iDreamPost
android-app
ios-app

శిల్పాశెట్టి దంపతులు మరో స్కామ్! ఇల్లు జప్తుతో పాటు! కేసు నమోదు!

  • Published Apr 18, 2024 | 5:55 PM Updated Updated Apr 18, 2024 | 5:55 PM

బాలీవుడ్ ఇండస్ట్రీలోని హీరోయిన్ శిల్పాశెట్టి దంపతులు మరోసారి చిక్కుల్లో పడ్డారు. కాగా, గతంలో బిట్ కాయిన్ పోంజీ కేసు అనేది ఈ దంపతులకు వెంటాడుతునే ఉంది. ఈ క్రమంలోనే తాజాగా వీరికి ఈడీ ఊహించని బిగ్ షాక్ ను ఇచ్చింది.

బాలీవుడ్ ఇండస్ట్రీలోని హీరోయిన్ శిల్పాశెట్టి దంపతులు మరోసారి చిక్కుల్లో పడ్డారు. కాగా, గతంలో బిట్ కాయిన్ పోంజీ కేసు అనేది ఈ దంపతులకు వెంటాడుతునే ఉంది. ఈ క్రమంలోనే తాజాగా వీరికి ఈడీ ఊహించని బిగ్ షాక్ ను ఇచ్చింది.

  • Published Apr 18, 2024 | 5:55 PMUpdated Apr 18, 2024 | 5:55 PM
శిల్పాశెట్టి దంపతులు మరో స్కామ్! ఇల్లు జప్తుతో పాటు! కేసు నమోదు!

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శిల్పాశెట్టి.. గత కొంతకాలంగా ఈ నటి పేరు వార్తలో నిలుస్తునే ఉంది. ముఖ్యంగా ఈమె భర్త రాజ్ కుంద్రా పోర్నోగ్రఫీ కేసులో అరెస్ట్ అయిన సమయంలో ఈ బ్యూటీ పేరు మారుమోగిన విషయం తెలిసిందే. కాగా, ఆ తర్వాత 2017లో శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా తన స్నేహితులతో కలిసి బిట్ కాయిన్ ద్వారా పెట్టుబడి పెడితే నెలకు 10 శాతం లాభాలే వస్తాయని అమాయకపు ప్రజలను మోసం చేసి నమ్మించాడు. ఈక్రమంలోనే దాదాపు రూ.6600 కోట్లు సంపాదించారు.అయితే తీరా డబ్బులు చేతికి వచ్చాక ఇన్వెస్టర్లను మోసం చేశాడు. దీంతో అప్పట్లో ఆయన పై మహరాష్ట్ర, ఢిల్లీ ప్రాంతాల్లో ఎఫ్ఐఆర్ కూడా నమోదు అయిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. తాజాగా శిల్పాశెట్టి దంపతులకు ఊహించని బిగ్ షాక్ తగిలింది. దీంతో ప్రస్తుతం బాలీవుడ్ లోని ఈ దంపతులు పేర్లు మరోసారి హాట్ టాపిక్ గా మారింది. ఇంతకి ఏం జరిగిదంటే..

బాలీవుడ్ ఇండస్ట్రీలోని హీరోయిన్ శిల్పాశెట్టి దంపతులు మరోసారి చిక్కుల్లో పడ్డారు.కాగా, గతంలో బిట్ కాయిన్ పోంజీ కేసు అనేది ఈ దంపతులకు వెంటాడుతునే ఉంది. గత ఏడేళ్లుగా క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్‏కు సంబంధించిన మనీలాండరింగ్ మోసాలపై తాజాగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) షాకిచ్చింది.అయితే ఈ కేసులో భాగంగానే శిల్పాశెట్టి దంపతులకు సంబంధించిన దాదాపు రూ. 98 కోట్లు విలువైన ఆస్తులును ఈడీ సీజ్ చేసింది. ఈ క్రమ్ంలోనే.. ముంబైలోని జుహులోని ఫ్లాట్, పూణేలోని బంగ్లాతోపాటు రాజ్ కుంద్ర పేరుతో ఉన్న ఈక్విటీ షేర్లను ఈడీ జప్తు చేసింది. అయితే మహారాష్ట్రలో నమోదైన వివిధ ఎఫ్‌ఐఆర్‌ల ఆధారంగా పీఎంఎల్‌ఏ కింద ఈడీ దర్యాప్తు ప్రారంభించింది.

Silpa shetty scam

కాగా, రాజ్ కుంద్రా తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం బిట్‌కాయిన్ స్కామ్ చేశాడని.. ఇది ఒక రకమైన పోంజీ స్కీమ్ అని గతంలో ఆరోపణలు వచ్చాయి. అలాగే బిట్ కాయిన్ సంస్థ, దాని ప్రమోటర్లపై ఈడీ కేసు నమోదు చేసింది. ఇప్పటికే ఈ కేసులో సింపీ భరద్వాజ్, నితిన్ గౌర్, నిఖిల్ మహాజన్ అరెస్ట్ అయ్యారు. అంతేకాకుండా.. ప్రస్తుతం ఈ ముగ్గురూ జ్యూడీషియల్ కస్టడీలో ఉన్నారు. అయితే ఇందులో ప్రధాన నిందితుడు అజయ్ భరద్వాజ్, మహేంద్ర భరద్వాజ్ మాత్రం పరారీలో ఉన్నారు. ఇక ఈ భారీ స్కామ్ వెనుక ఉన్న అసలైన సూత్రధారి అమిత్ భరద్వాజ్ 2022లోని మరణించారు. ఇక గతంలో రాజ్ కుంద్రాకు 285 బిట్ కాయిన్లు ఇచ్చాడు. దీంతో రాజ్ కుంద్రా ఉక్రెయిన్ లో బిట్‌కాయిన్ మైనింగ్‌లో పెట్టుబడులు పెట్టాలని భావించాడు. కాగా, ఇప్పటికీ ఆ కాయిన్లు తనవద్దే ఉన్నాయని, పైగా దాని విలువ రూ.150 కోట్లు ఉంటుదని ఈడీ వెల్లడించింది. ఈ క్రమంలోనే అతడి ఆస్తులను ఈడీ జప్తు చేసి భారీ షాక్ ను ఇచ్చింది. మరి, బిట్ కాయిన్ స్కాంలో శిల్పా శెట్టి దంపతుల ఆస్తులను జప్తు చేయడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.