iDreamPost
android-app
ios-app

పాకిస్థాన్ లో హిందువులు ఎంతమంది ఉన్నారో తెలుసా??

  • Published Jun 10, 2022 | 8:09 PM Updated Updated Jun 10, 2022 | 8:09 PM
పాకిస్థాన్ లో హిందువులు ఎంతమంది ఉన్నారో తెలుసా??

దేశ విభజన తరువాత మన దేశంలో రోజు రోజుకి మైనార్టీల జనాభా పెరిగిపోతుంటే, పాకిస్థాన్ లో మాత్రం మైనారిటీలుగా ఉన్న హిందువులు, వేరే మతాల జనాభా సంఖ్యా తగ్గుతూనే వస్తుంది. తాజాగా వచ్చిన గణాంకాల ప్రకారం పాకిస్థాన్ లో హిందువులు, క్రిస్టియన్స్, వేరే మతాల జనాభా 2 శాతం కూడా లేకపోవడం గమనార్హం.

పాకిస్థాన్‌లో మొత్తం నమోదిత జనాభా 18 కోట్ల 68లక్షలు కాగా అందులో ఆ దేశంలో మైనారిటీలుగా ఉన్న హిందువుల జనాభా 1.18శాతంగా ఉన్నట్లు సెంటర్‌ ఫర్‌ పీస్‌ అండ్‌ జస్టిస్‌ పాకిస్థాన్‌ పేర్కొంది. అక్కడి నేషనల్‌ డేటాబేస్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ అథారిటీ (NADRA) డేటా ప్రకారం.. పాకిస్థాన్‌ జనాభాలో కేవలం 22లక్షల 10వేల మంది హిందువులు మాత్రం ఉన్నారు. 18,73,348 మంది క్రైస్తవ జనాభా, అహ్మదీలు లక్షా 88వేల మంది, సిక్కులు 74వేలు, భయాస్‌ లు 14 వేల మంది, 3917 మంది పార్సీలు, బౌద్ధమతస్థులు 1787, చైనీయులు 1151, ఆఫ్రికన్‌ మతాలకు చెందినవారు 1418 మందితోపాటు మరికొన్ని వందల సంఖ్యలో ఇతర వర్గాలు వారు ఉన్నట్లు NADRA తాజా నివేదికలో తెలిపింది.

అయితే పాకిస్థాన్ లో 2శాతం కంటే తక్కువగా ఉన్న హిందువులతోపాటు అహ్మదీలు, క్రైస్తవులపై ఇటీవల వేధింపులు ఎక్కువయ్యాయి. మైనారిటీలుగా ఉన్న ఈ రెండు శాతం జనాభా కూడా ఎక్కువగా భారత్ కి సరిహద్దులో ఉన్న సింధ్‌ ప్రావిన్సులోనే జీవిస్తున్నారు. ఇక పాకిస్థాన్‌ చట్టసభల్లో మైనారిటీ వర్గాల ప్రాతినిధ్యం కూడా లేదు. దీంతో పలువురు పాకిస్థాన్ లోని మైనార్టీలకు రక్షణ కల్పించాలని కోరుకుంటున్నారు.