iDreamPost
android-app
ios-app

Ram Charan: పాకిస్తాన్ మీడియాలో రామ్ చరణ్ గురించి చర్చ.. వీడియో వైరల్

  • Published Mar 08, 2024 | 1:12 PM Updated Updated Mar 08, 2024 | 1:12 PM

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు ఇప్పుడు ఎంతమంది అభిమానులు ఉన్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే, ఇప్పుడు ఈ హీరో గురించి పాకిస్తాన్ మీడియాలో సైతం చర్చలు జరుగుతున్నాయి. దానికి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు ఇప్పుడు ఎంతమంది అభిమానులు ఉన్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే, ఇప్పుడు ఈ హీరో గురించి పాకిస్తాన్ మీడియాలో సైతం చర్చలు జరుగుతున్నాయి. దానికి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

  • Published Mar 08, 2024 | 1:12 PMUpdated Mar 08, 2024 | 1:12 PM
Ram Charan: పాకిస్తాన్ మీడియాలో రామ్ చరణ్ గురించి చర్చ.. వీడియో వైరల్

ఆర్ఆర్ఆర్ సినిమాతో దర్శకుడు రాజమౌళి వలన .. రామ్ చరణ్ కు పాన్ ఇండియా లెవెల్లో మంచి గుర్తింపు వచ్చింది. ఇప్పుడు రామ్ చరణ్ పేరు ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తోంది. ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్ చరణ్ రామ రాజు పాత్రలో ఎంతో అద్భుతంగా నటించారు. ఓ రకంగా ఆర్ఆర్ఆర్ సినిమాకు ముందు కనిపించిన రామ్ చరణ్ వేరు , ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత కనిపించే రామ్ చరణ్ వేరు అని చెప్పి తీరాలి. ఇక ఇప్పుడు రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే, ఇప్పుడు ఈ సినిమా గురించి .. ఈ సినిమాలో రామ్ చరణ్ క్యారెక్టర్ గురించి .. పాకిస్తాన్ మీడియాలో సైతం వినిపిస్తున్నాయి, చర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ఒకటి సామజిక మాధ్యమాలలో వైరల్ అవుతోంది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్ చరణ్ రామ రాజు పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఈ సినిమాలో రామ్ చరణ్ ఎంట్రీ సీన్ అందరికి గూస్ బంప్స్ తెప్పించాయని .. చెప్పి తీరాలి. వేలమంది జనాల మధ్యలోకి దూకి రామ్ చరణ్ చేసే ఫైట్స్ , యాక్షన్ సీన్స్ వేరే లెవెల్ లో ఉంటాయి. అయితే, తాజాగా ఈ యాక్షన్ సీన్స్ గురించి, రామ్ చరణ్ నటన గురించి .. పాకిస్తాన్ మీడియా సైతం మాట్లాడుకోడం అందరిని ఆశ్చర్యాన్ని కలిగించాయి. తాజాగా పాకిస్తాన్ కి చెందిన ఓ ప్రముఖ ఎంటర్‌టైన్మెంట్ ఛానల్‌లో.. ఈ యాక్షన్ సీక్వెన్స్ గురించి స్పెషల్ గా చర్చించుకున్నారు. “ఆర్అర్ఆర్ లో..రామరాజు పాత్ర పోషించిన రామ్ చరణ్ వేలమంది మధ్యలోకి దూకి మరి ఫైట్ చేసి, మళ్ళీ తిరిగి వచ్చి అదే పొజిషన్ లో నిలబడే సిన్ మైండ్ బ్లోయింగ్ అనిపించింది” అంటూ చెప్పుకొచ్చారు. దీనితో ఈ వీడియో సోషల్ మీడియాలో అందరికి ఆసక్తిగా మారింది. ఇక దీని గురించి కేవలం పాకిస్తాన్ లోనే కాకుండా .. హాలీవుడ్ లో కూడా రామ్ చరణ్ హావ నడుస్తోంది. హాలీవుడ్ లో కూడా ఈ సీన్ కి సంబంధించిన వీడియో షేర్ చేస్తూ.. “ప్రాజెక్ట్ లో ఒక పాత్ర కోసం రామ్ చరణ్ లాంటి నటుడు కావాలి” అంటూ.. హాలీవుడ్ కి చెందిన ఓ ప్రముఖ కాస్టింగ్ సైట్ ప్రకటన ఇచ్చింది. దీనితో రామ్ చరణ్ పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోతుంది.

ఇక రామ్ చరణ్ తాజాగా అనంత్ అంబానీ , రాధికా మర్చంట్ ల ప్రీ వెడ్డింగ్ వేడుకలలో కూడా సందడి చేశారు. రామ్ చరణ్ కాకుండా తెలుగు హీరోలు ఎవరు కూడా ఈ వేడుకలలో కనిపించలేదు. దీనితో అందరికి కొత్త కొత్త ప్రశ్నలు పుట్టుకొచ్చాయి. తెలుగు హీరోలు ఎవ్వరికీ ఇన్విటేషన్ రాలేదా.. లేదా ఇన్విటేషన్ వచ్చినా రామ్ చరణ్ మాత్రమే అనంత్ అంబానీ పెళ్లికి వెళ్లారా .. అనే డిస్కషన్స్ మొదలయ్యాయి. ఇక రామ్ చరణ్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం గేమ్ చేంజర్ తో బిజీగా ఉన్నారు. ఈ సినిమా మీద అందరికి భారీ ఎక్స్పెక్టషన్స్ నెలకొన్నాయి. ఇక ఈ సినిమా పూర్తయిన తర్వాత.. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఓ చిత్రాన్ని చేయబోతున్నారు. మరి, ప్రస్తుతం పాకిస్తాన్ లో రామ్ చరణ్ గురించి జరుగుతున్న .. చర్చలకు సంబంధించిన వీడియోపై .. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişmeritbetmeritbetcasibomJojobetcasibomJojobet GirişjojobetjojobetjojobetcasibomcasibomPokerklasMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin Girişbetcio girişCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/