2017లో వచ్చిన నాని ఎంసిఎ మిడిల్ క్లాస్ అబ్బాయి గుర్తుందిగా. వకీల్ సాబ్ కన్నా ముందు దర్శకుడు వేణు శ్రీరామ్ సినిమా ఇదే. సాయిపల్లవి హీరోయిన్ గా నటించిన ఈ మూవీ కమర్షియల్ గా ఇప్పటికీ న్యాచులర్ స్టార్ కెరీర్ లో టాప్ వన్ ప్లేస్ లో ఉంది. ఇటీవలే వచ్చిన అంటే సుందరానికి దాకా ఏదీ దాన్ని క్రాస్ చేయలేకపోయాయి. ఇప్పటికీ టీవీలో వచ్చిన ప్రతిసారి మంచి రేటింగ్స్ తెచ్చుకునే ఎంసిఎ ఇప్పుడు హిందీలో రీమేక్ […]
దీపముండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి. సక్సెస్ మాత్రమే కొలమానంగా నడిచే సినిమా పరిశ్రమలో కేవలం గ్లామర్ నే నమ్ముకుంటే లాభం లేదు. ఏదో ఒకనాడు వరస ఫ్లాపులు చుట్టుముడితే కెరీర్ ఆగిపోతుంది. అందుకే ఆదాయానికి లోటు లేకుండా చూసుకోవడం చాలా అవసరం. లేకపోతే ఏమవుతుందో సావిత్రి గారి జీవితంలో చూశాంగా. అందుకే హీరోలకు ధీటుగా ఇప్పటి హీరోయిన్లు బిజినెస్ ఇన్వెస్టర్ల అవతారం ఎత్తి తమ రెమ్యునరేషన్లకు సేఫ్ సైడ్ చూసుకుంటున్నారు. అదెలాగో చూద్దాం. ఇందులో బాలీవుడ్ భామలు ఎక్కువ […]
కొన్ని రీమేకుల ముచ్చట్లు విచిత్రంగా ఆసక్తికరంగా ఉంటాయి. పక్క భాషలో ఆడేసింది కదాని ఇక్కడికి తీసుకొచ్చి చూపిస్తే మన ఆడియెన్స్ కి నచ్చకపోవచ్చు. అలాంటి ఒక ముచ్చట చూద్దాం. 1996లో కార్తీక్ హీరోగా సుందర్ సి దర్శకత్వంలో ‘ఉల్లతయ్ అల్లితా’ వచ్చింది. శిర్పి సంగీతం అందించగా రంభ హీరోయిన్ గా నటించింది. నిజానికి ఇది కూడా ఒరిజినల్ కథ కాదు. 1968లో రిలీజైన ‘బొమ్మలాట్టం’ నుంచి మెయిన్ లైన్ తీసుకుని అంతకు ముందు 1958లో విడుదలైన ‘శభాష్ […]
14 ఏళ్ళ తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన ఏ స్టార్ హీరోయిన్ కైనా సెకండ్ ఇన్నింగ్స్ ని గ్రాండ్ గా మొదలుపెట్టాలని ఉంటుంది. కానీ ఊహించని విధ్దంగా రెండువైపులా షాకులు తినాల్సి వస్తే మాత్రం అది విచిత్రమే. ప్రస్తుతం సాగర కన్య శిల్పాశెట్టికి అలాంటి పరిస్థితి వచ్చింది. నిన్న ఓటిటిలో నేరుగా రిలీజైన హంగామా 2ని క్రిటిక్స్ మాములుగా ఆడుకోవడం లేదు. ఈ దశాబ్దంలోనే అతి పెద్ద కామెడీ డిజాస్టర్ గా దీన్ని వర్ణిస్తూ ఏకంగా వన్ […]
హీరో అజ్ఞాతంలో ఉంటూ బయటికి కనిపించకుండా విలన్ల భరతం పట్టే కాన్సెప్ట్ తో చాలా సినిమాలు వచ్చాయి కానీ ఒక ప్రత్యేకమైన ముద్ర వేసినవి మాత్రం తక్కువే. 1996లో ‘భారతీయుడు’ విజయం కొత్త తరహా ఆలోచనలకు ఆజ్యం పోసింది. సమాజంలో తప్పులు, నేరాలు చేసినవాళ్లకు ఒక సామాన్యుడు అందులోనూ వృద్ధుడు శిక్షలు వేయడాన్ని జనం బ్రహ్మాండంగా ఆదరించారు. దాన్ని ఇంకో కోణంలో అలోచించి దర్శకుడు తిరుపతిస్వామి 2000 సంవత్సరంలో తీసిన చిత్రమే ఆజాద్. ఆసుపత్రుల్లో జరిగే దురాగతాలను […]
తెలుగు సినిమాను మాస్ ఆడియన్స్ పరంగా విపరీతంగా ప్రభావితం చేసిన దర్శకుల్లో కె రాఘవేంద్రరావు గారిది ప్రత్యేక స్థానం. అడవి రాముడుతో మొదలుకుని ఘరానా మొగుడు దాకా ఇండస్ట్రీ రికార్డులు సాధించిన ఆణిముత్యాలు ఎన్నో. అందుకే వంద సినిమాల ప్రస్థానంలో ఈయన అందుకున్న పరాజయాలు తక్కువే. కాని ఒక్కోసారి లెక్కలు మారి అంచనాలు మితిమీరి దెబ్బ తినడం ఇలాంటి తలపండిన దర్శకేంద్రులకు కూడా జరుగుతుంది. 1996లో అలాంటి అనుభవమే ఎదురయ్యింది. వెంకటేష్ హీరోగా బూరుగుపల్లి శివరామకృష్ణ నిర్మాణంలో […]
https://youtu.be/