iDreamPost
android-app
ios-app

AP: వాయుగుండం తీరం దాటిందా? రానున్న 24 గంటల్లో పరిస్థితి ఏంటి? పూర్తి వివరాలు..

  • Published Sep 01, 2024 | 5:35 PM Updated Updated Sep 01, 2024 | 5:35 PM

Heavy Rains: గడిచిన 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. ఈ రోజు రేపు కూడా కోస్తాంధ్ర లో విస్తారంగా వర్షాలు పడతాయని సమాచారం.

Heavy Rains: గడిచిన 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. ఈ రోజు రేపు కూడా కోస్తాంధ్ర లో విస్తారంగా వర్షాలు పడతాయని సమాచారం.

AP: వాయుగుండం తీరం దాటిందా? రానున్న 24 గంటల్లో పరిస్థితి ఏంటి? పూర్తి వివరాలు..

ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తున్నాయి.  బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ కుండపోత వర్షాల కారణంగా జనాలు అల్లాడిపోతున్నారు. బంగాళా ఖాతానికి ఆనుకొని ఉన్న ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి అయితే చాలా ముప్పు ఉంది. ఈ ఎడతెరిపి లేని వర్షాల కారణంగా చాలా చోట్ల ప్రాణ నష్టం, ఆస్తి నష్టం ఎక్కువగా జరుగుతుంది. పంట పొలాలు నాశనం అవుతున్నాయి. చాలా మంది వరదల్లా పారుతున్న ఈ వాన నీటిలో కొట్టుకుపోతున్నారు. ఇక గడిచిన 24 గంటల్లో అయితే భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. అమరావతిలో 26 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదయ్యింది. తిరువూరులో 25 సెంటీ మీటర్లు, గుంటూరులో 23 సెంటీ మీటర్లు, తెనాలిలో 18 సెంటీ మీటర్లు, మంగళగిరిలో 17 సెంటీ మీటర్లు, విజయవాడలో 17.5 సెంటీ మీటర్ల అత్యధిక వర్షపాతం నమోదు అయ్యాయి. నిన్నటి నుంచి భారీ వర్షాలు ఆగకుండా కురుస్తూనే ఉన్నాయి.

బంగాళా ఖాతంలోని వాయుగుండం గత అర్ధరాత్రి కళింగ పట్నం దగ్గర 12:30-2:30 గంటల మధ్య తీరం దాటింది. ఇక తీరం దాటిన ఈ వాయు గుండం జగదల్ పూర్ కు అగ్నేయంగా 60 కిలోమీటర్లు ఉంది. విశాఖకు వాయువ్యంగా 120 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక ఈ రోజు రేపు కూడా కోస్తాంధ్ర లో విస్తారంగా వర్షాలు పడతాయని సమాచారం తెలుస్తుంది. రాబోయే 24 గంటల్లో పల్నాడు, ఎన్టీఆర్, గుంటూరు, ప్రకాశం జిల్లాలో అతిగా భారీ వర్షాలు పడనున్నాయని తెలుస్తుంది. ఈ జిల్లాలో అధికారులు రెడ్ అలెర్ట్ జారీ చేసారు. ఇక ఏలూరు, కృష్ణ, బాపట్ల జిల్లాలో ఆరెంజ్ అలెర్ట్ జారీ చేశారు. ఈ జిల్లాల్లో రాబోయే 24 గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయని సమాచారం తెలుస్తుంది. ఇక ఉత్తరాంధ్ర తీరం వెంబడి బలమైన గాలుల వీస్తాయని సమాచారం తెలుస్తుంది. అందుకే పొరపాటున కూడా ఈ రోజు కానీ రేపు కానీ మత్స్యకారులు చేపల వేటకి వెళ్ళ వద్దని హెచ్చరిస్తున్నారు. ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాలో వర్షాలు కుండపోతగా పడే అవకాశం ఉంది . కాబట్టి ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. అస్సలు బయటకు రావొద్దని సూచిస్తున్నారు.