iDreamPost
android-app
ios-app

కొడుకు మరణవార్త విని.. ఆగిపోయిన తల్లి గుండె!

  • Published Dec 27, 2023 | 6:31 PM Updated Updated Dec 27, 2023 | 6:31 PM

తల్లితండ్రులకు పిల్లలపై సహజంగానే ఎనలేని ప్రేమ ఉంటుంది. అయితే, మరణంలోనూ కన్న కొడుకుకి తోడుగా నిలిచింది ఓ తల్లి. ఈ వార్త అందరి హృదయాలను కలచివేసింది.

తల్లితండ్రులకు పిల్లలపై సహజంగానే ఎనలేని ప్రేమ ఉంటుంది. అయితే, మరణంలోనూ కన్న కొడుకుకి తోడుగా నిలిచింది ఓ తల్లి. ఈ వార్త అందరి హృదయాలను కలచివేసింది.

  • Published Dec 27, 2023 | 6:31 PMUpdated Dec 27, 2023 | 6:31 PM
కొడుకు మరణవార్త విని.. ఆగిపోయిన తల్లి గుండె!

ప్రపంచంలో కుటుంబ కలహాల కారణంగా కన్న బిడ్డలను హతమార్చిన తల్లి తండ్రులు ఉన్నారు. అలాగే కన్న వారిని పట్టించుకోని పిల్లలు కూడా ఉన్నారు. సాధారణంగా తల్లితండ్రులకు పిల్లల పట్ల బాధ్యత, ప్రేమ ఉంటాయి. కన్న బిడ్డలపైన ఎన్నో ఆశలు పెట్టుకుని వారిని పెంచుతూ ఉంటారు. వారు సరైన మార్గంలో నడవకపోతే సరిదిద్దుతారు. వారి మధ్య కొన్ని సందర్భాల్లో విభేదాలు వచ్చినా సర్దుకుపోతారు. ఈ క్రమంలో తమ కడుపున పుట్టిన పిల్లలు తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోతే.. కన్న వారి బాధ ఎవరు తీర్చలేరు. వారిని మర్చిపోలేక చనిపోయిన బిడ్డల కోసం.. ప్రేమతో గుడులు కట్టించిన వారిని ఎంతోమందిని వార్తల్లో చూశాం. కానీ, ఎన్టీఆర్ జిల్లాలోని ఓ తల్లి మాత్రం కన్న కొడుకు చనిపోయాడని.. తన ప్రేమను అందించడానికి చివరకు మృత్యులోను తోడుగా నిలిచింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

ఎన్టీఆర్‌ జిల్లా జగ్గయ్యపేట్‌ మండలంలోని షేర్‌మహ్మద్‌ పేట గ్రామంలో.. తిరుపతిరావు అనే వ్యక్తి నివసిస్తున్నాడు. ఇతను ఒక ఆటో డ్రైవర్. అయితే కొంత కాలం క్రిందట ఇతని ఆరోగ్యం క్షీణించింది. వైద్య పరీక్షలు చేసిన తరువాత వైద్యులు అతనికి కామెర్లు అని చెప్పారు. అయితే, విజయవాడ ఆసుపత్రిలో ఇతను చికిత్స పొందుతున్న క్రమంలో అతని ఆరోగ్యం మరింత క్షీణించింది. వైద్యానికి అతను ఏ మాత్రం స్పందించడం లేదు. వైద్యులు కూడా వారు చేయాల్సిన చికిత్సను అందిస్తూనే ఉన్నారు. కానీ, వారి శ్రమకు ఏ మాత్రం ఉపయోగం లేకుండా పోయింది. మంగళవారం రోజున అతను చికిత్స పొందుతూ ఆఖరి శ్వాసను వదిలాడు.

దీనితో కుటుంబ సభ్యులు అందరూ కన్నీరు మున్నీరు అయ్యారు. బాధితుడి తల్లి తన కొడుకు మరణ వార్త వినగానే ఒక్కసారిగా కుప్ప కూలిపోయింది. కొడుకు మరణ వార్తను జీర్ణించుకోలేక స్పృహ తప్పి ఉంటుందని కుటుంబ సభ్యులు భావించారు. దీనితో వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. అప్పటికే తిరుపతిరావు చనిపోయిన బాధలో ఉన్న కుటుంబ సభ్యులకు.. వైద్యులు మరో చేదు వార్తను అందించారు. తిరుపతిరావు తల్లి తిరుపతమ్మ కూడా గుండె పోటుతో చనిపోయిందని వైద్యులు నిర్దారించారు. తన కన్న కొడుకు మరణించాడనే వార్తను తట్టుకోలేక ఈ కన్న తల్లి కూడా తన ప్రాణాలను వదిలేసింది.

కాగా,  ఒక అరంగంట వ్యవధిలోనే తల్లి కొడుకులు మరణించిన వార్త.. ఆ కుటుంబాన్ని శోకసంద్రంలో ముంచి వేసింది. ఈ సంఘటనను చూసిన స్థానికులు కంట తడి పెట్టుకుంటున్నారు. ఒకే కుటుంబం నుంచి తల్లి కొడుకులు మరణించడంతో ఆ కుటుంబ సభ్యులు ఈ సంఘటనలను జీర్ణించుకోలేకపోతున్నారు. ఆ తల్లికి కొడుకుపై ఉన్న ఎనలేని ప్రేమ.. మృత్యులోను అతని వెంట ఉండేలా చేసింది. ఏదేమైనా, ఇలా వెంట వెంటనే తల్లి కొడుకులు దూరం అవ్వడం అనేది చాలా విచారించ తగిన విషయం. ప్రస్తుతం ఈ వార్త సామజిక మాధ్యమాలలో షేర్ అవుతోంది. దీనిని చూసిన నెటిజన్లు.. ప్రపంచంలో తల్లి ప్రేమను మరణం కూడా ఆపేలేదని కామెంట్స్ చేస్తున్నారు. మరి, మృత్యులోను తోడుగా నిలిచిన ఈ తల్లి కొడుకుల సంఘటనపై.. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetşanlıurfa konteynerGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetjojobetjojobetbetwooncasibomcasibomcasibombetcio giriş