iDreamPost
android-app
ios-app

తల్లిని చంపిన తనయుడు.. ఎందుకంటే..?

  • Published Apr 20, 2024 | 6:18 PM Updated Updated Apr 20, 2024 | 6:18 PM

అమ్మను మించిన దైవం లేదు అంటారు. అమ్మ ఏదైనా పిల్లల మంచి కోరే చేస్తోంది. కానీ ఆస్తి, అంతస్థులు ఆమెను కూడా పరాయిదాన్ని చేస్తున్నాయి. చివరకు

అమ్మను మించిన దైవం లేదు అంటారు. అమ్మ ఏదైనా పిల్లల మంచి కోరే చేస్తోంది. కానీ ఆస్తి, అంతస్థులు ఆమెను కూడా పరాయిదాన్ని చేస్తున్నాయి. చివరకు

  • Published Apr 20, 2024 | 6:18 PMUpdated Apr 20, 2024 | 6:18 PM
తల్లిని చంపిన తనయుడు.. ఎందుకంటే..?

రాను రానూ మానవత విలువలు తగ్గిపోతున్నాయి. మా అనుకున్నోళ్లే మనకు శత్రువులు అవుతున్నారు. బంధువులు అవసరం లేదు.. ఇంట్లోని కుటుంబ సభ్యులే రాబంధువులై పగబడుతున్నారు. కడుపున పుట్టిన బిడ్డలు ఆస్తులు కోసం అంతస్థుల కోసం తల్లిదండ్రులను రాచి రంపాన పెడుతున్నారు . పున్నామ నరకం నుండి తప్పించాల్సిన కుమారుడే ప్రత్యక్ష నరకం చూపిస్తున్నాడు. వారి పరువు బజారున వేసేస్తున్నారు. తల్లిదండ్రుల సంపాదించిన ఆస్తిపై కన్నేసి.. వాటిని తమ పేరిట రాసివ్వాలంటూ చిత్ర హింసలకు గురి చేస్తున్నారు. కాదంటే కాటికి పంపేందుకు కూడా వెనుకాడం లేదు. తాజాగా ఇటువంటి ఘటనే వెలుగు చూసింది.

జన్మనిచ్చిన తల్లినే కాలరాశాడు ఓ కిరాతక కొడుకు. విచక్షణ రహితంగా కత్తితో పొడిచి హత్య చేశాడు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ లోని ఎన్టీఆర్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నందిగామ మండలం ఐతవరం గ్రామంలో మాగంటి ఉమామహేశ్వరి తన కొడుకు సురేష్‌తో ఉంటోంది. అయితే సురేష్ చెడు వ్యసనాలకు బానిస అయ్యాడు. ఈ విషయంపై తల్లి పలుమార్లు మందలించింది కూడా. అయినా వినిపించుకోలేదు కొడుకు సురేష్. ఈ నేపథ్యంతో తన ఆస్తి తనకు పంచాలంటూ తల్లితో గొడవకు దిగాడు కుమారుడు. కానీ ఆస్థి ఇస్తే మొత్తం సర్వనాశనం చేస్తాడని భావించిన తల్లి.. ఇచ్చేందుకు నిరాకరించింది.

ఒత్తిడి ఎక్కువ  కావడంతో చివరకు ఆమె కోర్టును ఆశ్రయించింది. ఈ వ్యవహారంపై విచారించిన న్యాయ స్థానం కొడుకుకు నోటీసులు జారీ చేసింది. తల్లి తన పరువు బజారుకేసిందని భావించిన సురేష్.. ఆమెపై పగ పెంచుకున్నాడు. ఆగ్రహంతో ఊగిపోయిన సురేష్.. తల్లిపై కత్తితో దాడి చేశాడు. కన్నతల్లి అని దయ లేకుండా పలుమార్లు కత్తితో పొడవడంతో ఆమె మరణించింది. ఆస్తి కోసం కన్న తల్లినే పొట్టనబెట్టుకున్నాడు కసాయి కొడుకు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు సురేష్ ను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఆవేశం, ఆగ్రహంతో ఆమెను హత్య చేసి ఇప్పుడు కటకటాల పాలు అయ్యాడు. ఈ ఘటన చూస్తుంటే.. రానున్న తరంపై మరింత భయం, ఆందోళన నెలకొంటోంది.

Jojobet GirişJojobetşanlıurfa konteynerbetcioGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetjojobetjojobetgrandpashabetgrandpashabetcasibomcasibomcasibombetcio giriş