దేశ విభజన తరువాత మన దేశంలో రోజు రోజుకి మైనార్టీల జనాభా పెరిగిపోతుంటే, పాకిస్థాన్ లో మాత్రం మైనారిటీలుగా ఉన్న హిందువులు, వేరే మతాల జనాభా సంఖ్యా తగ్గుతూనే వస్తుంది. తాజాగా వచ్చిన గణాంకాల ప్రకారం పాకిస్థాన్ లో హిందువులు, క్రిస్టియన్స్, వేరే మతాల జనాభా 2 శాతం కూడా లేకపోవడం గమనార్హం. పాకిస్థాన్‌లో మొత్తం నమోదిత జనాభా 18 కోట్ల 68లక్షలు కాగా అందులో ఆ దేశంలో మైనారిటీలుగా ఉన్న హిందువుల జనాభా 1.18శాతంగా ఉన్నట్లు […]
ఇటీవల ఎండలు బాగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. రానున్న కాలంలో ఎండలు మరింత పెరుగుతాయని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. భూమి మీద పెరిగే ఈ వేడికి ఏకంగా మంచుకొండలు కరుగుతున్నాయి. వాటిలో మన హిమాలయాలు కూడా ఉన్నాయి. తాజాగా ఇప్పుడు ఉన్న ఎండలకు ఉత్తర పాకిస్థాన్ లో ఉన్న షిష్పర్ గ్లేసియర్ హిమాలయాలు కరిగి ఆ నీరంతా హస్నాబాద్ వద్ద ఉన్న నదిలోకి వరద ప్రవాహంగా వెళ్తుంది. దీంతో ఆ వరదల వల్ల చుట్టుపక్కల […]
గతేడాది ఇంగ్లాండ్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్ సమయంలో భారత జట్టుకు జరిగిన అవమానం గురించి భారత ఆల్ రౌండర్ విజయ్ శంకర్ వెల్లడించాడు. తాజాగా భారత్ ఆర్మీ పాడ్‌క్యాస్ట్‌లో మాట్లాడుతూ పాకిస్థాన్‌తో మ్యాచ్‌కు ముందు రోజు జరిగిన బాధాకరమైన సంఘటనను ప్రస్తావించాడు. చిరకాల ప్రత్యర్థి పాక్ అభిమాని దూషణ పర్వం గురించి శంకర్ తెలియజేస్తూ “దాయాది పాకిస్థాన్ మ్యాచ్‌కు ముందు తనకు జట్టులో స్థానం కల్పిస్తున్నట్లు యాజమాన్యం తెలియజేసింది. అందుకు నేను సిద్ధంగా ఉండటంతో సంతోషంగా ఒప్పుకున్నాను. […]
పాకిస్థాన్‌లో కరోనా వైరస్ వ్యాప్తి పెరుగుతుంది.పలువురు క్రికెటర్లకు కూడా కరోనా వైరస్ సోకుతుంది. ఇప్పటికే పాక్ మాజీ స్టార్ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిది కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. తాజాగా మరో ముగ్గురు క్రికెటర్లకు కరోనా సోకినట్లు తేలడంతో వారిని హోమ్ క్వారంటైన్ లో ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది. పాక్ క్రికెటర్లు షాదాబ్, హరీష్ రవూఫ్, హైదర్ అలీ కరోనా వైరస్ బారిన పడినట్టు పాక్ క్రికెట్ బోర్డు వెల్లడించింది. ఆదివారం నిర్వహించిన కరోనా నిర్దారణ […]
పాకిస్తాన్‌లోని ఇస్లామాబాద్‌లో ఇద్దరు భారత హైకమిషన్ అధికారులు అదృశ్యం అయ్యారు. సోమవారం ఉదయం 8 గంటల నుంచి వీరిద్దరూ అదృశ్యం అయినట్లు సమాచారం. ఈ ఘటనను భారత్ తీవ్రంగా పరిగణిస్తుంది. ఇద్దరు అధికారుల అదృశ్యంపై పాకిస్తాన్ ప్రభుత్వానికి భారత ప్రభుత్వం ఫిర్యాదు చేసింది. ఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్ కు పిర్యాదు చేశారు. అయితే న్యూఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్‌లోని వీసా విభాగంలో పని చేసే ఇద్దరు పాకిస్తాన్ అధికారులు గూఢచర్యం ఆరోపణలు ఎదుర్కొని బహిష్కరణకు గురైన తరువాత పాకిస్తాన్లో […]
ప్రపంచమంతా కరోనా మహమ్మారిపై యుద్ధం చేస్తుంటే పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు మాత్రం జమ్మూ కాశ్మీర్లో భద్రతా దళాలు లక్ష్యంగా దాడులకు తెగబడుతున్నారు. కుప్వారా జిల్లా హంద్వారాలో ఆదివారం తెల్లవారుజామున ఉగ్ర మూకల కాల్పులలో కల్నల్ అశుతోష్ శర్మతో పాటు,ఒక మేజర్, ఒక ఎస్సై,ఇద్దరు సైనికులు వీరమరణం పొందిన ఘటన మరవక ముందే ఉగ్రవాదులు మరో దుశ్చర్యకు ఒడిగట్టారు. సోమవారం ఉగ్రవాదులు జరిపిన దాడిలో ముగ్గురు సీఆర్పీఎఫ్ జవాన్లు అమరులయ్యారు. కుప్వారా జిల్లా హంద్వారా ప్రాంతంలో క్వాజిబాద్ సమీపంలో […]
కరోనా వైరస్ వ్యాప్తి ఇప్పుడు పాకిస్తాన్ జైళ్లలో ఉన్న ఉగ్రవాదుల పాలిట వరంగా మారింది. జైళ్లలో ఉన్న ఖైదీలకు వైరస్ సోకుతుందన్న కారణంతో పాకిస్థాన్ ప్రభుత్వం వారిని ఇళ్లకు పంపింది. పాకిస్తాన్ కు బ్లాక్ లిస్ట్ ముప్పు తప్పాలంటే ఉగ్రవాద కార్యకలాపాల్ని పూర్తిగా నిషేధించాలని ఎఫ్ఏటీఎఫ్ గట్టిగా హెచ్చరించిన విషయం తెలిసిందే. దీంతో ఎఫ్ఏటీఎఫ్ వ్యాఖ్యల్ని పరిగణనలోకి తీసుకున్న పాకిస్థాన్ ప్రభుత్వం గత కొన్ని నెలల్లో చాలా మంది ఉగ్రవాదుల్ని అరెస్టు చేసింది. కాగా కరోనా వైరస్ […]
భారత అగ్ర ఆటగాళ్లు సచిన్ టెండూల్కర్, ధోనీ,కోహ్లీ నుంచి మైదానం లోపలా బయటా ఎలా హుందాగా ప్రవర్తించాలో నేర్చుకోవాలని తన సోదరుడు, పాక్ నిషేధిత క్రికెటర్ ఉమర్ అక్మల్‌కు వికెట్ కీపర్ కమ్రాన్ సూచించాడు.ఈ ఏడాది ప్రారంభములో పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో ఫిక్సింగ్ చేయమంటూ తనను కలిసిన బుకీల సమాచారం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అవినీతి నిరోధక శాఖ అధికారులకి అతను తెలపలేదు.కానీ ఈ వ్యవహారం బహిర్గతం కావడంతో విచారణ జరిపిన పీసీబీ గత సోమవారం అన్ని […]
సాధారణంగా మైదానాలలో ఎక్కువ సమయం గడిపే క్రికెటర్లు కరోనా వైరస్ కారణంగా ఆయా దేశాలలో ప్రభుత్వాలు లాక్డౌన్ విధించడంతో ఇళ్లలోనే తమ కుటుంబ సభ్యులతో కాలక్షేపం చేస్తున్నారు.కానీ సోషల్ మీడియాలో ఇతర ఆటగాళ్లతో అభిమానులతో ముచ్చడిస్తున్నారు. అదే కోవలో ప్రస్తుతం ఇంట్లోనే ఉంటున్నా పాక్ పేస్ బౌలర్ మహమ్మద్ అమీర్ రెగ్యులర్‌గా అభిమానులతో టచ్‌లో ఉంటాడు.తాజాగా సోషల్ మీడియాలో అమీర్‌ని అత్యుత్తమ బ్యాట్స్‌మెన్ ఎవరని ఒక అభిమాని ప్రశ్నించాడు. పాక్ బౌలర్ అమీర్ సమాధానం చెబుతూ ” […]
శుక్రవారం 47వ పుట్టినరోజు జరుపుకున్న మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తన తొలి టెస్ట్ మ్యాచ్ అనుభవం గురించి ఒక ఆసక్తికర విషయాన్ని సోషల్ మీడియాలో వెల్లడించాడు.కనీసం ఒక రంజీ మ్యాచ్ కూడా ఆడకుండా పదహారేళ్ల నూనూగు మీసాల సచిన్ పాక్ గడ్డపై టెస్ట్ క్రికెట్లో అరంగేట్రం చేశాడు.1989 నవంబర్ 15న కరాచీ మైదానంలో మొదలైన ఆ మ్యాచ్‌లో ఆరో స్థానంలో బ్యాటింగ్‌కి దిగిన సచిన్ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 24 బంతులు ఎదుర్కొని రెండు ఫోర్లు కొట్టి […]