ఇటీవలి కాలంలో DYI విధానం బాగా పాపులర్ అవుతోంది. ఏదైనా సొంతంగా తయారుచేయడం, సొంతగా సృష్టించడం, సృజన చేయడంపై ప్రజలకు ఆసక్తి పెరిగింది. అందుకు తగ్గట్లుగానే సోషల్ మీడియాలోనూ ట్యూటోరియల్స్, లెర్నింగ్ వీడియోస్ సంఖ్య సైతం బాగా పెరిగింది. అయితే ఇప్పుడు అలాంటి వీడియోనే ఒక యువకుడి ప్రాణాల మీదకు తెచ్చింది. కేరళలోని తిరువనంతపురంలో జరగిన ఈ సంఘటన వైరల్ గా మారింది. ఒక మైనర్ బాలుడు యూట్యూబ్ లో చూసి వైన్ ఎలా చేయాలో తెలుసుకున్నాడు. […]
ఆ కేటుగాడు ఆరేళ్ళలో వెయ్యి మందికి పైగా యువతులకు గాలమేశాడు. 40 నుంచి 50 కోట్లు కాజేశాడు. ఎలా అనుకున్నారు? ఇన్ స్టా గ్రామ్ అకౌంట్ వేదికగా! అదీ ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 94 ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి మరీ దండిగా దోచుకున్నాడు. పాతిక లక్షలు పోగొట్టుకున్న ఓ NRI యువతి ఫిర్యాదుతో ఇతగాడి బండారం బయటపడింది. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఇటీవలే అతణ్ణి అరెస్ట్ చేశారు. ఓ అరవై మందిని […]
ఇదివరకూ ఏదైన ఒక విషయం గురించి సరైన సమాచారం తెలుసుకోవాలంటే పుస్తకాలు, పత్రికలు లేదా.. ఇతర మార్గాలను అనుసరించేవారు. కానీ.. స్మార్ట్ ఫోన్ వచ్చాక.. సోషల్ మీడియా వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. ఏ విషయం గురించిన సమాచారమైనా.. మన అరచేతిలో ఉండే స్మార్ట్ ఫోన్లోనే లభ్యమవుతోంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో లభించే సమాచారాన్నే ఎక్కువశాతం మంది నమ్ముతున్నారట. ఈ విషయం ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ చేసిన ప్రెస్ సర్వేలో వెల్లడైంది. ముఖ్యంగా భారత్ లో ఖచ్చితమైన సమాచారం […]
బస్సు, రైలు లేదా మెట్రో రైలు ఇలా పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ ఏదైనా సరే వృద్ధులు, చంటిబిడ్డల తల్లులకు సీటివ్వడం కనీస మర్యాదను చాటుతుంది. వాళ్లు నిల్చుని ఉంటారులే.. మనమెందుకు సీటివ్వాలని చాలామంది అనుకుంటారు. కానీ అలాంటి అలవాట్లు, ఆలోచనలు సమాజానికి అంత మంచిది కాదు. తాజాగా.. ఓ మహిళ తన బిడ్డను ఒడిలో పెట్టుకుని మెట్రో రైలులో నేలపై కూర్చుని ఉన్న వీడియో ఒకటి నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ వీడియో సోషల్ మీడియా వినియోగదారులను […]
సృజనాత్మకత పేరుతో వచ్చే కొన్ని ప్రకటనలు సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తుంటాయి. క్రియేటివిటీతో ఫలానా ఉత్పత్తిని ప్రజల్లోకి తీసుకెళ్ళే ప్రయత్నంలో హద్దు దాటిన సందర్భాలు గతంలోనూ ఉన్నాయి. ఇప్పుడు అలాంటి ప్రకటనలపై కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ నేరుగా యూట్యూబ్, ట్విట్టర్ లకు లేఖ రాసింది. కొన్ని పర్ఫ్యూమ్/ బాడీ స్ప్రే ప్రకటనలు శృతి మించుతున్నాయని కేంద్ర శాఖ పేర్కొంది. సామూహిక అత్యాచారాలను ప్రోత్సహించేలా చిత్రీకరించిన సదరు ప్రకటనలను వెంటనే తొలగించాలని స్పష్టం చేసింది. మహిళల నైతికత, […]
వాట్సాప్.. భారత్ సహా ప్రపంచ దేశాలు ఎక్కువగా ఉపయోగిస్తున్న మెసేజింగ్ యాప్. వాట్సాప్ వచ్చిన తొలి రోజుల్లో కేవలం మెసేజ్ లు పంపించడం వరకే పరిమితం. ఆ తర్వాత ఫొటో స్టేటస్, టెక్ట్స్ స్టేటస్, 15 సెకండ్లు, 30 సెకండ్ల వీడియో స్టేటస్, డిజిటల్ పేమెంట్స్.. మెసేజ్ డిలీట్ ఆప్షన్.. ఇలా ఒక్కో ఫీచర్ ను అప్ డేట్ చేస్తూ వచ్చింది. తాజాగా వినియోగదారులకోసం వాట్సాప్ మరో ఫీచర్ ను అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటి వరకూ వాట్సాప్ […]
వాట్సాప్లో (Whatsapp) మనం ప్రస్తుతం చాలా తక్కువ డేటా ఉన్న ఫైల్స్ మాత్రమే పంపించగలం. దాదాపు 60 MB ఫైల్స్ వరకు మాత్రమే పంపగలం. కానీ ఇటీవల వాట్సాప్ లో కూడా 2 gb ఫైల్స్ వరకు పంపించుకునే సదుపాయాన్ని త్వరలోనే ఇస్తామని ప్రకటించి దానిపై పని చేశారు. తాజాగా కొందరు యూజర్లకు ఈ సదుపాయం వచ్చింది. వాట్సాప్ లో ఎవరికైనా 2gb వరకు సైజ్ కలిగిన ఫైల్స్ను పంపుకొనే అవకాశం ఆండ్రాయిడ్, ఐఓఎస్ వినియోగదారులకు లభించింది. […]
పిల్లలపై ఉన్న ప్రేమ, భావోద్వేగాలను తల్లి చూపినంత త్వరగా.. తండ్రి చూపించలేడు. సమయానుసారం.. వాటంతట అవే బయటపడతాయి. అమ్మ చూపినంత ప్రేమ.. నాన్నచూపించడని అనుకుంటారు కానీ.. నిజానికి తల్లి కంటే తండ్రికే ఎక్కువ ప్రేమ ఉంటుంది. ఆ ప్రేమ తన బాధ్యతలను నిర్వర్తించడంలో చూపుతారనేందుకు ఈ ఘటనే నిదర్శనం. తన ట్రై సైకిల్ పై తండ్రి తన ఇద్దరు పిల్లల్ని స్కూలికి తీసుకెళ్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంగవైకల్యం ఉందని ఆ తండ్రి […]
ఎదిగిన కొడుకు వృద్ధిలోకి వస్తే ఆ తల్లిదండ్రుల ఆనందానికి అవధులు ఉండవు. చాలాసార్లు చిన్న విషయాలు కూడా వెలకట్టలేని ఆనందాన్ని అందిస్తాయి. అలాంటిదే ఈ కొడుకు చేసిన పని. జన్మనిచ్చిన వారి విషయంలో ఆతని సున్నితమైన ఆలోచనలు, మంచి మనసుతో అందరి మన్ననలు పొందుతున్నాడు. అమెరికాలో నివాసం ఉంటున్న గౌరవ్ తన తల్లిదండ్రుల అమెరికా పర్యటన కోసం బిజినెస్ క్లాస్ టికెట్లు బుక్ చేశాడు.వాస్తవానికి ఇది చాలా సాధారణమైన విషయం. కానీ, దీని వెనుక అతని భావోద్వేగం, […]