iDreamPost
android-app
ios-app

వీడియో: భారీ వర్షానికి కొట్టుకొచ్చిన కార్లు! ఒకరు మృతి!

  • Published Sep 01, 2024 | 2:48 PM Updated Updated Sep 01, 2024 | 3:09 PM

Heavy Rains: జోరు వానల వల్ల ఎక్కడ చూసినా కూడా ఉప్పొంగిన సముద్రంలా నీళ్లు పొంగి పొతున్నాయి. రోడ్లపై నిలిచిపోతున్న నీళ్ల కారణంగా బయటకి అడుగు పెట్టలేని పరిస్థితి నెలకొంది.

Heavy Rains: జోరు వానల వల్ల ఎక్కడ చూసినా కూడా ఉప్పొంగిన సముద్రంలా నీళ్లు పొంగి పొతున్నాయి. రోడ్లపై నిలిచిపోతున్న నీళ్ల కారణంగా బయటకి అడుగు పెట్టలేని పరిస్థితి నెలకొంది.

వీడియో: భారీ వర్షానికి కొట్టుకొచ్చిన కార్లు! ఒకరు మృతి!

వర్షాలు అతి భారీగా కురుస్తున్నాయి.. ఎక్కడ చూసినా కూడా భారీ వర్షాలతో తీవ్రంగా వర్ష పాతం నమోదవుతుంది. వాయుగుండం ప్రభావంతో మన తెలుగు రాష్ట్రాల్లో అయితే ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. పట్టణాలు, పల్లెటూర్లలో అయితే వాన ఏకధాటిగా కురుస్తూ ఉంది. ఈ జోరు వానల వల్ల రోడ్లన్నీ నీళ్లతో నిండిపోయాయి. ఎక్కడ చూసినా కూడా ఉప్పొంగిన సముద్రంలా నీళ్లు పొంగి పొతున్నాయి. రోడ్లపై నిలిచిపోతున్న నీళ్ల కారణంగా ఎవ్వరు బయటకి అడుగు పెట్టలేని పరిస్థితి నెలకొంది. చాలా పల్లెటూళ్ళల్లో ఈ వానలకు పంట పోలాలు పూర్తిగా నీట మునిగి నాశనం అయిపోతున్నాయి. అందువల్ల రైతులకు తీవ్రంగా ఆర్ధిక నష్టం కలుగుతుంది.

కుండపోత వర్షాల వలన నగరాల్లో ఉద్యోగులకు ఆఫీసులకు వెళ్లలేని పరిస్థితులు నెలకొన్నాయి. పిల్లలు పాఠశాలలకు వెళ్లడానికి ఇబ్బంది అవుతుంది. బలమైన గాలులు కూడా వేగంగా వీస్తున్నాయి. పలు ప్రాంతాల్లో భారీ పిడుగులు పడుతున్నాయి. చెరువులు, నదులు వర్షపు నీటితో నిండిపోయాయి. వరదలా పారుతూ రోడ్ల పైకి వస్తున్నాయి. ఈ కారణంగా ఎవ్వరు బయటకి రావొద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ భారీ వర్షాల కారణంగా చాలా మంది ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. తాజాగా తెలంగాణలోని కోదాడలో అయితే భారీ వర్షానికి రెండు కార్లు కొట్టుకు వచ్చాయి. దీంతో ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. కోదాడ టౌన్ పరిధిలోని భారతి పబ్లిక్ స్కూల్ వద్ద ఉన్న కాలువలో ఆదివారం రెండు కార్లు కొట్టుకొని వచ్చాయి. అందులోని ఓ కారులో కోదాడవాసి నాగం రవి మృతి చెందారు.