iDreamPost
android-app
ios-app

రోహిత్‌ శర్మ ఎంట్రీతో వింబుల్డన్‌లో సరికొత్త రికార్డు!

  • Published Jul 16, 2024 | 2:42 PM Updated Updated Jul 16, 2024 | 2:42 PM

Rohit Sharma, Wimbledon, Social Media: టీమిండియా స్టార్‌ క్రికెటర్‌, వన్డే, టెస్ట్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ రాకతో వింబుల్డన్‌లో ఓ సరికొత్త రికార్డు నమోదు అయింది. మరి ఆ రికార్డు ఏంటో ఎలా క్రియేట్‌ అయిందో ఇప్పుడు చూద్దాం..

Rohit Sharma, Wimbledon, Social Media: టీమిండియా స్టార్‌ క్రికెటర్‌, వన్డే, టెస్ట్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ రాకతో వింబుల్డన్‌లో ఓ సరికొత్త రికార్డు నమోదు అయింది. మరి ఆ రికార్డు ఏంటో ఎలా క్రియేట్‌ అయిందో ఇప్పుడు చూద్దాం..

  • Published Jul 16, 2024 | 2:42 PMUpdated Jul 16, 2024 | 2:42 PM
రోహిత్‌ శర్మ ఎంట్రీతో వింబుల్డన్‌లో సరికొత్త రికార్డు!

టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మకు అరుదైన ఘనత దక్కింది. అతని ఎంట్రీతో వింబుల్డన్‌లో సరికొత్త రికార్డు నమోదైంది. ఇటీవల టీ20 వరల్డ్‌ కప్‌ 2024 గెలిచిన కెప్టెన్‌గా ప్రశంసలు పొందుతున్న రోహిత్‌ శర్మ ఫుల్‌హ్యాపీగా ఉన్నాడు. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తూ.. దాని కోసమే కష్టపడుతున్న సమయాన్ని ఇటీవలె ఆస్వాదించాడు. అది కూడా కెప్టెన్‌గా జట్టుని ముందుండి నడిపించి భారత జట్టును టీ20 వరల్డ్‌ ఛాంపియన్‌గా నిలబెట్టాడు. దీంతో.. రోహిత్‌ శర్మ ఎక్కడి వెళ్లినా క్రికెట్‌ అభిమానులు బ్రహ్మరథం పడుతున్నారు. తాజాగా రోహిత్‌ శర్మ వింబుల్డన్‌ గ్రాండ్‌స్లామ్‌ పోటీలు చూసేందుకు వెళ్లాడు.

గతంలో చాలా మంది క్రికెటర్లు టెన్నిస్‌ పోటీలు చూసేందుకు వెళ్లారు. టీమిండియా దిగ్గజ మాజీ క్రికెటర్‌ సచిన్‌ టెండూల్కర్‌, విరాట్‌ కోహ్లీ, ధోని ఇలా చాలా మందే వెళ్లి టెన్నిస్‌ మ్యాచ్‌లు చూశారు. తాజాగా రోహిత్‌ శర్మ కూడా వెళ్లాడు. అయితే.. ఈ వింబుల్డన్‌ పోటీలు చూసేందుకు వెళ్లిన సమయంలో క్రికెటర్లు సూటూ బూటు వేసి.. చాలా డిగ్నిటిగా ఉంటారు. రోహిత్‌ శర్మ కూడా అదిరిపోయే సూట్‌ వేసి.. వింబుల్డన్‌ పోటీలు చూసేందుకు వెళ్లాడు. రోహిత్‌ శర్మ స్టైలిష్‌ లుక్స్‌ సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అయ్యాయి.

సూట్‌లో టీమిండియా కెప్టెన్‌ అదిరిపోయాడంటూ క్రికెట్‌ అభిమానులు రోహిత్‌ శర్మ ఫొటోలను తెగ షేర్‌ చేశారు. అలాగే గతంలో వింబుల్డన్‌ పోటీలకు హాజరైన క్రికెటర్ల ఫొటోలు పక్కపక్కన పెట్టి ఎవరు స్టైలిష్‌గా ఉన్నారంటూ అభిప్రాయాలు కూడా అడిగారు. అయితే.. ఈ క్రమంలోనే వింబుల్డన్‌ అధికారిక సోషల్‌ మీడియా అకౌంట్‌ ఒక రికార్డును నమోదు చేసింది. 2024 సెషన్‌లో అత్యధిక ఎంగేజ్‌ అయిన పోస్టుగా రోహిత్‌ శర్మ ఫొటోలు నిలిచాయి. వింబుల్డన్‌ అకౌంట్‌లో రోహిత్‌ శర్మ ఫొటోలు పెడితే ఏకంగా 4.4 మిలియన్‌ లైక్స్‌ వచ్చాయంటా.. 2024 సెషన్‌లో ఇదే అత్యధికం. దీంతో.. రోహిత్‌ శర్మ, వింబుల్డన్‌ కాంబో అదిరిపోయిందంటూ క్రికెట్‌ అభిమానులు పేర్కొంటున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss