి పరారయ్యాడు. ఈ ఘటనపై ఎడైక్కల్ పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడ్ని అరెస్టు చేశారు. కాగా, భర్తను అరెస్టు చేయడంతో మరొకరి పేరు కూడా వెలుగులోకి వచ్చింది.

విళుపురం జిల్లా మరక్కాణం హెడ్ కానిస్టేబుల్ ప్రభాకరన్ కూడా రమణితో లవ్ ట్రాక్ నడిపాడు. ప్రభాకరన్ కళ్లకురిచ్చిలో పనిచేసే సమయంలో రమణితో ఫిజికల్ రిలేషన్ మెయిన్ టైన్ చేశాడు. ఈ విషయాన్ని బాధితురాలి భర్త పోలీసులకు చెప్పడంతో ఉన్నతాధికారులు ఇద్దరు పోలీసులపై శాఖా పరమైన దర్యాప్తు చేపట్టారు. రమణితో ఈ ఇద్దరు అక్రమ సంబంధం పెట్టుకున్నారని తెలియడంతో ఎస్సై నందగోపాల్, హెడ్ కానిస్టేబుల్ ప్రభాకరన్ ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు విళుపురం రేంజ్ డిఐజీ దిశా మిట్టల్. నిందితుడ్ని కోర్టులో హాజరుపరిచారు. పోలీసులు మరింత విచారణ జరుపుతున్నారు. తప్పుడు మార్గంలో వెళుతున్న వాళ్లకి మంచి చెప్పాల్సిన పోలీసులే ఇలా చేయడం ప్రజలపై నెగిటివ్ ప్రభావాన్ని చూపిస్తుంది. ఇలాంటి కొంత మంది ఖాకీల వల్ల పోలీసు వ్యవస్థకే చెడ్డ పేరు వస్తుంది. ఏమంటారు..?