Krishna Kowshik
Vijayawada Rains: ఏపీ వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వానలు కురుస్తున్నాయి. ముఖ్యంగా విజయవాడ నగరాన్ని ముంచెత్తుతున్నాయి. గతంలో ఇలాంటి వర్షాలను విజయవాడ వాసులు చూడలేదు.
Vijayawada Rains: ఏపీ వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వానలు కురుస్తున్నాయి. ముఖ్యంగా విజయవాడ నగరాన్ని ముంచెత్తుతున్నాయి. గతంలో ఇలాంటి వర్షాలను విజయవాడ వాసులు చూడలేదు.
Krishna Kowshik
ఎండలతో గజగజలాడే విజయవాడను వానలు భయపెడుతున్నాయి. బంగాళా ఖాతంలో ఏర్పడిన అల్ప పీడన ప్రభావం ఉత్తరాంధ్రతో పాటు కోనసీమ, ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో భారీ వానలు కురుస్తున్నాయి. గత రెండు రోజుల నుండి వరుణుడు బెజవాడపై తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. గతంలో ఎన్నడూ లేని విధంగా కుండపోత వానలు ముంచెత్తుతున్నాయి. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. నదులు, చెరువులను తలపిస్తున్నాయి. వన్ టౌన్, టుటౌన్ అని సంబంధం లేకుండా వరద నీరు పెద్ద యెత్తున రోడ్లపై ప్రవహిస్తోంది. ఏలూరు రోడ్డు, బందర్ రోడ్డు, గురునానక్ కాలనీ, మొగల్రాజపురం, చుట్టుగుంట, కృష్ణలంక, రామలింగేశ్వర్ నగర్, సింగ్ నగర్, బుడమేరు, ఆర్ఆర్ నగర్ ప్రాంతాల్లో రహదారులు జలమయమయ్యాయి. నగరంలో ఏ రోడ్డు చూసిన మోకాళ్ల లోతు వాన నీరు చేరింది.
నాన్ స్టాప్‌గా విజయవాడలో వానలు కురుస్తూనే ఉన్నాయి. పలు ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రకాశం బ్యారేజ్ వద్దకు వరద ఉధృతి పెరిగింది. ఇటు నగరంలో ఎటు చూసినా వరద నీరే కనిపిస్తుంది. దీంతో రాకపోకలు సాగించాలంటే తీవ్ర ఇబ్బందులకు గురౌతున్నారు. ఎడతెరిపి లేకుండా వానలు ముంచెత్తుతున్నాయి. గతంలో ఎన్నడూ ఇలాంటి వర్షాలు చూడటం లేదని నగర వాసులు చర్చించుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. గత 24 గంటల్లో విజయవాడలో 264 మి.మీ వర్షపాతం నమోదైంది. అంటే సుమారు 18 సెం. మీ వర్షపాతం రికార్డు అయ్యింది. వెదర్ మ్యాన్ రిపోర్ట్ ప్రకారం.. ఆగస్టు నెలలో అత్యధిక వర్షపాతం ఇదేనని తెలుస్తుంది. అలాగే గత 200 ఏళ్లలో ఆగస్టులో నమోదైన గరిష్ట వర్షపాతం ఇదేనని సమాచారం.
బెంజ్ సర్కిల్ దగ్గర 161 మి.మీ, గన్నవరం విమానాశ్రయం 123 మి.మీ వర్షపాతం నమోదైంది. ఇక విజయవాడకు ఆనుకుని ఉన్న తాడేపల్లిలో 121 మి.మీ. మంగళగిరి 118 మి.మీల వర్షపాతం రికార్డైంది. ఎస్ఆర్ఎం, అమరావతి పరిసర ప్రాంతాల్లో 327 మిమీల వర్షపాతం నమోదైంది. మొత్తానికి చరిత్రలో కనివిని ఎరుగని రీతిలో బెజవాడను వానలు ముంచెత్తాయి. ఇదిలా ఉంటే..విజయవాడలో వానలకు కొండచరియలు విరిగిపడి నలుగురు మరణించారు. రోడ్లన్నీ జలమయయ్యాయి. దుర్గా ఘాట్, ఫ్లై ఓవర్లను తాత్కాలికంగా మూసివేశారు అధికారులు. అలాగే రెడ్ ఎలర్ట్ ప్రకటించారు. అత్యవసరమైతే తప్పితే బయటకు రావొద్దని సూచిస్తున్నారు. కాగా, మరికొన్ని రోజుల పాటు వానలు కురుస్తాయని ఐఎండీ చెబుతుంది.
విజయవాడ ఆర్ టి సి బస్టాండ్ లోబ్రిడ్జి వద్ద నీటిలో నిలిచిపోయిన బస్సులు
లో బ్రిడ్జి వద్ద నిలిచిపోయిన నడుము లోతు వర్షం నీరు#Vijaywada pic.twitter.com/LpIHDMnrh7
— TV5 News (@tv5newsnow) August 31, 2024