iDreamPost
android-app
ios-app

IMD Alert: ఏపీ, తెలంగాణలో దంచికొట్టుడే.. ఈ జిల్లాల్లో ఉరుములతో కూడిన భారీ వర్షాలు!

  • Published Aug 27, 2024 | 8:18 AM Updated Updated Aug 27, 2024 | 11:02 AM

Rains in AP, Telangana: జులై నెల నుంచి ఏపీ, తెలంగాణలో వర్షాలు దంచికొడుతున్నాయి. ఒకటీ రెండు రోజులు మినహాయించి వరుసగా వర్షాలు పడుతూనే ఉన్నాయి. వర్షాల కారణంగా ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా వాతావరణ శాఖ మరో రెయిన్ అలర్ట్ జారీ చేసింది.

Rains in AP, Telangana: జులై నెల నుంచి ఏపీ, తెలంగాణలో వర్షాలు దంచికొడుతున్నాయి. ఒకటీ రెండు రోజులు మినహాయించి వరుసగా వర్షాలు పడుతూనే ఉన్నాయి. వర్షాల కారణంగా ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా వాతావరణ శాఖ మరో రెయిన్ అలర్ట్ జారీ చేసింది.

IMD Alert: ఏపీ, తెలంగాణలో దంచికొట్టుడే.. ఈ జిల్లాల్లో ఉరుములతో కూడిన భారీ వర్షాలు!

ఏపీ, తెలంగాణను ఇప్పట్లో వర్షాలు వీడేలా కనిపించడం లేదు. ఆగస్టు 29వ తేదీ వరకు తూర్పు మధ్య పరిసర ఉత్తర బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఈ అల్పపీడన ప్రభావంతో ఏపీ, తెలంగాణ‌లో వచ్చే మూడు నాలుగు రోజులు మోస్తరు నుంచి అతి మోస్తరు వర్షాలు పడే సూచన ఉందని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. భారీ వర్షాల కారణంగా పలు జలాశయాలు, చెరువులు, ప్రాజెక్టులు నిండు కుండలా మారాయి. లోతట్టు ప్రాంతాలు వర్షపు నీటితో నిండిపోయి ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ఏపీలో మత్స్యకారులు వేటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది.  తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో మరోసారి భారీ వర్షాలు పడే సూచన ఉందని వాతావరణశాఖ తెలిపింది. వివరాల్లోకి వెళితే..

తెలంగాణలోని పలు జిల్లాల్లో ఆరు రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని  భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఎల్లో అలర్ట్ జారీ చేసింది. నేడు ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాలు, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెంలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది.నిన్న కుత్బుల్లాపూర్, జూబ్లీహిల్స్, యూసుఫ్‌గూడ వంటి ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. జోగులాంబ గద్వాల్ జిల్లాలో పిడుగుపాటుకు ఇద్దరు మృతి చెందారు.   రానున్న రోజుల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని అంచనాలు చెబుతున్నాయి.

ఏపీలో వర్షాలు కంటిన్యూగా పడుతూనే ఉన్నాయి. కోస్తాంధ్రతో పాటు రాయలసీమ జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. రుతుపవనాల ప్రభావతో సోమవారం మధ్యాహ్నం వరకు తీర ప్రాంతంలో అలల వేగం పెరిగినట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ కోస్తాంధ్ర తీరంలో గంటకు 45 నుంచి 55 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ తెలిపింది. కోనసీమ, ఉభయగోదావరి, కాకినాడ, కర్నూల్, బాపట్ల, అల్లూరి, విజయనగరం, అనకాపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు ఈ ప్రాంతాల్లో వేటకు వెళ్లడం మంచిది కాదని సూచించింది.