iDreamPost

18 ఏళ్ల క్రితం విడిపోయిన అక్కాతమ్ముళ్లు.. ఎలా కలిశారంటే?

Social Media Reels: ఈ మధ్య సోషల్ మాధ్యమాల పుణ్యమా అని ఎప్పుడో విడిపోయిన కుటుంబ సభ్యులు అనుకోకుండా కలుస్తున్న సంఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. ఇన్ స్ట్రా, ఫేస్ బుక్, వాట్సాప్ ఇలా సోషల్ మాధ్యమాల ద్వారా కలుసుకునే అవకాశం లభిస్తుంది.

Social Media Reels: ఈ మధ్య సోషల్ మాధ్యమాల పుణ్యమా అని ఎప్పుడో విడిపోయిన కుటుంబ సభ్యులు అనుకోకుండా కలుస్తున్న సంఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. ఇన్ స్ట్రా, ఫేస్ బుక్, వాట్సాప్ ఇలా సోషల్ మాధ్యమాల ద్వారా కలుసుకునే అవకాశం లభిస్తుంది.

18 ఏళ్ల క్రితం విడిపోయిన అక్కాతమ్ముళ్లు.. ఎలా కలిశారంటే?

దేశంలో ప్రస్తుతం సోషల్ మీడియాలో పాపులర్ కావాలనే కోరికతో రక రకాల రీల్స్, వీడియోలు చేస్తున్నారు. కొన్ని రీల్స్, వీడియోస్ తో రాత్రికి రాత్రే సెలబ్రెటీలు అయిన వారు కూడా ఉన్నారు. ఇటీవల సోషల్ మాధ్యమాల ద్వారా చెడు ఎంత ఉందో మంచి కూడా అంతే ఉందని ఎన్నో సంఘటనలు రుజువు చేశాయి. సినిమాల్లో చూపించినట్లు చిన్నప్పుడు ఎప్పుడో విడిపోయిన హీరో, హీరోయిన్లు యుక్త వయసుకి వచ్చిన తర్వాత ఏ పుట్టుమచ్చనో.. మరో గుర్తు ద్వారా కుటుంబ సభ్యులు గుర్తు పట్టడం చూస్తుంటాం. ఆ సమయంలో జరిగే ఉద్విగ్నభరిత దృశ్యం కన్నీళ్లు తెప్పించేలా ఉంటాయి. అలాంటి ఓ ఘటన యూపీలోని కాన్పూర్ లో చోటు చేసుకుంది. ఇంతకీ వారు ఎలా కలుసుకున్నారో తెలుసా? వివరాల్లోకి వెళితే..

ఉత్తర్ ప్రదేశ్‌లోని కాన్పూర్ లో ఓ అనూహ్య సంఘటన చోటు చేసుకుంది. చిన్నప్పుడు విడిపోయిన అక్కా తమ్ముడు ఇన్‌స్టా రీల్ ద్వారా కలుసుకోవడంతో వారి మధ్య ఉద్విగ్నభరిత దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఉత్తర్ ప్రదేశ్‌లోని హతిపూర్‌కి చెందిన రాజ్ కుమారి తన మొబైల్ లో రీల్స్ చూస్తుంది. అందులో ఓ వ్యక్తిని ఎప్పుడో చూసినట్లు అనిపించింది. రీల్స్ చేస్తున్న వ్యక్తి పన్ను విరిగి ఉండటం గమనించి 18 ఏండ్ల క్రితం ఇంట్లో నుంచి వెళ్లిపోయిన తన తమ్ముడు బాల్ గోవింద్ లా ఉన్నాడని అనుమానం వచ్చింది. ఈ క్రమంలోనే ఇన్‌స్టాలో అతన్ని సంప్రదించింది. తనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేసి అతని గురించి వాకబు చేసింది. అతడు ఇచ్చిన వివరాలతో తన తమ్ముడు బాల్ గోవింద్ అని నిర్ధారించుకుంది. జైపూర్ లో ఉంటున్న బాల్ గోవింద్ 18 ఏండ్ల తర్వాత తన అక్కతో పాటు కుటుంబ సభ్యులను కలవడంతో ఆనందంతో ఉప్పొంగిపోయాడు.

చిన్నతనంలో గోవింద్ ఉద్యోగం కోసం ముంబై వెళ్లిపోయాడు. అక్కడ అనారోగ్యంతో బాధపడటంతో తిరిగి స్వగ్రామానికి వచ్చే క్రమంలో పొరపాటున రాజస్థాన్ లోని జైపూర్ లో రైలు దిగాడు. అక్కడ ఓ వ్యక్తి గోవింద్ ని తన ప్రాంతానికి తీసుకువెళ్లి ఉద్యోగం ఇప్పించాడు. అలా జైపూర్ లోనే తను ఉండిపోయాడు. కట్ చేస్తే.. 18 ఏండ్ల తర్వాత తన రీల్స్ చూసి అక్క స్పందించడం.. తన వివరాలు తెలుసుకొని మాట్లాడటంతో కుబుంబ సభ్యులకు చేరువయ్యాడు బాల గోవింద్. తన తమ్ముడు తప్పిపోయాడు.. ఇక కనిపించడు అనుకున్న సమయంలో సామాజిక సోషల్ మాధ్యమమే కలిపిందని రాజ్ కుమారి ఎంతో సంతోషం వ్యక్తం చేసింది. ప్రస్తుతం వీరికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి