iDreamPost
android-app
ios-app

ఇలాంటి బౌలింగ్ ఇప్పటి వరకు చూసుండరు! వైరల్ వీడియో..

  • Author Soma Sekhar Published - 08:25 PM, Fri - 11 August 23
  • Author Soma Sekhar Published - 08:25 PM, Fri - 11 August 23
ఇలాంటి బౌలింగ్ ఇప్పటి వరకు చూసుండరు! వైరల్ వీడియో..

ప్రపంచ క్రికెట్ లో విలక్షణమైన బౌలింగ్ యాక్షన్ కలిగిన బౌలర్ల ఎందరో ఉన్నారు. తమ బౌలింగ్ యాక్షన్ తో వరల్డ్ క్రికెట్ లో తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అలాంటి వారలో ముందువరుసలో ఉంటాడు శ్రీలంక స్టార్ పేసర్ లసిత్ మలింగా. ఇక ఆ తర్వాత టీమిండియా యార్కర్ల కింగ్ జస్ప్రీత్ బుమ్రా, ఆఫ్గాన్ సెన్సేషన్ రషీద్ ఖాన్, సోహైల్ తన్వీర్ వీరితో పాటుగా మరికొందరు బౌలర్లు తమ విలక్షణ బౌలింగ్ స్టైల్ తో మెప్పిస్తున్నారు. అయితే ఇప్పుడు చెప్పుకోబోయే కుర్రాడు మాత్రం వీరందరి కంటే వెరైటీ బౌలింగ్ తో టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచాడు. మీరు ఇలాంటి బౌలింగ్ ఇప్పటి వరకు చూసుండరు. ప్రస్తుతం అతడి బౌలింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

సోషల్ మీడియాలో ప్రస్తుతం ఓ వీడియో హల్ చల్ చేస్తోంది. క్రికెట్ చరిత్రలో తమ బౌలింగ్ యాక్షన్ తో ప్రేక్షకులను మెప్పించారు కొందరు ఆటగాళ్లు. అయితే వాళ్లను మించి ఓ క్రికెటర్ బౌలింగ్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ బౌలింగ్ యాక్షన్ ను క్రికెట్ చరిత్రలో ఇప్పటి వరకు మీరు చూసుండరు. అలాంటి వెరైటీ బౌలింగ్ స్టైల్ తో అదరగొట్టాడు ఆ కుర్రాడు. పాకిస్థాన్ లో జరిగిన ఓ లోకల్ టోర్నమెంట్ లో జరిగిన క్రికెట్ మ్యాచ్ ద్వారా ఈ వింతైన బౌలింగ్ ప్రపంచానికి తెలిసింది.

ఈ మ్యాచ్ లో ఓ కుర్ర బౌలర్ తికమకపెట్టే బౌలింగ్ యాక్షన్ తో బంతిని విసిరాడు. అతడి బౌలింగ్ యాక్షన్ బిత్తరపోయిన బ్యాటర్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ వీడియోపై క్రికెట్ ఫ్యాన్స్ పలు విధాలుగా స్పందిస్తున్నారు. ఇతడి బౌలింగ్ యాక్షన్ నిబంధనలకు విరుద్దమని కొందరు కామెంట్స్ చేస్తుండగా.. మరికొందరేమో అతడు తన మోచేతిని 90 డిగ్రీలు వచ్చుతున్నాడని కామెంట్స్ చేస్తున్నారు. ఇంకోందరు శ్రీలంక స్టార్ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ పేసర్ అయితే అతడి బౌలింగ్ యాక్షన్ ఇలాగే ఉంటుందని కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ విచిత్ర బౌలింగ్ యాక్షన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.


ఇదికూడా చదవండి: ఆ ముగ్గురు లేకుంటే టీమిండియా బంగ్లాదేశ్ కంటే బలహీనం: పాక్ మాజీ కెప్టెన్

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss