క్రికెట్ చరిత్రలో ఆసియా కప్ కు ప్రత్యేకమైన స్థానం ఉంది. పేరుకే ఆసియా కప్ అయినప్పటికీ అది ఇండియా-పాక్ పోరుగా ప్రసిద్ధి చెందింది. అయితే 2023 ఆసియా కప్ నిర్వహణపై గత కొంతకాలంగా నీలినీడలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఆసియా కప్ పాక్ లో నిర్వహిస్తే భారత జట్టు పాకిస్థాన్ కు రాదు అని తెగేసి చెప్పింది బీసీసీఐ. ఇందుకు కౌంటర్ గా త్వరలోనే భారత్ లో జరగబోయే వరల్డ్ కప్ కు పాకిస్థాన్ రాదు అంటూ పాక్ బోర్డు పిచ్చి కూతలు కూసింది. దాంతో ఆసియా క్రికెట్ కౌన్సిల్ తర్జనభర్జన పడుతూ.. సమావేశాల మీద సమావేశాలు జరిపింది. తాజాగా ఆసియా కప్ 2023 షెడ్యూల్ ను విడుదల చేసింది. దాంతో ఆసియా కప్ ఎక్కడ జరగనుందో తేలిపోయింది.
ఆసియా కప్ 2023.. గత కొంతకాలంగా క్రికెట్ ప్రపంచంలో నానుతున్న పేరు. దానికి కారణం ఆసియా కప్ జరిగే ప్లేస్ ఇంకా ఖరారు కాకపోవడమే. తాజాగా ఈ సస్పెన్స్ కు తెరదించుతూ.. ఆసియా క్రికెట్ కౌన్సిల్ షెడ్యూల్ ను విడుదల చేసింది. ఆసియా కప్ చరిత్రలోనే ఈసారి టోర్నీ నిర్వహణను హైబ్రిడ్ పద్దతిలో నిర్వహించబోతున్నారు. మెుత్తం ఈ టోర్నీలో 13 మ్యాచ్ లు జరగనున్నాయి. ఇందులో 4 మ్యాచ్ లకు పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వనుండగా.. మిగిలిన 9 మ్యాచ్ లకు శ్రీలంక ఆతిథ్యం ఇవ్వనుంది. ఇక టోర్నీ అగష్టు 31 నుంచి సెప్టెంబర్ 17 వరకు కొనసాగుతుందని ఆసియా క్రికెట్ కౌన్సిల్ తెలిపింది. ఈ టోర్నీలో ఇండియా, పాకిస్థాన్, శ్రీలంక, ఆఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్ లతో పాటుగా నేపాల్ జట్టు పాల్గొననుంది.
Asia Cup 2023, Here we go 🔥😍#AsiaCup #Cricket #Pakistan #SriLanka pic.twitter.com/i0pydZkTwq
— Sportskeeda (@Sportskeeda) June 15, 2023