iDreamPost
android-app
ios-app

తెలంగాణలో వర్షాలు.. ప్రధాని మోదీ ఆరా.. హెలికాప్టర్లు పంపిస్తామని హామీ!

  • Published Sep 02, 2024 | 12:59 PM Updated Updated Sep 02, 2024 | 12:59 PM

Heavy Rains in Telangana: తెలంగాణలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జన జీవనం అస్తవ్యస్థంగా మారింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాలు పూర్తిగా జలమయం అయ్యాయి. వరదల కారణంగా చెరువులు, కాల్వలు పొంగిపొర్లుతున్నాయి.

Heavy Rains in Telangana: తెలంగాణలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జన జీవనం అస్తవ్యస్థంగా మారింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాలు పూర్తిగా జలమయం అయ్యాయి. వరదల కారణంగా చెరువులు, కాల్వలు పొంగిపొర్లుతున్నాయి.

  • Published Sep 02, 2024 | 12:59 PMUpdated Sep 02, 2024 | 12:59 PM
తెలంగాణలో వర్షాలు.. ప్రధాని మోదీ ఆరా.. హెలికాప్టర్లు పంపిస్తామని హామీ!

గత వారం రోజులుగా వరుసగా కురుస్తున్న వర్షాల కారణంగా తెలంగాణ ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. రాష్ట్రంలో దాదాపు 117 గ్రామాలకు బాహ్య ప్రపంచంలో సంబంధం లేకుండా పోయినట్లు పంచాయతీ, గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆయా గ్రామాలకు వెళ్లేందుకు రహదారులు పూర్తిగా దెబ్బతిన్నాయని పేర్కొంది. వర్షాల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఎవరూ సెలవులు తీసుకోవడానికి వీల్లేదని తెలిపారు. తెలంగాణలో భారీ వర్షాల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ.. సీఎం రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి పరిస్థితులపై ఆరా తీసినట్టు వార్తలు వస్తున్నాయి. వివరాల్లోకి వెళితే..

తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రజా జీవనం స్తంభించిపోయింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జలాశయాలు, కాల్వలు, చెరువులు నిండుకుండా మారాయి. కొన్ని చెరువులకు గండి పడటంతో కొన్ని గ్రామాలు పూర్తిగా నీటమునిగాయి. మహబూబ్ నగర్, కరీంనగర్ జిల్లాలో పలు గ్రామాలకు పూర్తిగా రాకపోకలు బంద్ అయ్యాయి. ప్రస్తుతం తెలంగాణ పరిస్థితిపై సీఎం రేవంత్ రెడ్డికి ప్రధాని మోదీ ఫోన్ చేసి వరదల పరిస్థితులు, జరిగిన నష్టం వివరాలు అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా పలు జిల్లాల్లో భారీ వర్షాల వల్ల వాటిల్లిన నష్టం ప్రాథమిక వివరాలను సీఎం ప్రధాని దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలుస్తుంది. ఈ సందర్బంగా కేంద్ర ప్రభుత్వం తరుపు నుంచి అన్నివిధాలుగా ఆదుకునేందుకు హామీ ఇచ్చినట్లు తెలుస్తుంది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనే సేవలు అందించే హెలికాప్టర్లను తెలంగాణకు పంపిస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం.

భారీ వర్షాలకు తెలంగాణ రాష్ట్రంలో ప్రాణ నష్టాలు జరగకుండా అప్రమత్తమైన అధికారులను అలర్ట్ చేసి సీఎం రేవంత్ రెడ్డిని, యంత్రాంగాన్ని ప్రధాని మోదీ అభినందించినట్లు వార్తలు వస్తున్నాయి. తెలంగాణలో వర్షాలపై హూం మంత్రి అమిత్ షా సైతం రేవంత్ రెడ్డితో ఫోన్ లో మాట్లాడారు. భారీ వర్షాలు, వరదల పరిస్థితులపై ఆరా తీశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణకు అవసరమైన తక్షణ సాయం చేస్తామని, వరద సహాయక చర్యల్లో సహకారం అందిస్తామని అమిత్ షా హామీ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.