Dharani
IMD, Heavy Rains In TG-School Holiday, Social Media: రానున్న మూడు రోజులు జోరు వానలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు అలర్ట్ జారీ చేయడంతో.. విద్యా సంస్థలకు సెలవు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఆ వివరాలు..
IMD, Heavy Rains In TG-School Holiday, Social Media: రానున్న మూడు రోజులు జోరు వానలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు అలర్ట్ జారీ చేయడంతో.. విద్యా సంస్థలకు సెలవు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఆ వివరాలు..
Dharani
రెండు తెలుగు రాష్ట్రాల్లో జోరు వానలు కురుస్తున్నాయి. గత రెండు, మూడు రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దాంతో పలు ప్రాంతాల్లో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. అనేక ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఇళ్లల్లోకి నీరు చేరి జనాలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. రోడ్లు కొట్టుకుపోయి.. రవాణా సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరో మూడు నుంచి నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. వాతావరణ శాఖ అధికారులు చెప్పుకొస్తున్నారు. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో.. విద్యాసంస్థలకు సెలవు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఆ వివరాలు..
తెలంగాణలో శనివారం నుంచి వాన ముసురు వదలడం లేదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ముసురు కొనసాగగా.. రాత్రి సమయంలో మాత్రం వర్షం దంచికొడుతుంది. ఇక మరో మూడు రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా జోరు వానలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ నేపథ్యంలో.. విద్యాసంస్థలకు సెలవు ఇవ్వాలంటూ సోషల్ మీడియా వేదికగా పలువురు డిమాండ్ చేస్తున్నారు.
భారీ వర్షం వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని.. ట్రాఫిక్ జామ్, అలానే ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఉన్నందున.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న విద్యా సంస్థలకు సెలవు ఇవ్వాలని పలువురు నెటిజనుల సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేస్తున్నారు. పోస్టులు పెడుతున్నారు. విద్యార్థుల భద్రతను దృష్టిలో పెట్టుకుని.. ప్రభుత్వం దీనిపై స్పందించి.. సెలవు ఇవ్వాలని నెటిజనులు కోరుతున్నారు. మరి దీనిపై కాంగ్రెస్ సర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
ఇక జోరు వానల నేపథ్యంలో.. ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో ఇప్పటికే స్కూళ్లకు సెలవు ప్రకటించారు. ఏపీ వ్యాప్తంగా నేడు అనగా సోమవారం నాడు పలు జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు ఇస్తూ.. ఆదేశాలు జారీ చేశారు. దాంతో తెలంగాణలో కూడా విద్యాసంస్థలకు సెలవు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇక ఇదిలా ఉండగా.. తెలంగాణలో మరో మూడు రోజులు, ఏపీలో రెండు రోజులు వర్షాలు కురుస్తాయని రెండు రాష్ట్రాల వాతావరణ శాఖల అధికారులు వెల్లడించారు. ఇక గత రెండు రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో.. పగటివేళంతా ముసురు వానలు కురుస్తుండగా.. రాత్రిళ్లు మాత్రం దంచికొడుతున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. మరోవైపు గోదావరి, కృష్ణా నదులు వరద నీటి రాకతో ఉరకలెత్తుతున్నాయి. గోదావరికి భారీ వరద వస్తున్న నేపథ్యంలో.. భద్రాచలంలో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.