iDreamPost
android-app
ios-app

డ్రెస్సింగ్ పై కామెంట్.. శిల్పాశెట్టి భర్త పరువు తీసిన ఉర్ఫీ జావెద్!

  • Author ajaykrishna Published - 12:35 PM, Sat - 7 October 23
  • Author ajaykrishna Published - 12:35 PM, Sat - 7 October 23
డ్రెస్సింగ్ పై కామెంట్.. శిల్పాశెట్టి భర్త పరువు తీసిన ఉర్ఫీ జావెద్!

సోషల్ మీడియాలో రెగ్యులర్ గా ట్రెండ్ అయ్యే బ్యూటీస్ లో ఉర్ఫీ జావెద్ ఒకరు. బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఈ భామ.. అందాలను షో చేయడంలో ఎలా రెచ్చిపోతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. హిందీ బిగ్ బాస్ షో ద్వారా పాపులర్ అయిన ఉర్ఫీ.. ఎప్పటికప్పుడు విచిత్రమైన డ్రెస్సింగ్ స్టైల్ తో అందరిని సర్ప్రైజ్ చేస్తుంటుంది. ఉర్ఫీ ధరించే డ్రెస్ ల కారణంగా ఎన్నో వివాదాలు కూడా ఫేస్ చేస్తోంది ఈ భామ. ఎన్ని వివాదాలైనా ఫేస్ చేస్తుంది కానీ.. ఉర్ఫీ తన డ్రెస్సింగ్ స్టైల్ ని మాత్రం మార్చుకోవడం లేదు. జనాలు ఎలా మాట్లాడుకున్నా తనకు ఒరిగేది ఏం లేదని కామెంట్స్, విమర్శలు పట్టించుకోవడం లేదు. అయితే.. ఉర్ఫీ హాట్ షో తెచ్చే తంటాలు అన్ని ఇన్ని కావు.

సోషల్ మీడియాలో వినిపించే కామెంట్స్, జనాల విమర్శలు మాత్రమే కాకుండా అప్పుడప్పుడు ఇండస్ట్రీ వ్యక్తులు కూడా ఉర్ఫీ గురించి దారుణంగా మాట్లాడుతుంటారు. ఆమె ఎందుకు అలా డ్రెస్సింగ్ స్టైల్ మెయింటైన్ చేస్తుందో తెలియదు. కానీ.. రీసెంట్ గా ఓ వ్యక్తి ఆమెపై కామెంట్స్ చేసి వార్తలలో నిలిచాడు. సీనియర్ హీరోయిన్ శిల్పా శెట్టి గురించి పరిచయం అక్కర్లేదు. హీరోయిన్ గా తెలుగు వాళ్లకు సుపరిచితమే. అలాగే శిల్పాతో పాటు ఆమె భర్త రాజ్ కుంద్రా కూడా అందరికి తెలుసు. కొన్నాళ్ళుగా అమ్మాయిలతో అసభ్యకరమైన వీడియోలు, వెబ్ సిరీస్ లు తీస్తున్నాడని పెద్ద కేసులో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే.

ఇక దాదాపు రెండు నెలలు జైలు జీవితం గడిపిన రాజ్ కుంద్రా.. కొద్దిరోజులుగా తన మొహం చూపించకుండా మాస్క్ ధరించి తిరుగుతున్నాడు. కాగా.. రీసెంట్ గా ఓ స్టాండప్ షోలో పాల్గొన్న రాజ్.. ఉర్ఫీ జావెద్ గురించి ఓ కామెంట్ చేశాడు. జనాలు రాజ్ కుంద్రా ఏం వేసుకున్నాడో.. ఉర్ఫీ జావెద్ ఏం వేసుకోలేదో.. ఇవి రెండు ఇంటరెస్టింగ్ గా చూస్తారని నవ్వుతూ చెప్పుకొచ్చాడు. ఆ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయి.. ఉర్ఫీ కంటపడింది. దీంతో తాజాగా ఇంస్టాగ్రామ్ స్టోరీలో.. “ఇతరులను నగ్నంగా చూపించి డబ్బులు సంపాదించేవాళ్ళు కూడా నా డ్రెస్సింగ్ పై కామెంట్స్ చేస్తున్నారు. సారీ.. నాట్ సారీ పో*ర్న్ కింగ్” అని రాజ్ కుంద్రా వీడియో షేర్ చేసింది. ప్రస్తుతం ఉర్ఫీ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. మరి ఉర్ఫీ కామెంట్స్ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

 

View this post on Instagram

 

A post shared by Raj Kundra (@onlyrajkundra)

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet