Uppula Naresh
Uppula Naresh
నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకుని పిల్లా పాపలతో సంతోషంగా ఉండాలని చాలా మంది అనుకుంటుంటారు. కానీ, ఇంట్లో ఉన్న ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా కొందరు కాస్త ఆలస్యంగా పెళ్లి చేసుకుంటుంటారు. అయితే మరి కొందరు మాత్రం వయసు రాకముందే వివాహం చేసుకుని పెళ్లైన కొంత విభేదాలతో విడాకులు తీసుకుని టాటా చెప్పుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. ఓ 110 ఏళ్ల కురు వృద్ధుడు ఇన్నేళ్లు బతికి బట్టకట్టడం అంటేనే చాలా గొప్ప విషయం.
ఈ వయసులో మనవలు, మనవరాళ్లతో సంతోషంగా ఆడిపాల్సింది పోయి.. ఏకంగా మరో పెళ్లి సిద్దమయ్యాడు. అవును మీరు విన్నది నిజమే. మరో విషయం ఏంటంటే? ఇతనికి కట్నం కూడా ఇచ్చారు. అసలు 110 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకోవడం ఏంటి? ఇంతకు అతనికి ఇచ్చిన కట్నం ఎంతనే పూర్తి వివరాలు మీ కోసం. పైన ఫొటోలో కనిపిస్తున్న ఈ వృద్ధుడి పేరు అబ్దుల్ హసన్. వయసు దాదాపుగా 110 ఏళ్లు. ఇతడు పాకిస్తాన్ లోని కైబర్ పక్తున్వాలో నివాసం ఉంటున్నాడు. ఇతనికి గతంలో ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా మూడు పెళ్లిళ్లు జరిగాయి.
దీంతో ఈయనకు చాలా మంది కొడుకు, కూతుళ్లు ఉన్నారు. కాగా, అబ్దుల్ హసన్ కు 70 ఏళ్ల వయసున్న కుమారుడు ఉండడం విశేషం. మరో షాకింగ్ న్యూస్ ఏంటంటే? 110 ఏళ్ల వయసులో ఉన్న అబ్దుల్ హసన్ ఇటీవల 55 ఏళ్ల మహిళను నాలుగో పెళ్లి చేసుకున్నాడు. ఈ పెళ్లిలో భాగంగా ఆయనకు రూ. 5 వేల కట్నం కూడా ఇచ్చారు. ఇదే అంశం ఇప్పుడు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 110 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్న ఈ కురు వృద్ధుడి తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: పెళ్లి పీటలపై తాళిని విసిరి కొట్టిన వధువు! కారణం ఏమిటంటే?