శిల్పా శెట్టి.. పాన్ ఇండియా లెవల్లో ఈ స్టార్ హీరోయిన్ గురించి ఎలాంటి పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు. వయసు ఐదు పదులకు దగ్గర పడుతున్నా ఇప్పటికీ యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇచ్చేలా ఉంటుంది. వయసుతో పాటు ఆమె అందం కూడా పెరుగిపోతోంది అంటూ ఫ్యాన్స్ ప్రశంసిస్తూ ఉంటారు. తెలుగులో కూడా ఇప్పటికీ ఆమెకు ఎంతో ఫాలోయింగ్ ఉంది. ఆమె భర్త రాజ్ కుంద్రా కూడా పాన్ ఇండియా లెవల్లో బాగా ఫేమస్. ప్రస్తుతం ఆయన తన భార్య, మరదలిని ఉద్దేశించి చేసిన కొన్ని వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.
రాజ్ కుంద్రా పేరు దేశవ్యాప్తంగా మారు మోగిన విషయం తెలిసిందే. 2021లో నీలి చిత్రాలు నిర్మిస్తున్నారనే ఆరోపణలతో అరెస్టు అయ్యారు. ఆర్థర్ రోడ్డు జైలులో రెండు నెలలు గడిపారు. ఆ తర్వాత బెయిల్ పై విడుదల అయ్యారు. తర్వాతి నుంచి బయట పెద్దగా కనిపించడం లేదు. ఒకవేళ వచ్చినా కూడా ఏదో ఒక కొత్తరకం మాస్క్ వేసుకుని తిరుగుతున్నారు. అయితే ఆయనకు సంబంధించిన ఒక పాత వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. కామెడీ షోకి రాజ్ కుంద్రా తన భార్య శిల్పాశెట్టి, మరదలు షమితా శెట్టితో కలిసి హాజరయ్యారు. ఆ షోలో మాట్లాడుతూ వారి బంధం ఎలా ఉంటుందో ఫన్నీగా వివరించాడు. “నా భార్య పక్కా ఫ్యామిలీ టైప్. 7 గంటలకు తినేస్తుంది. పుస్తకం చదువుకుంటుంది. 9 గంటల కల్లా నిద్రపోతుంది.
నాకేమో బయటకు వెళ్లాలి, పార్టీలు చేసుకోవాలి అని ఉంటుంది. ఎప్పుడన్నా పార్టీకి వెళ్లాలి అనిపిస్తే.. తను నిద్రపోగానే వెంటనే మరదలికి కాల్ చేస్తాను. ఇలా పార్టీకి వెళ్దామా అని అడుగుతాను. ఆమె ఎప్పుడూ నో చెప్పదు. వెంటనే వచ్చేస్తుంది. ఎంచక్కా ఆమెతో కలిసి పార్టీకి వెళ్తాను. అందుకే నేను ఆమె పెళ్లి విషయంలో ఎప్పుడూ ఫోర్స్ చేయను” అంటూ రాజ్ కుంద్రా కామెంట్స్ చేశాడు. అతని మాటలను శిల్పా శెట్టి కూడా ఎంజాయ్ చేయడమే కాకుండా.. శెట్టి సిస్టర్స్ ప్యాకేజ్ డీల్ అంటూ చెప్పుకొస్తుంది. ఈ వీడియో అప్పుడు మిస్ అయిన వాళ్లంతా ఇప్పుడు చూసి నోరెళ్లబెడుతున్నారు. కొందరు మాత్రం రాజ్ కుంద్రాకు అలా కలిసొచ్చిందిలే అంటూ కామెంట్స్ చేస్తున్నారు.