Tirupathi Rao
శిల్పాశెట్టి భర్త రాజ్ అంటే తెలియన్ సినిమా ప్రేక్షకులు పాన్ ఇంటియా లెవల్లోనే ఉండరేమో. ఆయన జైలు జీవితం ఆధారంగా ఓ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ లో రాజ్ కుంద్రా పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
శిల్పాశెట్టి భర్త రాజ్ అంటే తెలియన్ సినిమా ప్రేక్షకులు పాన్ ఇంటియా లెవల్లోనే ఉండరేమో. ఆయన జైలు జీవితం ఆధారంగా ఓ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ లో రాజ్ కుంద్రా పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
Tirupathi Rao
రాజ్ కుంద్రా.. పాన్ ఇండియా స్థాయిలో దాదాపుగా సినిమా ప్రేక్షకులకు తెలిసిన పేరు. ఒకప్పుడు శిల్పాశెట్టి భర్త అనే ట్యాగ్ తోనే ఈయన ఎక్కువ వైరల్ అయ్యేవారు. కానీ, నీలిచిత్రాల కేసులో ఇరుక్కున్న తర్వాత ఈయన మాసక్ మ్యాన్ గా బాగా ఫేమస్ అయ్యారు. రకరకాల మాస్కులు ధరిస్తూ ప్రజల్లోకి వస్తుండేవారు. మీడియా, ప్రజలకు ఆయన ముఖం చూపించకుండా వివిధ రకాల ఖరీదైన మాస్కులు ధరించి తిరిగేవారు. అయితే కొన్నిరోజులుగా ఆయన తిరిగి మామూలుగానే ప్రజల్లోకి వస్తున్నారు. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న UT69 సినిమా ప్రమోషన్స్ లో చాలా బిజీగా ఉంటున్నారు.
2021లో నీలిచిత్రాల కేసులో ఇరుక్కున్న తర్వాత రాజ్ కుంద్రా ప్రవర్తన ఎంతో మారిపోయిందంట. ఆయన అసలు జనాల్లోకి రాకోపోవండ, బిజినెస్ వ్యవహారాలను కూడా పట్టించుకోలేదంట. కానీ, ఇప్పుడు మళ్లీ సాధారణ పరిస్థితికి వచ్చారు అని చెబుతున్నారు. జైలులో ఆయన గడిపిన జీవితం ఆధారంగా బేస్డ్ ఆన్ ట్రూ స్టోరీ అంటూ యూటీ69 అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీని పాన్ ఇండియా లెవల్లో విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి సంబంధించి రాజ్ కుంద్రా జోరుగా ప్రచారం చేస్తున్నారు. సినిమా ప్రమోషన్స్ లో యాక్టివ్ గా పాల్గొంటున్నారు. బిజినెస్ వ్యవహారాల్లో కూడా చురుగ్గా పాల్గొంటున్నట్లు చెబుతున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రాజ్ కుంద్రా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ సమయంలో తనకు బతికున్నా కూడా చనిపోయినట్లే అనిపించింది అంటూ చెప్పుకొచ్చారు.
“జైలులో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాను. జైలులో అడుగుపెట్టిన మొదటిరోజే నా దుస్తులు విప్పించారు. అందరి ముందు నన్ను నగ్నంగా నిల్చోబెట్టారు. ఏమైనా నిషేదిత పదార్థాలు తెచ్చావా అంటూ ప్రశ్నించారు. వంగోబెట్టి వెనుకవైపు చెక్ చేశారు. ఇన్నాళ్లు సంపాదించుకున్న పరువు, ప్రతిష్టలు అన్నీ మట్టిలో కలిసిపోయాయి అనుకున్నాను. ఆ సమయంలో నాకు బతికున్నా కూడా చనిపోయాననే భావన కలిగింది. జైలులో నా పరిస్థితి ఇలా ఉందే అని అనుకుంటుంటే.. బయట మీడియా కూడా ఏవేవో కథనాలు రాస్తోంది. మీడియా నా గురించి ఇష్టమొచ్చినట్లు కథనాలు రాసి దుస్తులు విడిచేసినంత పని చేశారు. నేను అవమాన భారంతో కుంగి పోయాను. జైలులోనే చనిపోవాలి అని కూడా అనుకున్నాను. కానీ, ఏదొక రోజు అసలు నిజం ఏంటో బయటకు వస్తుందని నాకు నేను సర్దిచెప్పుకున్నాను. నాకు నేనే ధైర్యం చెప్పుకున్నాను” అంటూ రాజ్ కుంద్రా వ్యాఖ్యానించారు. ఈ యూటీ69 సినిమా నవంబర్ 3న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రాజ్ కుంద్రా వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.