iDreamPost
android-app
ios-app

హీరోగా ఎంట్రీ ఇవ్వనున్న శిల్పాశెట్టి భర్త! మూవీ స్టోరీ ఇదేనా?

  • Author singhj Updated - 08:43 PM, Thu - 20 July 23
  • Author singhj Updated - 08:43 PM, Thu - 20 July 23
హీరోగా ఎంట్రీ ఇవ్వనున్న శిల్పాశెట్టి భర్త! మూవీ స్టోరీ ఇదేనా?

సినిమాల్లోకి వెళ్లాలని చాలా మంది కోరుకుంటారు. నటులుగా రాణించాలనే ఆశ ఉన్నవాళ్లు ఎంతో మంది ఉంటారు. లుక్స్ బాగుండి, నటించే టాలెంట్​తో పాటు డ్యాన్స్ చేసే ప్రతిభ కూడా ఉన్నవాళ్లు హీరో, హీరోయిన్లు అయిపోదామని ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలో సరైన అవకాశాలు దొరికి ఉన్నత స్థానాలకు ఎదిగి, ఇండస్ట్రీలో నిలదొక్కుకున్న వారు ఎందరో ఉన్నారు. బయటి నుంచి గాక పరిశ్రమకు చెందిన వ్యక్తుల కుటుంబాల్లో నుంచి హీరో, హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయినవారూ బోలెడు మంది ఉన్నారు. అయితే వారసులుగా ఎంట్రీ ఇవ్వడం ఈజీనే కానీ.. ఇండస్ట్రీలో సెటిల్ అవ్వాలన్నా, స్టార్ ఇమేజ్ తెచ్చుకోవాలన్నా ఎంతో ప్రతిభ ఉండాలి. అలాగే కాసింత లక్ కూడా కలసి రావాలి.

ఇదిలా ఉంటే.. బాలీవుడ్ స్టార్ నటి శిల్పాశెట్టి భర్త, ప్రముఖ బిజినెస్​మన్ రాజ్ కుంద్రా తెరంగేట్రం చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. తాను గడిపిన జైలు జీవితం ఆధారంగా రూపొందబోయే మూవీతో ఆయన హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నట్లు బాలీవుడ్ టాక్. ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలులో రాజ్ కుంద్రా ఎదుర్కొన్న కష్టాల ఇతివృత్తం ఆధారంగా ఒక చిత్రం తెరకెక్కనుందని సమాచారం. ఈ ప్రాజెక్టు నిర్మాణం దగ్గర నుంచి స్క్రిప్ట్ వరకు అన్ని విభాగాల్లో ఆయన చొరవ తీసుకుంటారని వినికిడి. ఈ మూవీ షూటింగ్ పూర్తయ్యే దాకా డైరెక్టర్ వివరాలు కూడా సీక్రెట్​గా ఉంచాలని డిసైడ్ అయ్యారట.

రాజ్​ కుంద్రా జైలు జీవితంపై తెరకెక్కే సినిమా విడుదల చేసే విషయమై ఇప్పటికే ప్రముఖ ఓటీటీ సంస్థలను సంప్రదించారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తన లైఫ్​లో జరిగిన పరిణామాలను తన యాంగిల్​లో చూపించి.. వివాదాల నుంచి బయటపడేందుకు ఈ సినిమాను ఒక వేదికగా మార్చుకునేందుకు రాజ్ కుంద్రా ప్రయత్నం చేస్తున్నారని బాలీవుడ్ ఎక్స్​పర్ట్స్​ అంటున్నారు. ఇకపోతే, పా*ర్న్ ఫిల్మ్స్ నిర్మించి వివిధ యాప్​ల ద్వారా వాటిని రిలీజ్ చేస్తున్నారనే ఆరోపణలతో రాజ్ కుంద్రాను పలు సెక్షన్ల కింద 2021 జులైలో అరెస్ట్ చేసిన విషయం విదితమే. ఈ కేసులో ఆయన రెండు నెలల పాటు ఆర్థర్ జైలులో ఉన్నారు. ఆ తర్వాత బెయిల్​పై బయటకు వచ్చారు. అనంతరం మరో కాంట్రవర్సీలోనూ రాజ్ కుంద్రా చిక్కుకున్నారు.

gamdomCasibomJojobet Girişmarsbahis girişGrandpashabet Giriş