iDreamPost
android-app
ios-app

అరుదైన వ్యాధితో బాధపడుతున్న హీరోయిన్.. హాస్పిటల్‌లో చికిత్స

సినిమా సెలబ్రిటీలు.. ముఖ్యంగా హీరోయిన్లు అరుదైన వ్యాధులతో బాధపడుతున్న సంఘటనలు ఇటీవల కాలంలో చాలా చూశాం. ఆ మధ్య మాయోసైటిస్ తో బాధపడిన సమంత.. ఆ తర్వాత కోలుకుని బయటపడింది. క్యాన్సర్ బారిన పడ్డవాళ్ళు కూడా చాలా మంది బయటపడ్డారు. తాజాగా మరో హీరోయిన్ అరుదైన సమస్యతో హాస్పిటల్ లో చేరింది.

సినిమా సెలబ్రిటీలు.. ముఖ్యంగా హీరోయిన్లు అరుదైన వ్యాధులతో బాధపడుతున్న సంఘటనలు ఇటీవల కాలంలో చాలా చూశాం. ఆ మధ్య మాయోసైటిస్ తో బాధపడిన సమంత.. ఆ తర్వాత కోలుకుని బయటపడింది. క్యాన్సర్ బారిన పడ్డవాళ్ళు కూడా చాలా మంది బయటపడ్డారు. తాజాగా మరో హీరోయిన్ అరుదైన సమస్యతో హాస్పిటల్ లో చేరింది.

అరుదైన వ్యాధితో బాధపడుతున్న హీరోయిన్.. హాస్పిటల్‌లో చికిత్స

కష్టాలకు, సమస్యలకు, రోగాలకు సినిమా స్టార్లు అతీతం కాదు. సమంత నుంచి నయనతార వరకూ చాలా మంది అరుదైన సమస్యలతో బాధపడ్డవారే.. వాటితో పోరాడి బయటపడ్డవారే. సినీ పరిశ్రమలో ఎక్కువగా రొమ్ము క్యాన్సర్ తో బాధపడే హీరోయిన్స్ చాలా మంది ఉంటారు. ఇప్పటికే చాలా మంది హీరోయిన్స్ క్యాన్సర్ ని జయించి మళ్ళీ కొత్త జీవితాన్ని ప్రారంభించారు. సమంత అయితే మాయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో పోరాడి గెలిచింది. ఇటీవల సోనాలి బింద్రే కూడా క్యాన్సర్ తో పోరాడి ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. తాజాగా మరో ప్రముఖ హీరోయిన్  కూడా అరుదైన సమస్య కారణంగా హాస్పిటల్ లో చేరింది.      

ప్రముఖ హీరోయిన్, స్టార్ హీరోయిన్ చెల్లెలు హాస్పిటల్ లో చేరింది. అరుదైన వ్యాధితో బాధపడుతున్న ఆమె హాస్పిటల్ లో సర్జరీ చేయించుకుంది. అరుదైన సమస్యతో బాధపడుతున్నా అని.. విపరీతమైన నొప్పి కారణంగా హాస్పిటల్ లో చేరినట్లు ఆమె తెలిపింది. హాస్పిటల్ లో చికిత్స అనంతరం ఆమె ఒక వీడియోని విడుదల చేసింది. వీడియోలో ఆమె తనకు వచ్చిన సమస్య గురించి మహిళలకు అవగాహన కల్పిస్తూ పలు కీలక వ్యాఖ్యలు చేసింది. 

శిల్పా శెట్టి గురించి తెలిసే ఉంటుంది. తెలుగులో వెంకటేష్, నాగార్జున వంటి హీరోల సరసన నటించింది. బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్. ఆమె చెల్లెలు కూడా హీరోయినే. తెలుగులో పిలిస్తే పలుకుతా సినిమాలో నటించింది షమితా శెట్టి. ఆ తర్వాత పూర్తిగా తన అక్క శిల్పాశెట్టిలా బాలీవుడ్ కే పరిమితమైంది. ప్రస్తుతం ఈమె ఓ అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు వెల్లడించింది. మహిళలకు వచ్చే సమస్యల్లో సర్వసాధారణమైనది.. అత్యంత బాధను కలిగించేది గర్భాశయంలో వచ్చే సమస్య అని.. అలాంటి సమస్య తనకు వచ్చిందని ఆమె పేర్కొంది.

దాదాపు 40 శాతం మంది మహిళలు ఎండోమెట్రియోసిస్ సమస్యతో బాధపడుతున్నారని.. మనలో చాలా మందికి ఈ సమస్య గురించి తెలియదని షమితా శెట్టి వెల్లడించింది. గత కొన్ని రోజులుగా తాను విపరీతమైన నొప్పితో బాధపడుతున్నా అని.. ఆ నొప్పికి మూల కారణం ఏంటో డాక్టర్లు కనుగొన్నారని చెప్పింది. గర్భాశయంలో వచ్చిన ఈ సమస్యకు సర్జరీ ద్వారా పరిష్కారం దొరికిందని ఆమె చెప్పుకొచ్చింది. డాక్టర్ నీతా, డాక్టర్ సునీతా బెనర్జీలు తన సమస్యను పరిష్కరించడానికి ఎంతో శ్రమించారని.. వారికి ధన్యవాదాలు అంటూ పేర్కొంది. శస్త్రచికిత్స చేసి తన సమస్యకు కారణమైన దాన్ని తొలగించారని.. మంచి ఆరోగ్యం కోసం.. అలానే నొప్పి లేని రోజుల కోసం ఎదురుచూస్తున్నా అంటూ షమితా శెట్టి వెల్లడించింది.  

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి