iDreamPost

వంశీ పక్కన నేత్ర స్థానంలో వచ్చిన ఈ కొత్త అమ్మాయి ఎవరో తెలుసా?

  • Published Jun 27, 2024 | 6:26 PMUpdated Jun 27, 2024 | 6:26 PM

Vamsi Krishna Reddy: మోటివేషనల్‌ స్పీకర్‌ వంశీకృష్ణారెడ్డి.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అయితే గత కొన్ని నెలల క్రితం ఈయన తన భార్య నేత్ర రెడ్డితో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈ విడాకులు అయిన కొద్ది రోజులకే వంశీ తన ఫామ్ కు సంబంధించి మరో కొత్త అమ్మాయిని యాంకర్ గా తీసుకున్నాడని, ఆ అమ్మాయితోనే రిలేషన్ లో ఉన్నాడని రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇంతకి ఆ అమ్మాయి ఎవరంటే..

Vamsi Krishna Reddy: మోటివేషనల్‌ స్పీకర్‌ వంశీకృష్ణారెడ్డి.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అయితే గత కొన్ని నెలల క్రితం ఈయన తన భార్య నేత్ర రెడ్డితో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈ విడాకులు అయిన కొద్ది రోజులకే వంశీ తన ఫామ్ కు సంబంధించి మరో కొత్త అమ్మాయిని యాంకర్ గా తీసుకున్నాడని, ఆ అమ్మాయితోనే రిలేషన్ లో ఉన్నాడని రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇంతకి ఆ అమ్మాయి ఎవరంటే..

  • Published Jun 27, 2024 | 6:26 PMUpdated Jun 27, 2024 | 6:26 PM
వంశీ పక్కన నేత్ర స్థానంలో వచ్చిన ఈ కొత్త అమ్మాయి ఎవరో తెలుసా?

మోటివేషనల్‌ స్పీకర్‌ వంశీకృష్ణారెడ్డి.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ముఖ్యంగా ఎన్నో మోటివేషనల్‌ వీడియోలు చేస్తూ.. యూట్యూబ్‌లో అప్లోడ్‌ చేస్తూ ఎంతో ఫేమస్‌ అయ్యాడు వంశీకృష్ణ. అయితే గత కొన్ని నెలల క్రితం ఈయన పేరు సోషల్ మీడియాలో మారు మోగిన విషయం తెలిసిందే. ఇక అందుకు కారణం వంశీ, నేత్ర రెడ్డిల విడాకులు. సేంద్రియ వ్యవసాయంలో మంచి మంచి విజయం సాధించడమే కాకుండా..అందుకు సంబంధించిన వీడియోలను యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేస్తూ కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది నేత్రా రెడ్డి. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయిన వీరిద్దరూ.. ఒకరిని ఒకరు ఇష్టపడ్డారు. అలాగే రెండేళ్ల క్రితం పెళ్లి కూడా చేసుకున్నారు. అయితే వీరి పెళ్లికి తల్లిదండ్రులు అంగీకరించలేదు. దీంతో వీరిద్దరే వేరుగా కలిసి ఉండేవారు. అంతేకాకుండా.. వీరిద్దరూ వారధి ఫామ్స్‌ అనే కంపెనీ ప్రారంభించి.. దీని ద్వారా సేంద్రీయ వ్యవసాయ ఉత్పత్తులు అమ్మడం ప్రారంభించారు. సేంద్రీయ వ్యవసాయం, ఉత్పత్తులకు సంబంధించిన వీడియోలు అప్లోడ్‌ చేస్తూ.. ఎంతో ఫేమస్‌ అయ్యారు.

ఇలా ఎంతోమంది యువతీయువకులకు ఈ జంట ఆదర్శంగా నిలిచింది అని చెప్పవచ్చు. సంతోషంగా సాగుతున్న వీరి జీవితంలోకి ఏ సమస్యలు వచ్చాయో తెలియదు కానీ.. వీరిద్దరూ విడిపోయారు. తాము విడాకులు తీసుకున్నట్లు సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించారు వంశీకృష్ణ, నేత్రా రెడ్డిలు. అందుకు గల కారణాలు మాత్రం చెప్పలేదు.ఇక ప్రస్తుతానికి ఎవరి దారులు వారు చూసుకుంటూ ఎవరి ఫర్సనల్ లైఫ్ ని వారు లీడ్ చేసుకుంటూ బిజీ అయిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే..ఒకప్పుడు వంశీకృష్ణా ఫామ్ కు సంబంధించి ఆయన మాజీ భార్య నేత్ర రెడ్డి యాంకరింగ్ చేసేవారు. కానీ, తాజాగా వీరు విడాకుల అయిన ఆనంతరం ఇప్పుడు వంశీ ఫామ్ కు సంబంధించి ఓ కొత్త అమ్మాయి యాంకర్ గా వ్యవహారిస్తుంది. అయితే విడాకులు అయిన రెండు నెలలకే నేత్ర స్థానంలో ఈ కొత్త అమ్మాయి రావడం అనేది నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. అంతేకాకుండా.. వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారనే రూమర్స్ వినిపించ సాగాయి. పైగా ఆ అమ్మాయికి తన కంపెనీకు బ్రాండ్ అంబాసిండర్ ను కూడా చేయాలని నిర్ణయించుకున్నాడు వంశీ. ఇంతకి ఆ అమ్మాయి ఎవరు, తన బ్యాక్ గ్రౌండ్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

తాజాగా మోటివేషనల్‌ స్పీకర్‌ వంశీకృష్ణారెడ్డికి సంబంధించి వంశీ ఫామ్ కు ఓ కొత్త అమ్మయి యాంకర్ గా వ్యవహారిస్తుంది. అయితే ఆ అమ్మాయి పేరు ఇందు. ఇక ఆ అమ్మాయి అమెరికాలో ఉండేది.కానీ, తన ఫ్యామిలీ గురించి ఆలోచించిన ఇందు యూఏస్ నుంచి తిరిగి ఇండియాకు వచ్చేసి సొంతంగా తన కాలపై తాను నిలబడాలని ఆలోచన చేసింది. ఈ క్రమంలోనే తనకు ట్రావాల్సింగ్ అంటే చాలా ఇష్టమని మొదటిగా ఇందు ట్రావెల్ వ్లాగ్స్ చేసేది. ఇక ఆ తర్వాత.. అనుకోకుండా.. వంశీ ఫామ్ నుంచి అవకాశం రావడంతో ఇందు ముందు తన తల్లిదండ్రులకు ఈ విషయం చెప్పి వారి నిర్ణయం మీద వంశీ ఫామ్ లో చేరింది. ఈ క్రమంలోనే వీరిద్దరూ కలిసి ప్రస్తుతం చాలా వాల్గ్స్ చేస్తున్నారు. అయితే బాగా లగ్జరీ గా ఉన్నా అమ్మాయి ఇలా తక్కవ జీతానికి వంశీ దగ్గర వర్క్ చేయడం నిజంగా ఆశ్చర్యకరంగా ఉందని, అలాగే వీరిద్దరూ రిలేషన్ షిప్ లో ఉన్నారని టాక్ గత కొన్ని రోజులుగా జోరుగా వినిపిస్తుంది.

కానీ, తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వంశీ,ఇందు తాము ఇద్దరం ఫ్రొపెషనల్ గా మంచి స్నేహితులు మాత్రమే, వర్క్ పరంగా ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటున్నామని వంశీ తెలియజేశారు. అలాగే ఇందు కూడా వంశీ ఫామ్ లో తనకు అవకాశం వచ్చినప్పుడే ఈ నెగిటివ్ కామెంట్స్ వినిపిస్తాయని తాను ముందే ఊహించనని, అయితే మొదటిలో చాలా ఈ రూమర్స్ విని చాలా బాధపడ్డాను. కానీ, ఆ తర్వాత.. అనుకున్నవాళ్లు చాలానే అనుకుంటారు. అవన్నీ పట్టించుకుంటే లైఫ్ లో ముందుకు వెళ్లాలేం. మనమేంటో మనకి మన తల్లిదండ్రులకు తెలిస్తే చాలని అన్నారు.అలాగే ఇక తన ఫ్యామిలీ మొత్తం ఎంతో సపోర్ట్ చేస్తారని ఇందు చెప్పుకొచ్చారు. ఇక వంశీ విషయానికొస్తే.. ఆయన చాలా మంచివాళ్లు. తన వద్ద నేను చాలా నేర్చుకుంటున్నాను అని ఆమె పేర్కొన్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి