Dharani
Dharani
అవసరం ఉన్నా లేకున్నా మన దేశంపై విమర్శలు చేయడం.. నిరాధార ఆరోపణలు చేయడం.. అంతర్జాతీయ వేదికల మీద అబద్ధాలు ప్రచారం చేయడంలో పాకిస్తాన్ ఎంతటి అత్యుత్సాహం చూపుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సని పని లేదు. సందర్భం దొరికి ప్రతి సారి భారత్‌పై తన అక్కసును వెళ్లగక్కుతుంది. మనల్ని దెబ్బకొట్టడానికి.. ఉగ్రమూకలకు సైతం ఆశ్రయం ఇస్తుందన్నది బహిరంగ రహస్యం. సందు దొరికితే చాలు విమర్శలు చేయడమే పనిగా పెట్టుకునే పాక్, ఆ దేశ నేతలు.. తొలిసారి కాస్త భిన్నంగా స్పందించారు. భారత్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 ప్రయోగంపై పాక్ నేత ఒకరు ప్రశంసలు కురిపించారు. ఆ వివరాలు..
చంద్రయాన్-3 ప్రయోగంలో తుది అంకానికి రంగం సిద్ధమైంది. విక్రమ్ ల్యాండింగ్ కోసం భారతదేశంతో పాటు ప్రపంచ దేశాలు కూడా ఆత్రుతగా ఎదురు చూస్తున్నాయి. ఈ క్రమంలో దాయాది దేశం పాకిస్తాన్ సైతం చంద్రయాన్-3 గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. పాక్ నేత ఒకరు చంద్రయాన్ ప్రయోగంపై ప్రశంసలు కురిపించారు. పాకిస్తాన్ మాజీ మంత్రి ఫవాద్ ఛౌదరీ ఈ మిషన్‌ను అభినందిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశౠరు.
‘‘పాక్ మీడియా ఈ చంద్రయాన్-3 ల్యాండింగ్ ప్రయోగాన్ని ప్రసారం చేయాలి. మానవాళికి మరీ ముఖ్యంగా భారత అంతరిక్ష రంగానికి ఇవి చరిత్రాత్మక క్షణాలు. వారికి ఇవే మా అభినందనలు’’ అని ట్విటర్(ఎక్స్)లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరలవుతోంది. ఫవాద్.. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ హయాంలో ఫవాద్ సమాచార, ప్రసార శాఖ మంత్రిగా పనిచేశారు.
భారత్ ప్రయోగించిన చంద్రయాన్-3 ఎటువంటి అవాంతరాలు ఎదురవ్వకపోతే.. నేడు అనగా ఆగస్టు 23న చందమామ దక్షిణ ధ్రువం వద్ద దిగవచ్చని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) అధ్యక్షుడు సోమనాథ్ వెల్లడించారు. ఒకవేళ ఏ కారణం వల్లనైనా నేడు చంద్రయాన్-3 ల్యాండర్ చంద్రుడిపై ల్యాండ్ కాకపోతే.. ఈ నెల 27వ తేదీన దిగే ప్రయత్నం చేస్తామన్నారు. ఆ పని దిగ్విజయంగా పూర్తయితే చంద్రుడిపై ల్యాండర్-రోవర్‌ను దింపిన ఘనత అమెరికా, రష్యా, చైనాల తరవాత భారతదేశానికే దక్కుతుంది. చంద్రయాన్ విజయం కోసం దేశవ్యాప్తంగా అన్ని మతాల ప్రజలు ప్రార్థనలు చేస్తున్నారు.
Pak media should show #Chandrayan moon landing live tomorrow at 6:15 PM… historic moment for Human kind specially for the people, scientists and Space community of India…. Many Congratulations
— Ch Fawad Hussain (@fawadchaudhry) August 22, 2023