పాకిస్థాన్‌లో కరోనా వైరస్ వ్యాప్తి పెరుగుతుంది.పలువురు క్రికెటర్లకు కూడా కరోనా వైరస్ సోకుతుంది. ఇప్పటికే పాక్ మాజీ స్టార్ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిది కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. తాజాగా మరో ముగ్గురు క్రికెటర్లకు కరోనా సోకినట్లు తేలడంతో వారిని హోమ్ క్వారంటైన్ లో ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది.
పాక్ క్రికెటర్లు షాదాబ్, హరీష్ రవూఫ్, హైదర్ అలీ కరోనా వైరస్ బారిన పడినట్టు పాక్ క్రికెట్ బోర్డు వెల్లడించింది. ఆదివారం నిర్వహించిన కరోనా నిర్దారణ పరీక్షల్లో వారికి కరోనా వైరస్ బయటపడినట్లు వెల్లడించింది. కాగా కరోనా నిర్దారణ పరీక్షలు నిర్వహించేంత వరకూ షాదాబ్, హరీష్ రవూఫ్, హైదర్ అలీలలో కరోనా వ్యాధి సింప్టమ్స్ కనిపించలేదని ఆదివారం పరీక్షల్లో బయటపడిందని పాక్ క్రికెట్ బోర్డు తెలిపింది. ఇమాద్ వసీం, ఎస్మాన్ షిన్వరికి కూడా టెస్టులు చేయగా వారికి నెగెటివ్‌గా నిర్ధారణ అయిందని, మరికొందరు క్రీడాకారులకు, అధికారులకు పరీక్షలు నిర్వహించామని వారి రిపోర్టులు వచ్చిన తర్వాత ఎంతమందికి వ్యాధి సోకిందనేది పూర్తిగా వెల్లడి కానుంది. కాగా వ్యాధి నిర్దారణ అయిన ముగ్గురు క్రికెటర్లను హోమ్ క్వారెంటయిన్ లో ఉండాలని పాక్ బోర్డ్ ఆదేశించింది.
కాగా పాకిస్థాన్ లో 1,81,088 మందికి కరోనా సోకగా 3,590 మంది కరోనా కారణంగా మృత్యువాత పడ్డారు…