iDreamPost
android-app
ios-app

డబ్బు కోసమే పెళ్లి చేసుకున్నానని అన్నారు.. స్టార్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

  • Published Mar 09, 2024 | 9:22 PM Updated Updated Mar 09, 2024 | 9:22 PM

ఓ స్టార్ హీరోయిన్ కేవలం డబ్బు కోసమే పెళ్లిచేసుకుందన్న వార్తలు వైరల్ గా మారాయి. తాజాగా ఈ వార్తలపై స్పందించింది సదరు హీరోయిన్. ఇంతకీ ఆమె ఏమన్నదంటే?

ఓ స్టార్ హీరోయిన్ కేవలం డబ్బు కోసమే పెళ్లిచేసుకుందన్న వార్తలు వైరల్ గా మారాయి. తాజాగా ఈ వార్తలపై స్పందించింది సదరు హీరోయిన్. ఇంతకీ ఆమె ఏమన్నదంటే?

  • Published Mar 09, 2024 | 9:22 PMUpdated Mar 09, 2024 | 9:22 PM
డబ్బు కోసమే పెళ్లి చేసుకున్నానని అన్నారు.. స్టార్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

సినిమా ఇండస్ట్రీకి చెందిన ఎంతో మంది హీరోయిన్స్ బిజినెస్ మెన్స్ ను ప్రేమించి పెళ్లాడారు. అయితే ఈ పెళ్లిలో డబ్బు మాత్రమే ఉందని, ప్రేమ లేదని కొన్ని జంటలపై విమర్శలు వచ్చాయి. అందులో ఓ స్టార్ హీరోయిన్ కూడా కేవలం డబ్బు కోసమే అతడిని వివాహం చేసుకుందని కొందరు విమర్శించారు. తాజాగా ఈ విమర్శలపై స్పందించింది సదరు హీరోయిన్. డబ్బు కోసమే అతడిని పెళ్లి చేసుకోలేదని చెప్పుకొచ్చింది. మరి ఆ హీరోయిన్ ఎవరు? వివరాల్లోకి వెళితే..

బాలీవుడ్ స్టార్ కపుల్ రాజ్ కుంద్రా-శిల్పా శెట్టి ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు. కొన్ని రోజుల క్రితం ఈ జంట విడాకులు తీసుకుంటుంది అన్న వార్తలు సైతం వైరల్ గా మారాయి. ఇప్పుడు మరో వార్త హాట్ టాపిక్ గా మారింది. కేవలం డబ్బుల కోసమే రాజ్ కుంద్రాను శిల్ఫా శెట్టి వివాహం చేసుకుందని చాలా మంది భావిస్తున్నారు. ఈ విషయంపై తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో స్పందించింది.

శిల్పా శెట్టి మాట్లాడుతూ..”చాలా మంది నేను డబ్బు కోసమే రాజ్ కుంద్రాను పెళ్లి చేసుకున్నానని అనుకుంటున్నారు. అది పచ్చి అబద్దం. ఎందుకంటే? పెళ్లికి ముందు నా ఆర్థిక పరిస్థితి బాగానే ఉంది. దాన్ని ఎందుకు మర్చిపోతున్నారో నాకు అర్ధం కావడంలేదు. నేను అతడిని డబ్బు చూసి ఇష్టపడలేదు.. మనసు చూసి ఇష్టపడ్డాను. కామన్ ఫ్రెండ్స్ ద్వారా అయిన మా పరిచయం ప్రేమగా మారి, పెళ్లి వరకు వెళ్లింది. మేము కలిసి జీవించాలని ఆ దేవుడు నిర్ణయించాడు” అని శిల్పా చెప్పుకొచ్చింది. ఇక వీరికి 2009లో వివాహం కాగా.. ఇద్దరు సంతానం ఉన్నారు.

ఇదికూడా చదవండి: మాలీవుడ్ గేమ్ ఛేంజర్ మంజుమ్మెల్ బాయ్స్.. మరో రికార్డు!

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş