iDreamPost
android-app
ios-app

Janhvi kapoor: డబ్బులిచ్చి పొగిడించుకునేంత బడ్జెట్‌ నా వద్ద లేదు : జాన్వీ కపూర్

  • Published Jul 26, 2024 | 4:36 PM Updated Updated Jul 26, 2024 | 4:36 PM

Janhvi kapoor Comments about Social Media: బాలీవుడ్ అందాల తార జాన్వీ కపూర్ ప్రస్తుతం హిందీ, తెలుగులో బ్యాక్ టూ బ్యాక్ మూవీస్ లో నటిస్తు బిజీగా ఉంది. ఇండస్ట్రీలో తల్లికి తగ్గ తనయ గా పేరు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తుంది.

Janhvi kapoor Comments about Social Media: బాలీవుడ్ అందాల తార జాన్వీ కపూర్ ప్రస్తుతం హిందీ, తెలుగులో బ్యాక్ టూ బ్యాక్ మూవీస్ లో నటిస్తు బిజీగా ఉంది. ఇండస్ట్రీలో తల్లికి తగ్గ తనయ గా పేరు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తుంది.

  • Published Jul 26, 2024 | 4:36 PMUpdated Jul 26, 2024 | 4:36 PM
Janhvi kapoor: డబ్బులిచ్చి పొగిడించుకునేంత బడ్జెట్‌ నా వద్ద లేదు : జాన్వీ కపూర్

సినీ ఇండస్ట్రీలోకి ఎంతో మంది స్టార్ హీరో, హీరోయిన్లు, దర్శక, నిర్మాతల వారసులు హీరో, హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చారు. కానీ చాలా కొద్ది మంది మాత్రమే సక్సెస్ బాటలో నడుస్తున్నారు. ఎంత బ్యాగ్ గ్రౌండ్ ఉన్నా కాలం కలిసి రాక కనుమరుగైన వారు ఎంతోమంది ఉన్నారు. భారత దేశ చలన చిత్ర రంగంలో అతిలోక సుందరిగా పేరు తెచ్చుకున్న నటి శ్రీదేవి. బాల నటిగా కెరీర్ మొదలు పెట్టి చలన చిత్ర రంగంలో నెంబర్ వన్ హీరోయిన్ గా ఎదిగింది. తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో తనకు తాను సాటి అనిపించుకుంది. బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ ని పెళ్లి చేసుకుంది. ఈ జంటకు జాన్వీ కపూర్, ఖుషి కపూర్ లు జన్మించారు. ప్రస్తుతం బాలీవుడ్ లో జాన్వీ కపూర్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంత చేసుకుంది. తాజాగా తనపై వస్తున్న పుకార్లపై స్పందించింది జాన్వీ. వివరాల్లోకి వెళితే..

ఇటీవల సోషల్ మీడియాలో ఇదితో పులి అంటే.. అదిగో తోక అన్న చందంగా సెలబ్రెటీలకు సంబంధించిన ప్రతి న్యూస్ క్షణాల్లో వైరల్ గా మారుతున్నాయి. వెంటనే ఈ వార్తలపై సెలబ్రెటీలు క్లారిటీ ఇవ్వాల్సి వస్తుంది. కొన్నిసార్లు పుకార్లు తారాస్థాయికి వెళ్లడంతో నెటిజన్లు, మీడియాపై చిందులు వేస్తున్న సందర్భాలు ఉన్నాయి. తాజాగా జాన్వీ నటించిన ‘ఉలఝ్’మూవీ ప్రమోషన్ లో బిజీగా ఉంది.. ఈ సందర్భంగా సోషల్ మాధ్యమాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘నేను మీ అందరి గురించి ఏమని చెప్పాలి.. నాపై నాకుం చాలా నమ్మకం ఉంది. అద్భుతంగా నటిస్తాను అని చెప్పాలా? అలా సొంత డప్పాలు కొట్టుకోవడం నా వల్ల కాదు. నా గురించి ఆడియన్స్ మాత్రమే తీర్పు చెప్పాలి.. నా నటన గురించి ప్రేక్షకులే తుది నిర్ణయం చెప్పాలి, నాకు వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాను. ఇక్కడ మనల్ని పొగిడే వారి కన్నా తిట్టేవారు ఉంటారు. ఆన్ లైన్ వేదికగా నెటిజన్లు నన్ను ప్రశంసిస్తే ఎవరో పీఆర్ ని పెట్టుకొని అలా చేయిస్తున్నారని మాట్లాడుతారు. నిజం చెప్పాలంటే అలాంటి వాటికి నేను చాలా దూరంగా ఉంటా.. ఎందుకంటే నా వద్ద అంత డబ్బు లేదు.. నేను ఖర్చు చేయలేను’ అని చెప్పింది.

ప్రస్తుం తాను నటిస్తున్న ‘ఉలఝ్’ మూవీ గురించి మాట్లాడుతూ.. ‘జాతీయ అవార్డు గ్రహీత సుధాంశు సరియా ఈ మూవీ తెరకెక్కిస్తున్నారు. ఆయన ప్రాజెక్ట్ లో నేను నటిస్తానని కల్లో కూడా ఊహించలేదు. వాస్తవానికి నాకు కథ గురించి మొత్తం చెప్పలేదు. కొంత వరకు స్క్రిప్ట్ చదివి చెప్పి.. మిగిలినది చదవి నిర్ణయం తీసుకో అని చెప్పారు. తిరుపతి వెళ్లే సమయంలో మొత్తం చదివా.. ఆ మూవీ నాకు మంచి బ్రేక్ ఇస్తుందని నమ్మకం కలిగింది’ అని చెప్పారు. ఈ మూవీలో జాన్వీ కపూర్ ఇండియన్ ఫారిన్ సర్వీస్ అధికారిగా కనిపించబోతున్నారు. పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీలో గుల్షన్ దేవయ్య, రాజేష్ థైలాండ్ నటిస్తున్నారు. ఈ మూవీ ఆగస్టు 2 న రిలీజ్ కానుంది. మరోవైపు కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ యన్టీఆర్ నటిస్తున్న ‘దేవర’ మూవీతో టాలీవుడ్ లోకి అడుగు పెడుతుంది జాన్వీ కపూర్.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss