iDreamPost
android-app
ios-app

హీరోయిన్‌ శిల్పా శెట్టిని భయపెడుతున్న టమాటాలు!

  • Published Jul 21, 2023 | 12:14 PM Updated Updated Jul 21, 2023 | 12:14 PM
  • Published Jul 21, 2023 | 12:14 PMUpdated Jul 21, 2023 | 12:14 PM
హీరోయిన్‌ శిల్పా శెట్టిని భయపెడుతున్న టమాటాలు!

టమాటాలను చూస్తే బాలీవుడ్‌ హీరోయిన్‌ శిల్పా శెట్టి గుండె దడ పెరుగుతోందట. ఈ మాట ఎవరో అన్నది కాదు.. స్వయంగా ఆమే అన్నారు. ఇంతకీ ఆమె ఈ మాట ఎందుకన్నారంటే.. శిల్పా శెట్టి సోషల్‌ మీడియాలో చాలా యాక్టీవ్‌గా ఉంటారన్న సంగతి తెలిసిందే. ఆమె తనకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు తన సోషల్‌ మీడియా ఖాతాల ద్వారా అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. అప్పుడప్పుడు కొన్ని ఫన్నీ వీడియోలు కూడా షేర్‌ చేస్తూ ఉంటారు.

ప్రస్తుతం దేశంలో టమాటా ధరలు ఆకాశాన్ని అంటిన సంగతి తెలిసిందే. టమాటా ధరలపై ఆమె ఓ ఫన్నీ వీడియో చేశారు. షాపింగ్‌ కోసం సూపర్‌ మార్కెట్‌కు వెళ్లిన ఆమె టమాటాల దగ్గర ఈ వీడియోను చిత్రీకరించారు. ఆ వీడియోకు ఆమె ‘ధడ్‌ఖన్‌’ సినిమాలోని ఓ డైలాగ్‌ను యాడ్‌ చేసి, తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో షేర్‌ చేశారు. ఆ వీడియో కాస్తా వైరల్‌గా మారింది. ప్రస్తుత పరిస్థితికి తగ్గట్టుగా ఎంతో ఫన్నీగా ఉన్న ఆ వీడియోపై నెటిజన్లు ప్రశంసల జల్లులు కురిపిస్తున్నారు.

శిల్పా శెట్టి హ్యూమర్‌కు ఫిదా అయిపోతున్నారు.  కాగా, శిల్పాశెట్టి ప్రస్తుతం కేడీ అనే కన్నడ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్‌ జరుపుకుంటోంది. దీనితో పాటు సుఖీ అనే హిందీ సినిమా.. ఇండియన్‌ పోలీస్‌ ఫోర్స్‌ అనే వెబ్‌ సిరీస్‌లోనూ ఆమె నటిస్తున్నారు. ఈ రెండూ శరావేగంగా షూటింగ్‌ జరుపుకుంటున్నాయి. ఇక, శిల్పా శెట్టి భర్త రాజ్‌ కుంద్రా కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నారన్న వార్తలు వస్తున్నాయి. మరి, పెరిగిన టమాటా ధరలపై శిల్పా శెట్టి ఫన్నీ వీడియో తీయటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty)

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom