iDreamPost
android-app
ios-app

పెళ్లైన వ్యక్తితో స్టార్ హీరోయిన్ చెల్లెలు డేటింగ్.. స్పందించిన నటుడు!

  • Author Soma Sekhar Published - 03:32 PM, Mon - 17 July 23
  • Author Soma Sekhar Published - 03:32 PM, Mon - 17 July 23
పెళ్లైన వ్యక్తితో స్టార్ హీరోయిన్ చెల్లెలు డేటింగ్.. స్పందించిన నటుడు!

చిత్ర పరిశ్రమకు ప్రేమ పెళ్లిళ్ళు, డేటింగ్ లు, విడాకులు కొత్తేమీ కాదు. అదీకాక ఓ ఇద్దరు నటీ, నటులు కెమెరా కంటికి చిక్కితే చాలు.. వారిద్దరి మధ్య ఏదో ఉందన్న వార్తలు బయలుదేరుతాయి. అయితే కొందరి విషయాల్లో ఈ వార్తలు నిజమవుతాయి. మరికొందరి విషయాల్లో అవి పుకార్లుగానే మిగిలిపోతాయి. తాజాగా ఓ స్టార్ హీరోయిన్ చెల్లెలు పెళ్లైన ఓ వ్యక్తితో డేటింగ్ చేస్తుందన్న వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. దాంతో ఈ వార్తలపై ఆ నటుడు కూడా స్పందించాడు.

షమితా శెట్టి.. బాలీవుడ్ నటి శిల్పాశెట్టి సోదరిగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది. మెుహబత్తీన్ మూవీతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది ఈ భామ. అదీకాక తెలుగులోనూ ఓ సినిమా చేసింది. పిలిస్తే పలుకుతా అనే సినిమా ద్వారా టాలీవుడ్ కు సైతం ఎంట్రీ ఇచ్చింది షమితా శెట్టి. ప్రస్తుతం ఓ చిత్రంలో నటిస్తున్న ఆమెపై గత కొంతకాలంగా బీ-టౌన్ లో డేటింగ్ రూమర్స్ వస్తున్నాయి. బాలీవుడ్ నటుడు అమీర్ అలీతో ఈ ముద్దుగుమ్మ రెస్టారెంట్ల వెంట తిరుగుతోందని వార్తలు గుప్పుమంటున్నాయి. షమితా, అమీర్ ఇద్దరూ కలిసి ఓ రెస్టారెంట్ లో కనిపించడంతో.. ఈ వార్తలకు బలం చేకూరినట్లు అయ్యింది.

ఇక ఈ వార్త ఆనోటా.. ఈ నోట పడి విషయం కాస్త అమీర్ అలీ చెవికి చేరింది. దాంతో ఈ వార్తలపై అతడు స్పందించాడు. షమితా శెట్టితో డేటింగ్ పై అమీర్ అలీ స్పందిస్తూ..”నేను ఎవరితోనైనా బయటకి వెళ్లినప్పుడు ఇలాంటి వార్తలు వస్తున్నాయి. ఇక నేను ఒంటరిగా ఉన్నాను అంటే.. డేటింగ్ లో ఉన్నట్లు కాదు. అదీకాక నేను నా ఫ్రెండ్స్ తో పార్టీలకు, రెస్టారెంట్లకు వెళ్తుంటాను. అదే సమయంలో నా స్నేహితురాలు షమితా శెట్టి కూడా పార్టీకి వచ్చింది. దాంతో నేను ఆమెను డ్రాప్ చెయ్యడానికి వెళ్లాను. అంతే ఆ మరుసటి రోజే నా ఫ్రెండ్ ఫోన్ చేసి మీ ఇద్దరూ డేటింగ్ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి అని చెప్పాడు. నేను ఎవరితోనూ డేటింగ్ లో లేను. పైగా ఇలాంటి వార్తల గురించి నేను పెద్దగా పట్టించుకోను” అని అమీర్ అలీ చెప్పుకొచ్చాడు. కాగా.. అమీర్ అలీ తన మెుదటి భార్య అయిన సంజీదా షేక్ తో విడాకులు తీసుకున్నాడు. ప్రస్తుతం సింగిల్ గానే ఉంటున్నాడు. FIR, ఢిల్లీ వలీ ఠాకూర్ గర్ల్స్, సరోజిని-ఏక్ నయి పెహల్ లాంటి షోలతో బాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు అమీర్ అలీ.

 

View this post on Instagram

 

A post shared by Shamita Shetty (@shamitashetty_official)


ఇదికూడా చదవండి: వివాదంలో రజినీకాంత్ ‘జైలర్’ టైటిల్! కోర్టును ఆశ్రయించిన నిర్మాత!

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobetcratosroyalbetganobetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom