iDreamPost
android-app
ios-app

Manchu Lakshmi: కుమార్తె కోసం మంచు లక్ష్మి పోస్ట్‌.. సాయం చేయమని కోరుతూ

  • Published Jul 05, 2024 | 10:35 AM Updated Updated Jul 05, 2024 | 10:35 AM

సోషల్‌ మీడియాలో సూపర్‌ యాక్టీవ్‌గా ఉండే మంచు లక్ష్మి.. తాజాగా అదే వేదిక మీదుగా.. సాయం కోరుతూ చేసిన పోస్ట్‌ వైరల్‌గా మారింది. ఆ వివరాలు.

సోషల్‌ మీడియాలో సూపర్‌ యాక్టీవ్‌గా ఉండే మంచు లక్ష్మి.. తాజాగా అదే వేదిక మీదుగా.. సాయం కోరుతూ చేసిన పోస్ట్‌ వైరల్‌గా మారింది. ఆ వివరాలు.

  • Published Jul 05, 2024 | 10:35 AMUpdated Jul 05, 2024 | 10:35 AM
Manchu Lakshmi: కుమార్తె కోసం మంచు లక్ష్మి పోస్ట్‌.. సాయం చేయమని కోరుతూ

మంచు లక్ష్మి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. మోహన్‌ బాబు కుమార్తెగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మంచు లక్ష్మి.. సినిమాల్లో ప్రాధాన పాత్రల్లో నటించడమే కాక.. పలు షోలకు వ్యాఖ్యతగా వ్యవహరిస్తూ.. అభిమానులను సంపాదించుకుంది. అయితే హాలీవుడ్‌లో కూడా మంచు లక్ష్మి తన సత్తా చాటింది. ముందుగా హాలీవుడ్‌లోనే నటిగా ఎంట్రీ ఇచ్చింది. ఇక సోషల్‌ మీడియాలో మంచు ఫ్యామిలీ మీద వచ్చినన్న ట్రోల్స్‌ ఎవరి మీద రావు. మంచు లక్ష్మిని కూడా చాలా మంది ట్రోల్‌ చేస్తారు. కానీ వాటిని పెద్దగా పట్టించుకోదు. అలా అని సోషల్‌ మీడియాకు కూడా దూరంగా ఉండదు. ఇన్‌స్టా, ట్విట్టర్‌, యూట్యూబ్‌లో ఆమెకు ఖాతాలున్నాయి. ఎప్పటికిప్పుడు వీడియోలు, ఫోటోలు పోస్ట్‌ చేస్తుంటారు. ఈ క్రమంలో తాజాగా సోషల్‌ మీడియా వేదికగా సాయం కోరుతూ ఆమె చేసిన పోస్ట్‌ వైరల్‌గా మారింది. ఆ వివారలు..

మంచు లక్ష్మి తన కుమార్తె విషయంలో సాయం కోరుతూ చేసిన పోస్ట్‌ నెట్టింట వైరల్‌గా మారింది. తన కుమార్తె కోసం అమెరికా వెళ్లేందుకు సాయం చేయాలని కోరింది. తన కూతురికి పాఠశాల సెలవులు త్వరలోనే ముగియనున్నాయని ఇన్‌స్టా వేదికగా తెలిపింది. ఈమేరకు మంచు లక్ష్మి ‘‘నా అమెరికా వీసా ఒక నెల క్రితమే ఆమోదించారు. కానీ ఇప్పటి వరకు అది నాకు అందలేదు. నా కూతురు స్కూల్‌ హాలీడేస్‌ ముగిశాయి. నేను వెళ్లాల్సిన ప్లైట్‌ జూన్‌ 12న ఉంది. నాకు వీసా ఇంకా అందలేదు. ఎంబసీ వెబ్‌సైట్ డౌన్ కావడంతో.. వారిని సంప్రదించడానికి నాకు మార్గం లేకుండా పోయింది. ఇప్పటికే రెండు నెలలు దాటింది. దయచేసి ఎవరైనా స్పందించి సహాయం చేయగలరా’’అంటూ పోస్ట్ చేసింది. భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయంతో పాటు రాయబారి ఎరిక్‌ గార్సెట్టి సామాజిక మాధ్యమాల ఖాతాలనూ ట్యాగ్‌ చేస్తూ తన పరిస్థితి వివరించి.. సాయం చేయాలని కోరింది మంచు లక్ష్మి.

అంతేకాక ‘‘నాకు అమెరికా వీసా జారీ అయ్యి నెల రోజులకు పైగానే అవుతుందని ఎంబసీ వివరించింది. కానీ ఎంబసీ కార్యాలయం సైట్‌లో నెట్‌వర్క్‌ ప్రాబ్లం కారణంగా.. నాకింక వీసా అందలేదు. ఆలస్యమైంది. మరోవైపు నా బిడ్డ స్కూల్‌ తెరిచే సమయం దగ్గర పడుతుంది. ఈ విషయంలో ఎవరైనా నాకు సాయం చేయగలరా’’ అంటూ సోషల్ మీడియా వేదికగా అభిమానులను అభ్యర్థించింది. ఇక మంచు లక్ష్మి పోస్ట్‌ చూసిన వారు ఆమెకు రకరకాల సలహాలు ఇస్తున్నారు. మరి కొందరు సేమ్‌ మాకు ఇదే సమస్య అని కామెంట్స్‌ చేస్తున్నారు.

ఆ సంగతి పక్కకు పెడితే.. మంచు లక్ష్మి బుధవారం నాడు వరలక్ష్మీ శరత్ కుమార్ రిసెప్షన్ వేడుకల్లో సందడి చేసిన సంగతి తెలిసిందే. చాలా రోజుల తరువాత చెన్నై మిత్రులతో కలిసి ఇలా సందడి చేశానని, చాలా ఆనందంగా గడిపానని చెప్పుకొచ్చింది. ఇక సినిమాల విషయానికి వస్తే.. మంచు లక్ష్మి చివరగా ఓటీటీలో వచ్చిన యక్షిణిలో కనిపించింది. ఈ మూవీలో మంచు లక్ష్మి కీలక పాత్రలో నటించి.. ఆకట్టుకుంది. ఆదిపర్వం అనే మరో సినిమాతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

 

View this post on Instagram

 

A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu)

jojobet girişmarsbahiscasibomJojobet GirişcasibomJojobet GirişHoliganbetcasibom girişholiganbetvaycasinomarsbahis girişJojobetiptv satın aljojobet güncelHoliganbet Girişjojobet günceljojobet güncel