iDreamPost
android-app
ios-app

ఇటు సినిమా ఫ్లాపు అటు పోలీస్ కేసు

  • Published Jul 24, 2021 | 12:39 PM Updated Updated Jul 24, 2021 | 12:39 PM
ఇటు సినిమా ఫ్లాపు అటు పోలీస్ కేసు

14 ఏళ్ళ తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన ఏ స్టార్ హీరోయిన్ కైనా సెకండ్ ఇన్నింగ్స్ ని గ్రాండ్ గా మొదలుపెట్టాలని ఉంటుంది. కానీ ఊహించని విధ్దంగా రెండువైపులా షాకులు తినాల్సి వస్తే మాత్రం అది విచిత్రమే. ప్రస్తుతం సాగర కన్య శిల్పాశెట్టికి అలాంటి పరిస్థితి వచ్చింది. నిన్న ఓటిటిలో నేరుగా రిలీజైన హంగామా 2ని క్రిటిక్స్ మాములుగా ఆడుకోవడం లేదు. ఈ దశాబ్దంలోనే అతి పెద్ద కామెడీ డిజాస్టర్ గా దీన్ని వర్ణిస్తూ ఏకంగా వన్ రేటింగ్స్ ఇచ్చారు. దీన్ని బట్టి సినిమా ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. పైగా ప్రియదర్శన్ లాంటి గొప్ప దర్శకుడు ఇంత నాసిరకం ఎంటర్ టైనర్ ఇస్తారని ఎవరు మాత్రం ఊహిస్తారు. ఇక్కడితో అయిపోలేదు.

భర్త రాజ్ కుంద్రా పోర్న్ వీడియోల కేసులో ఇరుక్కుని ఏకంగా పోలీస్ రిమాండులో ఉండటం ఇప్పటికే నేషనల్ సెన్సేషన్ అయ్యింది. ఏ మీడియాలో చూసినా దీని తాలూకు వార్తలే. తన తప్పుడు పనిని రాజ్ సమర్ధించుకునే ప్రయత్నం చేసినప్పటికీ న్యాయస్థానం అవేవి వినలేదు. కస్టడీని పొడిగించింది. పదుల సంఖ్యలో వీడియోలకే కోట్లాది రూపాయలు డీల్ చేశాడన్న టాక్ కూడా ముంబైలో జోరుగా వినిపిస్తోంది. ఇప్పుడిది శిల్ప శెట్టికి సైతం తలనెప్పిగా మారింది. ఏదో వేదాంత ధోరణిలో నిన్నో ట్వీట్ చేసింది కానీ అసలు కట్టుకున్న భార్యకు తెలియకుండా రాజ్ కుంద్రా ఇంత కథ నడిపించాడా అనే అనుమానాలు లేకపోలేదు.

శిల్పా శెట్టి చివరిగా ఫుల్ లెన్త్ రోల్ చేసిన సినిమా 2007లో వచ్చిన అప్నే. ఆ తర్వాత ఓం శాంతి ఓం, డిషికియాన్, దోస్తానాలో స్పెషల్ అప్పీయరెన్స్ ఇచ్చింది కానీ పూర్తి స్థాయి క్యారెక్టర్లు కాదు. ఇప్పుడు మళ్ళీ 2021లో హంగామా 2తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఒకపక్క భర్త మీద పోలీసు కేసు, మరోవైపు కొత్త సినిమా దారుణమైన రిపోర్ట్స్ చూసి శిల్పాకు నిజంగా బ్యాడ్ టైం అని చెప్పొచ్చు. తెలుగులో సాహసవీరుడు సాగరకన్య, ఆజాద్ లాంటి స్ట్రెయిట్ మూవీస్ చేసిన ఈ బాలీవుడ్ బ్యూటీ ప్రస్తుతం నికమ్మ అనే మరో హిందీ చిత్రం చేసింది. త్వరలో విడుదల కానున్న ఈ మూవీ ఫలితం ఎలా ఉంటుందో

Also Read: హంగామా 2 రిపోర్ట్

Also Read: సార్పట్ట ఒక అద్భుతం

Jojobet GirişmeritbetmeritbetholiganbetHoliganbet girişcasibomJojobet GirişcasibomjojobetjojobetcasibomromabetMadridbetMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin Girişdeneme bonusu veren sitelerCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/superbetincasibomholiganbet girişdirect to wallet crypto swap