iDreamPost
android-app
ios-app

పాకిస్థాన్ అంబానీ కూతురు! ఏకంగా రూ.123 కోట్లు విరాళం!

  • Published Jan 25, 2024 | 2:53 PM Updated Updated Jan 25, 2024 | 2:53 PM

ఎంతోమంది అత్యంత ధనవంతులు ఉన్నా నిస్సహాయ స్తితిలో ఉన్నవారిని అదుకోవడానికి వెనుకడుగు వెస్తారు. అతి కొద్దిమంది ధనవంతులు మాత్రమే సహాయం చేయడానికి ముందడుగు వేస్తారు. అయితే తాజాగా పాకిస్తాన్ కు చెందిన ఓ ధనవంతుడి కూమార్తే చేసిన పనికి మాత్రం అందరూ ఆశ్యర్యపోతున్నారు. అసలు ఏం జరిగిదంటే..

ఎంతోమంది అత్యంత ధనవంతులు ఉన్నా నిస్సహాయ స్తితిలో ఉన్నవారిని అదుకోవడానికి వెనుకడుగు వెస్తారు. అతి కొద్దిమంది ధనవంతులు మాత్రమే సహాయం చేయడానికి ముందడుగు వేస్తారు. అయితే తాజాగా పాకిస్తాన్ కు చెందిన ఓ ధనవంతుడి కూమార్తే చేసిన పనికి మాత్రం అందరూ ఆశ్యర్యపోతున్నారు. అసలు ఏం జరిగిదంటే..

  • Published Jan 25, 2024 | 2:53 PMUpdated Jan 25, 2024 | 2:53 PM
పాకిస్థాన్ అంబానీ కూతురు! ఏకంగా  రూ.123 కోట్లు విరాళం!

దానధర్మాల‌కు మించిన సంపద ఏది లేదంటారు. కానీ, ఈ ప్రపంచంలో ఎంతోమంది అత్యంత ధనవంతులు ఉన్నా నిస్సహాయ స్తితిలో ఉన్నవారిని అదుకోవడానికి  మాత్రం వెనుకడుగు వెస్తారు. అతి కొద్దిమంది ధనవంతులు మాత్రమే సహాయం చేయడానికి ముందడుగు వేస్తారు. ఈ క్రమంలోనే.. చాలామంది కుబేరులు తమ సంపదలో కొంత భాగాన్ని పేదవారికి సహాయం చేస్తూ తమ గొప్ప మనస్సుని చాటుకుంటున్నారు. ముఖ్యంగా పేదవారికి అత్యంత విలువైన విద్యను అందించడంతో పాటు.. ధన సహాయం కూడా చేస్తున్నారు. అలాగే ట్రస్ట్ లను నడిపించడం, ఉపాధి కల్పించడం ఇలా మరోన్నో విధాలుగా పేదవారికి అండగా ఉంటూ గొప్ప ప్రఖ్యాతలను సంపాదించుకున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా పాకిస్తాన్ కు చెందిన ఓ ధనవంతుడి కూమార్తే చేసిన పనికి అందరూ ఆశ్చర్యపోతున్నారు. అసలు ఏం జరిగిదంటే..

భారతదేశంలో అత్యంత కుబేరుడైన ముఖేష్ అంబానీ మాదిరిగానే, పాకిస్తాన్ లో కూడా అత్యంత పేరు గాంచిన ధనవంతుడు ఒకరు ఉన్నారు. అతని పేరు షాహిద్ ఖాన్. అయితే ఈయన పేరు చాలా మందికి తెలియకపోవచ్చు. కానీ, అత్యంత విలాసవంతమైన జీవితం గడిపే సంపన్నులలో షాహిద్ కూడా ఒకరు. ఇక అంబానీ పిల్లలులాగే షాహిద్ పిల్లలు కూడా (కూమారుడు టోనీ ఖాన్, కుమార్తె షన్నా ఖాన్) వ్యాపార రంగంలో ప్రతిభ వంతులుగా తమదైన ముద్ర వేసుకున్నారు. ఇక షాహీద్ ఖాన్ కుమార్తే.. షన్నా ఖాన్ గురించి కూడా పెద్దగా ఎవరికి తెలియక పోవచ్చు. ఈమె జాగ్వార్స్ ఫౌండేషన్ ద్వారా స్వచ్ఛంద కార్యక్రమాలు చేస్తూ ఉంటుంది. అయితే తాజాగా షన్నా ఖాన్, ఆమె కుటుంబంతో కలిసి గత ఏడాది యూనివర్శిటీ ఆఫ్ ఇల్లినాయిస్ వెటర్నరీ టీచింగ్ హాస్పిటల్ కు రూ. 123 కోట్లు విరాళంగా అందించి తన గొప్ప మనస్సును చాటుకుంది.

ఇక షన్నా ఖాన్.. జాగ్వార్స్ ఫౌండేషన్ ద్వారా.. బలహీన వర్గాలకు చెందిన యువతకు, వారి కుటుంబాలకు సహాయం చేస్తూ ఉంటుంది. ఈమె వోల్ఫ్ పాయింట్ అడ్వైజర్స్ మేనేజింగ్ డైరెక్టర్ జస్టిన్ మెక్ కేబ్ ను వివాహం చేసుకుంది. ప్రస్తుతం షన్నా ఆస్తుల విలువ 20 మిలియన్ డాలర్ల వరకు ఉంటుందని అంచనా. నిజానికి షన్నా ఖాన్ ప్రత్యేక ప్యాకేజింగ్ డిజైన్ సంస్థ యునైటెడ్ మార్కెటింగ్ కంపెనీకి సహ యజమానిగా కూడా పనిచేస్తోంది.

కాగా, షాహిద్ ఖాన్ కూమారుడు టోనీ ఖాన్ కూడా షనల్ ఫుట్ బాల్ లీగ్(NFL)జాక్సన్ విల్లే జాగ్వార్స్ అండ్ ప్రీమియర్ లీగ్ ఫుల్ హామ్ FC ఓనర్. కాబట్టి ఇతడు చాలా స్పోర్ట్స్ వెంచర్లలో పాల్గొంటాడు. అలాగే తండ్రితో పాటు ఆల్ ఎలైట్ రెజ్లింగ్ కి కో- ఓనర్ గా కూడా పనిచేస్తున్నాడు. ఇక షాహిద్ ఖాన్ మొత్తం ఆస్తుల విలువ రూ. 97,276 కోట్లు కావాడం గమనార్హం. మరి, కోట్ల రూపాయలు హాస్పిటల్ కు విరాళంగా ఇచ్చిన షన్నా ఖాన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.