iDreamPost
android-app
ios-app

CM రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. వారికి రూ.17,500 సాయం

  • Published Sep 09, 2024 | 9:34 AM Updated Updated Sep 09, 2024 | 9:34 AM

Key Decision of CM Revant Reddy: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ని వరుణ దేవుడు ఇప్పట్లో వదిలిపెట్టేలా లేడు. గత రెండు రెండు నెలలుగా ఒకటీ రెండు రోజులు మినహాయిస్తే వరుసగా వర్షాలు దంచికొడుతూనే ఉన్నాయి. భారీ వర్షాల కారణంగా ప్రజా జీవనం అస్తవ్యస్థంగా తయారయ్యింది.

Key Decision of CM Revant Reddy: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ని వరుణ దేవుడు ఇప్పట్లో వదిలిపెట్టేలా లేడు. గత రెండు రెండు నెలలుగా ఒకటీ రెండు రోజులు మినహాయిస్తే వరుసగా వర్షాలు దంచికొడుతూనే ఉన్నాయి. భారీ వర్షాల కారణంగా ప్రజా జీవనం అస్తవ్యస్థంగా తయారయ్యింది.

CM రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. వారికి రూ.17,500 సాయం

ఏపీ, తెలంగాణలో వరకుసగా కురుస్తున్న వర్షాల కారంగా వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు చేరి ప్రజలు నానా అస్థలు పడుతున్నారు. ఏపీలో విజయవాడ, తెలంగాణలో ఖమ్మం, మహబూబాబాద్, సూర్యాపేల, వరంగల్ జిల్లాల్లో భారీ వర్షాల కారణంగా ఆస్తి, ప్రాణ నష్టం వాటిల్లింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 29 జిల్లాలను వరద ప్రభావిత జిల్లాలుగా ప్రభుత్వం ప్రకటించింది. కొన్ని ప్రాంతాల్లో వరదల కారణంగా ఇళ్లు, వాకిలి కొట్టుకుపోయాయి. పశువులు మరణించాయి.. పంట నీట మునిగిపోయింది. వరదల కారణంగా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ప్రజలు కట్టుబట్టలతో రోడ్డున పడ్డారు. వరదల వల్ల నష్టపోయిన ప్రతి ఒక్కరినీ ప్రభుత్వం ఆదుకుంటుందని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. తాజాగా రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. వివరాల్లోకి వెళితే..

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో వరుసగా వర్షాలు పడుతూనే ఉన్నాయి. గత కొన్నిరోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా కొన్ని ప్రాంతాల్లో ప్రజలు సర్వం కోల్పోయి రోడ్డున పడ్డారు. వరదల వల్ల నష్టపోయిన ప్రజలను ఆదుకుంటామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇండ్లు కోల్పోయిన వారికి ఇందిరమ్మ ఇండ్లు, పశువులకు ఒక్కోదానికి రూ.50 వేలు, మేకలు, గొర్రెలకు రూ.5 వేలు, పంట నష్టం కింద ఎకరాకు రూ.10 వేల చొప్పున అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ముఖ్యంగా వరదల్లో నిశాశ్రయులైన వారికి తక్షణ సాయంగా రూ.10 ఇవ్వనున్నట్లు ప్రకటించారు. అయితే ఈ పరిహారం విషయంలో రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Revanth reddy

బాధితులకు నష్టపరిహారం పెంచే విషయంలో టీ సర్కార్ కీలక నిర్ణమయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఉన్నతాధికారుల మద్య చర్చలు జరిగినట్లు సమాచారం. వర్షాల కారణంగా తీవ్రంగా నష్టపోయిన వారి పరిస్థితి దయనీయంగా ఉందని.. వారికి రూ.10 వేల ఆర్థిక సాయం సరిపోదని.. దాన్ని మరికొంత పెంచాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తుంది. వరదల్లో మునిగిన ఇంటి మరమ్మత్తుకు రూ.6,500, కొత్త బట్టల కోసం రూ.2,500, ఇంటి యజమానికి 30 రోజుల పనిదినాలకు రోజుకు రూ.200 చొప్పున రూ.6000, బురుదలో కూరుకుపోయిన ఇంటి సామన్ల కోసం రూ.2,500 కలిపి రూ.17,500 చొప్పున ప్రతి ఇంటికి సాయంగా అందించాలని నిర్ణయించినట్లు సమాచారం. అధికారులు ప్రతి ఇంటికి, పంటకు ఎంత నష్టం వాటిల్లిందనే పూర్తి వివరాలను క్షేత్రస్థాయిలో అధికారులు సేకరించినట్లు సమాచారం.