iDreamPost
iDreamPost
దీపముండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి. సక్సెస్ మాత్రమే కొలమానంగా నడిచే సినిమా పరిశ్రమలో కేవలం గ్లామర్ నే నమ్ముకుంటే లాభం లేదు. ఏదో ఒకనాడు వరస ఫ్లాపులు చుట్టుముడితే కెరీర్ ఆగిపోతుంది. అందుకే ఆదాయానికి లోటు లేకుండా చూసుకోవడం చాలా అవసరం. లేకపోతే ఏమవుతుందో సావిత్రి గారి జీవితంలో చూశాంగా. అందుకే హీరోలకు ధీటుగా ఇప్పటి హీరోయిన్లు బిజినెస్ ఇన్వెస్టర్ల అవతారం ఎత్తి తమ రెమ్యునరేషన్లకు సేఫ్ సైడ్ చూసుకుంటున్నారు. అదెలాగో చూద్దాం. ఇందులో బాలీవుడ్ భామలు ఎక్కువ ముందు చూపుతో ఉన్నారు. సైఫ్ అలీ ఖాన్ కుమార్తె సారా అలీఖాన్ సోల్డ్ స్టోర్ కు ఈక్విటీ పార్ట్ నర్ గా కొన్నేళ్ల నుంచి ఉంది.
ఆర్ఆర్ఆర్ సీత అలియా భట్, మల్లేశ్వరి ఫేమ్ కత్రినా కైఫ్ లు నైకాలో పెట్టుబడులు పెట్టారు. అలియా అయిదు కోట్ల దాకా, కత్రినా రెండు కోట్లకు పైగా అందులో ఇన్వెస్ట్ చేశారు. అలా అని వీళ్ళేమి గుడ్డిగా చేయడం లేదు. సదరు కంపెనీల బ్రాండ్ వేల్యూ, మార్కెట్ షేర్, స్టాక్ మార్కెట్ పొజిషన్, భవిష్యత్తులో రాబోయే రిస్కులు ఇవన్నీ క్యాలికులెట్ చేసుకుని మరీ దిగుతున్నారు. బంగారం, స్టాక్స్, క్రిప్టో ఇలా ఎన్ని ఆప్షన్లు ఉన్నా రిస్క్ లేకుండా ఉండేలా హీరోయిన్లు జాగ్రత్త పడుతున్నారు. సమంతా సైతం సస్టైన్ కార్ట్ లో భాగస్వామ్యం తీసుకుంది. అమితాబ్ బచ్చన్ జస్ట్ డయల్ లో పెట్టిన మొత్తం ఇప్పటికే నలభై ఆరు రెట్లు పెరిగిపోయింది.
సల్మాన్ ఖాన్ కు యాత్రా డాట్ కామ్ లో పార్ట్ నర్ షిప్ ఉంది. తెలుగులోనూ అల్లు అర్జున్, సందీప్ కిషన్, దర్శకుడు సురేందర్ రెడ్డి, తమన్నా, రకుల్ ఇలా ఎందరికో బిజినెస్ లు ఉన్నాయి. ఇదంతా ముందుచూపుతో చేసుకున్న జాగ్రత్తే. స్టార్ హీరోలను మినహాయిస్తే హీరోయిన్లు ఆర్టిస్టులు తదితరులకు దశాబ్దాల తరబడి ఆఫర్లు రావు. ఒక స్టేజి దాటాక కెరీర్ డ్రై అయిపోతుంది. అప్పుడు కాపాడేది ఈ వ్యాపారాలే. శోభన్ బాబు, మురళి మోహన్ లాంటి సీనియర్లు ఈ బాటలోకి వెళ్లే మంచి ఆస్తిపాస్తులు ప్రోగు చేసుకున్నారు. ఎంత కోట్ల ఆదాయం ఉన్నా కూర్చుంటే కొండలైనా కరిగిపోతాయి. కాబట్టి ఇలాంటి ప్లానింగ్ ఎవరికైనా అవసరమే. సామాన్యులకైనా సరే