iDreamPost
android-app
ios-app

టీమిండియా జెర్సీపై పాకిస్థాన్ పేరు.. చరిత్రలో తొలిసారి ఇలా..

  • Author Soma Sekhar Published - 03:06 PM, Thu - 10 August 23
  • Author Soma Sekhar Published - 03:06 PM, Thu - 10 August 23
టీమిండియా జెర్సీపై పాకిస్థాన్ పేరు.. చరిత్రలో తొలిసారి ఇలా..

ప్రపంచ క్రికెట్ లో అన్ని దేశాల మ్యాచ్ లకు ఉన్న క్రేజ్ ఒకెత్తు అయితే.. ఇండియా-పాక్ మ్యాచ్ కు ఉన్న క్రేజ్ మరో ఎత్తు. రెండు దేశాల మధ్య మ్యాచ్ అంటే ఎంతో ఉద్వేగతభరితంగా ఉంటుంది. ఇక వరల్డ్ కప్ లో టీమిండియా-పాక్ మధ్య మ్యాచ్ చూడ్డానికి ప్రేక్షకులు ఇప్పటి నుంచే రెడీ అవుతున్నారు. అయితే వరల్డ్ కప్ కు ముందే ఆసియా కప్ 2023 లో పాక్ తో తలపడనుంది టీమిండియా. ఆసియా కప్ కు పాకిస్థాన్ ఆతిథ్యం ఇస్తున్నప్పటికీ భారత్ ఆడే మ్యాచ్ లు శ్రీలంక లో జరగనున్నాయి. అయితే టీమిండియా జెర్సీపై ఈసారి పాకిస్థాన్ పేరు రానుంది. ఇలా జరగడం చరిత్రలో ఇదే తొలిసారి.

ఆసియా కప్ 2023 ఆగస్టు 30న ప్రారంభం కానుంది. దీనికోసం టీమిండియా కొత్త జెర్సీతో బరిలోకి దిగనుంది. కొత్త జెర్సీలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఉన్న పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దానికి కారణం ఈసారి టీమిండియా జెర్సీపై పాకిస్థాన్ పేరు ఉండటమే. ఆసియా కప్ కు పాకిస్థాన్ ఆతిథ్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. మెగా టోర్నీలకు ఏ దేశం ఆతిథ్యం ఇస్తే.. ఆ దేశం పేరు జెర్సీలపై ఉంటుంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఇక గ్రూప్ దశలో పాక్ తో రెండు సార్లు తలపడనుంది ఇండియా.

కాగా.. ఈసారి ఆసియా కప్ వన్డే ఫార్మాట్ లో జరుగుతున్న విషయం తెలిసిందే. పాకిస్థాన్ లో పర్యటించేందుకు భారత్ నిరాకరించడంతో.. భారత్ ఆడే మ్యాచ్ లు అన్ని తటస్థ వేదికలో జరగనున్నాయి. ఇక ఆసియా కప్ ఆతిథ్య దేశం పాక్ కావడంతో.. జెర్సీలపై ఆసియా కప్ లోగోలతో పాటుగా పాకిస్థాన్ పేరు ఉంటుంది. ఈ టోర్నీలో టీమిండియా సెప్టెంబర్ 2న పాక్ తో తలపడనుంది. మరి టీమిండియా జెర్సీపై పాక్ పేరుండటంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: తిలక్‌ వర్మ-సురేష్‌ రైనా.. అచ్చుగుద్దినట్లు రికార్డులన్నీ సేమ్‌