iDreamPost
android-app
ios-app

ఏపీ, తెలంగాణకు IMD రెయిన్ అలర్ట్.. ఆ జిల్లాల్లో భారీ వర్షాలు!

  • Published Sep 05, 2024 | 11:24 AM Updated Updated Sep 05, 2024 | 11:24 AM

IMD Orange Alert for Those Districts: గత వారం రోజులుగా ఏపీ, తెలంగాణలో కురుస్తున్న వర్షాలకు ప్రజా జీవనం అస్తవ్యస్థంగా మారిపోయింది. కొన్ని ప్రాంతాల్లో వరదల కారణంగా రోడ్డు, కమ్యూనికేషన్ వ్యవస్థలు కొట్టుకుపోయాయి. దీంతో ఆయా గ్రామాలకు రాకపోకలు పూర్తిగా స్థంభించిపోయాయి. మరికొన్ని రోజులు వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ తెలిపింది.

IMD Orange Alert for Those Districts: గత వారం రోజులుగా ఏపీ, తెలంగాణలో కురుస్తున్న వర్షాలకు ప్రజా జీవనం అస్తవ్యస్థంగా మారిపోయింది. కొన్ని ప్రాంతాల్లో వరదల కారణంగా రోడ్డు, కమ్యూనికేషన్ వ్యవస్థలు కొట్టుకుపోయాయి. దీంతో ఆయా గ్రామాలకు రాకపోకలు పూర్తిగా స్థంభించిపోయాయి. మరికొన్ని రోజులు వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ తెలిపింది.

  • Published Sep 05, 2024 | 11:24 AMUpdated Sep 05, 2024 | 11:24 AM
ఏపీ, తెలంగాణకు IMD రెయిన్ అలర్ట్.. ఆ జిల్లాల్లో భారీ వర్షాలు!

ఏపీ, తెలంగాణను వరుణ దేవుడు అస్సులు విడిచేలా కనిపించడం లేదు. వర్షం, వరదల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.భారీ వర్షాలకు ఎక్కడ చూసినా చెరువులు, కాల్వలు పొంగిపొర్లుతున్నాయి. నిన్నటి వరకు వరుసగా వర్షాలతో బెంబేలెత్తిపోయిన ప్రజలకు మళ్లీ పిడుగులాంటి వార్త చెప్పింది వాతావరణ శాఖ. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడుతుందని.. దీని ప్రభావంతో ఏపీ, తెలంగాణ లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంటున్నారు అధికారులు. ఇప్పటికే నాలుగైదు రోజులుగా వాన- వరద కష్టాలతో సతమతమవుతున్న ప్రజలకు ఇప్పుడు మళ్లీ టెన్షన్ మొదలైంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా జనాలు నరకం అనుభవిస్తున్నారు. కొన్నిప్రాంతాల్లో భారీ వరదలకు ఇండ్లల్లో నీరు చేరడంతో బయటకు రాలేక, ఇళ్లల్లో ఉండలేక తెగ ఇబ్బందులు పడుతున్నారు. వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టాయి.. ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న ప్రజలకు మరో పిడుగు లాంటి వార్త వినిపించింది ఐఎండీ. ఉత్తరాంధ్ర మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. ఒకవేళ దీనికి అల్పపీడనం తోడైతే.. మరోసారి భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఇటు తెలంగాణలోనూ భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని హెచ్చరిస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. జయశంకర్ పల్లి, ములుగు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ తో పాటు.. 10 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. మరోవైపు ఎగువ నుంచి వస్తున్న వరదతో భద్రాచలం దగ్గర గోదావరి ఉధృతి పెరిగిపోతుంది. అయితే ఈ వరద మొత్తం పోలవరం, ధవళేశ్వరం మీదుగా వెళ్లి సముద్రంలో కలిసిపోతుంది.

గోదావరి ఉప్పొంగిపోతున్న వేళ.. పోలవరం ముంపు మండలాల ప్రజలు, లంక గ్రామాల ప్రజలే ఎప్పుడు ఏ ఉపధ్రవం ముంచుకు వస్తుందో అని గజగజ వణికిపోతున్నారు. ఏపీ, తెలంగాణలో ఈ నెల 9 వరకు విస్తారంగా వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరిస్తుంది. నేడు శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి, మన్యం, విశాఖ, అనకాపల్లి, కాకిపాడు, ఎలూరు, ఎన్టీఆర్ జిల్లా లో మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనవసరంగా బయటకు వెళ్లే పనులు మానుకోవాలని, మత్స్యకారులు వేలకు వెళ్లడం ప్రమాదం అని హెచ్చరించింది.