ఆసని వచ్చేస్తుంది…బీ అలెర్ట్ ఏంటి అనుకుంటున్నారా ? మూడు రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. సముద్రాల్లో ఏర్పడే తుఫాన్లకు పేర్లు పెడతారు అనే సంగతి తెలిసిందే. తాజాగా పశ్చిమ మధ్య నైరుతి బంగాళాఖాతంలో సోమవారం తీవ్ర తుఫాన్ ఏర్పడిన సంగతి తెలిసిందే. దీనికి అసని అని పేరు పెట్టారు. ఇది పశ్చిమ వాయువ్య దిశలో ప్రయాణించి మంగళవారం ఉదయం కాకినాడకు […]
రానున్న ముప్పై గంటల్లో ఏపీలో భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉన్న అల్పపీడనం బలపడుతోందని చెబుతున్నారు. ఇది తీవ్ర వాయుగుండంగాను, తుఫానుకుగానే మారేందుకు అవకాశాలున్నాయని వివరిస్తున్నారు. ఈ తుఫానుకు బురేవి అని పేరు పెట్టారు. ఇది శ్రీలంక సమీపంలో తీరాన్నిదాటేందుకు అవకాశం ఉంటుందని వివరిస్తున్నారు. ముందుగా వాయువ్య దిశగా ప్రయాణిస్తుందని, ఆ తరువాత తీరం దాటి, 3వ తేదీ నాటికి పశ్చిమదిశగా మళ్ళుతుందని పేర్కొంది. బురేవి తుఫాను ప్రభావంతో […]
ఏపీలో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని విశాఖలోని వాతావరణ కేంద్రం తెలియజేసింది. తమిళనాడు తీరానికి సమీపంలోని, నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడ్డ ఉపరితల ఆవర్తన ప్రభావం ఈ వర్షాలకు కారణంగా పేర్కొంది. అంతే కాకుండా దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం, ఇప్పుడు ఆగ్నేయ, నైరుతి బంగాళాఖాతం ప్రాంతాల్లో 1.5 కిలోమీటర్ల ఎత్తున కొనసాగుతోందని వివరిస్తున్నారు. వీటి ప్రభావం కారణంగా దక్షిణాది రాష్ట్రాలకు సముద్రం మీదుగా తూర్పుగాలులు వీస్తున్నాయంటున్నారు. కాగా ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు […]
ముసురు.. ఈ మాట విని పదేళ్లు దాటింది. ఎప్పుడో 2010కి ముందు ఈ మాట ఆంధ్రప్రదేశ్లో వినిపించింది. ఆ తర్వాత ఇప్పుడు మళ్లీ వినిపిస్తోంది. ఈ మధ్యలో పదేళ్లలో ముసురు కాదు కదా వరుణుడి జాడ కనిపించడమే గగనమైంది. చాలీచాలనీ వర్షాలు, కరువుతో ఆంధ్రప్రదేశ్ అల్లాడిపోయింది. ముఖ్యంగా చంద్రబాబు ప్రభుత్వం ఉన్న ఐదేళ్లు రాష్ట్రంలో కరువు విలయతాండవం చేసింది. గొడ్డు, గొదకు అవసరమైన నీళ్లు కూడా దొరక్క ప్రజలు అల్లాడిపోయారు. భూగర్భజలాలు అడగంటిపోయాయి. 500 అడుగుల లోతు బోర్లు […]