పెళ్లి వేడుక అనేది ప్రతి ఒక్కరి జీవితంలో మధురమైన జ్ఞాపకం. అందుకే తమ పెళ్లిని ఎంతో ఘనంగా చేసుకోవాలని యువత కోరుకుంటుంది. బంధుమిత్రుల సమక్షంలో చేసుకుని పెళ్లి.. జీవితంలో మర్చిపోలేని మధురమైన ఘట్టంగా మార్చుకోవాలని ప్రతి ఒకరు ఆశపడుతుంటారు. ఈ క్రమంలోనే తమ బంధువులందరిని పెళ్లికి ఆహ్వానిస్తుంటారు. ఇలా వచ్చిన బంధువు, మిత్రుల మధ్య నూతన వధూవరులు ఒకటవుతుంటారు. అలానే పెళ్లికి వచ్చిన అతిధుల సందడి ఓ రేంజ్ లో ఉంటుంది. అయితే కొన్ని పెళ్లిళ్లలో జరిగే చిన్న పాటి గొడవలు పెద్ద విషాదాన్ని మిగులుస్తాయి. తాజాగా ఓ పెళ్లిలో జరిగిన గొడవ 9 మందిని బలి తీసుకుంది. ఈ దారుణ ఘటన పాకిస్తాన్ లో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
పాకిస్తాన్ లోని ఖైబర్ ఫాక్తున్వ ప్రావిన్స్ లో ఓ పెళ్లి వేడుక జరిగింది. ఈ వేడుకకు వధువరుల తరపు బంధువులు, మిత్రులు అందరూ భారీగా హాజరయ్యారు. అలానే పెళ్లిలో ఎంతో సందడి, సరదా అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. కాసేపట్లో పెళ్లి వేడుక ముగుస్తుందనగా.. చిన్న పాటి గొడవ జరిగిందని సమాచారం. ఆ చిన్న గొడవ కాస్తా.. పెద్ద తుఫాన్ లా మారి.. పెద్ద ఘర్షణకు దారి తీసింది. ఈ క్రమంలో ఒకే కుటుంబానికి చెందిన 9 మందిని ఏకంగా పెళ్లికి వచ్చిన బంధువులోని కొందరు కాల్చి చంపారు. ఈ ఘటనతో అందరూ ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. మాలాఖాన్ జిల్లా బత్కేలా తహసీల్ లో ఈ దారుణం జరిగింది. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఆరుగురు పురుషులు ఉన్నారు. పెళ్లి వివాదమే ఈ హత్యలకు కారణమని ప్రాథమికంగా పోలీసులు గుర్తించారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలని పరిశీలించారు. అలానే రంగంలోకి దిగిన పారా మిలిటరీ బలగాలు.. అన్ని జిల్లాల సరిహద్దులను మూసివేసి పరారీలో ఉన్న.. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సందడిగా సాగుతున్న పెళ్లి మండపంలో చిన్న చిన్న గొడవలు జరగడం సహజమే. ఆహరం విషయంలోనో, కట్నం , మర్యాదల విషయంలోనూ ఇలా కొన్ని సందర్భాల్లో గొడవలు జరుగడం మనం చూస్తూ ఉంటాము. ఇలా జరిగే గొడవల మధ్యలో ఎవరో ఒకరు కలుగజేసుకుని.. ఆ గొడవను సర్ధుమనిగేలా చేయడానికి చేస్తుంటారు. అలా ఈ పెళ్లి వేడుకలో ఎవరు చేయకపోవడమే కాక.. గొడవ కాస్తా పెద్దదిగా అయ్యేలా చేసినట్లు సమాచారం. దాని ఫలితమే 9 మంది ప్రాణాలను పోయాయి. మరి.. పెళ్లి వేడుకలో జరిగిన ఈ మారణ కాండపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.