పెళ్లింట విషాదం నెలకొంది. మూడు ముళ్లు వేసి మూడ్రోజులైనా అవ్వకుండా.. వరుడు బలవన్మరణానికి పాల్పడిన విషాద ఘటన ఖమ్మం జిల్లాలో జరిగింది. వరుడి మృతితో.. రెండు కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. ఖమ్మం జిల్లాలోని వైరా మండలం పుణ్యవరం గ్రామానికి చెందిన కమ్మంపాటి నరేష్ (29)కు ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా (ఉమ్మడి కృష్ణాజిల్లా)కు ఆర్లపాడు గ్రామానికి చెందిన యువతితో జూన్ 4న పెళ్లైంది. జూన్ 5 ఆదివారం వరుడి స్వగ్రామంలో రిసెప్షన్ నిర్వహించారు. వధూవరులిద్దరూ ఆనందంగానే ఉన్నారు. నరేష్ […]
విజనరీ, గొప్ప అడ్మినిస్ట్రేటర్ అని టీడీపీ శ్రేణులు చెప్పుకునే చంద్రబాబు 14ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసినా..పరిపాలన లో ఒక్క సంస్కరణ తీసుకురాలేకపోయారు. టీడీపీ కార్యకర్త ఠక్కున చెప్పగలిగే ఒక్క సంక్షేమ పథకం అమలు చేయలేక పోయారు. అనుభవం లేదని టీడీపీ నేతలు ప్రచారం చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ముఖ్యమంత్రి అయిన తర్వాత గడిచిన మూడేళ్లలో విప్లవాత్మక సంక్షేమ పథకాలు,పరిపాలనా సంస్కరణలు ప్రవేశపెట్టారు. ప్రభుత్వాన్ని గ్రామాలకు చేర్చేలా ఏర్పాటుచేసిన గ్రామ సచివాలయాలు, దానికి అనుబంధంగా ఏర్పాటు చేసిన రైతు […]
కృష్ణాతీరం పులకించిపోయింది. సరికొత్త నామంతో ఆ ప్రాంతం సంతోషం వెలిబుచ్చుతోంది. నట సామ్రాట్.. అతిరథ మహా నాయకుడు.. కళాభిరాముడు.. అందరి అభిమాన ఘనుడు నందమూరి తారక రామరావు ఆయనే ఎన్టీఆర్. ఆ పేరును తమ ప్రాంతానికి చేర్చడంతో ఆనందంతో ఉప్పొంగిపోతున్నారు. తెలుగుదేశాన్ని స్థాపించి.. రాజకీయాల్లో కొత్త ఒరవడిని సృష్టించి.. తెలుగు వారి గొప్పతనాన్ని చాటిన ఆయనకు ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇంత ప్రాధాన్యం ఇవ్వలేదు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి రాజకీయాలకు అతీతంగా ఎన్టీఆర్ […]