iDreamPost
android-app
ios-app

విజయవాడ చరిత్రలోనే భయానకమైన వర్షం! చెరువులుగా మారిన రోడ్లు!

Vijayawada Rains: శుక్రవారం తెల్లవారు జాము నుండి కురుస్తున్న వర్షాలకు విజయవాడ నగరం నీట మునిగింది. నగర మొత్తం నీట మునిగింది. పలు చోట్ల కొండ చరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు.

Vijayawada Rains: శుక్రవారం తెల్లవారు జాము నుండి కురుస్తున్న వర్షాలకు విజయవాడ నగరం నీట మునిగింది. నగర మొత్తం నీట మునిగింది. పలు చోట్ల కొండ చరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు.

విజయవాడ చరిత్రలోనే భయానకమైన వర్షం! చెరువులుగా మారిన రోడ్లు!

తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలో కన్నా ఆంధ్రప్రదేశ్‌లో వానల ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. బంగాళా ఖాతంలో అల్ప పీడనం ఏర్పడంతో ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురస్తున్నాయి. విజయవాడలో కుంభ వృష్టిగా వర్షాలు పడుతున్నాయి. దీంతో నగరంలోని ప్రధాన రహదారులన్నీ జలమయం అయ్యాయి. రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. మోకాళ్ల లోతు నీళ్లు చేరిపోయాయి. డెంటల్ హాస్పిటల్ రోడ్డు, మార్కెట్, రైల్వే స్టేషన్, బస్టాండ్లకు అనుసంధానంగా ఉండే.. లో బ్రిడ్జి మొత్తం నీట మునిగింది. దీంతో వాహనాలు నీళ్లల్లో నిలిచిపోయాయి. ఇక రాక పోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. ఏలూరు రోడ్డు, మొగల్రాజపురం, పుష్ప హోటల్ సెంటర్, సూర్యారావు పేట, సింగ్ నగర్ ప్రాంతాలు జలమయం అయ్యాయి.

శుక్రవారం అర్థరాత్రి నుండి విజయవాడలో ఎడతెరిపి లేకుండా వానలు కురుస్తున్నాయి. దీంతో బయటకి రావాలంటే ప్రజలు భయాందోళనకు గురౌతున్నారు. బెజవాడలో 18 సెం. మీ వర్షపాతం నమోదైంది. ఇది  చరిత్రలో అతి భయానకమైన వానగా చెప్పుకుంటున్నారు.  కాగా, ఈ వానల ధాటికి పశ్చిమ నియోజకవర్గంలో రెండు చోట్ల ఇళ్లు కూలిపోయాయి. సున్నపు బట్టీల సెంటర్ వద్ద కొండచరియలు విరిగిపడి ముగ్గురు మృతి చెందారు. మరో ఆరుగురు శిథిలాల కింద చిక్కుకున్నారు. అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బాధితుల్ని శిథిలాల నుండి వెలికి తీస్తున్నారు. అలాగే వన్ టౌన్ ప్రాంతం, దుర్గగుడి ఘాట్ ప్రాంతాలు కూడా నీట మునిగాయి.

వర్షం ధాటికి కొండ చరియలు విరిగి పడే ప్రమాదం ఉన్న నేపథ్యంలో.. దుర్గ గుడి ఘాట్ రోడ్ మూసేశారు అధికారులు. దుర్గగుడి ఫ్లై ఓవర్‌ను తాత్కాలికంగా మూసివేసినట్లు సమాచారం. బెజవాడ ప్రజలను భయపెడుతున్నాయి వానలు. గడచిన కొన్నేళ్లలో ఇలాంటి వర్షం చూడలేదంటున్నారు స్థానికులు. విజయవాడ చరిత్రలోనే భారీ వర్షంగా పేర్కొంటున్నారు. కేవలం విజయవాడలోనే కాకుండా ఎన్టీఆర్, కృష్ణా జిల్లా వ్యాప్తంగా వానలు దంచికొడుతున్నాయి. ముప్పాళ్లతో సహా పలు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. రెండు జిల్లాలోని మేజర్ ప్రాంతాలన్నీ నీట మునిగాయి. కాగా, అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని సూచిస్తున్నారు అధికారులు.