Swetha
ప్రేమ ఎప్పుడు ఎవరి పట్ల ఎందుకు కలుగుతోందో ఎవ్వరు చెప్పలేరని.. చాలా మంది అంటూ ఉంటారు. అయితే, దీనికి నిదర్శనంగా నిలుస్తూ ఉంటారు మరికొంతమంది. తాజాగా, ఓ యువకుడు ట్రాన్స్ జెండర్ ను వివాహం చేసుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది.
ప్రేమ ఎప్పుడు ఎవరి పట్ల ఎందుకు కలుగుతోందో ఎవ్వరు చెప్పలేరని.. చాలా మంది అంటూ ఉంటారు. అయితే, దీనికి నిదర్శనంగా నిలుస్తూ ఉంటారు మరికొంతమంది. తాజాగా, ఓ యువకుడు ట్రాన్స్ జెండర్ ను వివాహం చేసుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది.
Swetha
ప్రపంచంలో ఎంతో మంది ప్రేమించుకుంటారు. కానీ, వాటిలో పెళ్లి వరకు వెళ్లే జంటలు మాత్రం కొన్నే ఉంటాయి. దానికి ఎన్నో కారణాలు ఉంటాయి. పైగా వారిలో కొంతమంది పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుంటే.. మరికొంతమంది వారిని ఎదురించి పెళ్లి పీటలెక్కుతారు. అయితే, ప్రేమ ఎప్పుడు ఎవరిమీద ఎలా కలుగుతుందో చెప్పలేమని ఎంతో మంది చెప్తూ ఉంటారు. ప్రేమకు కుల, మత, వయస్సు బేధాలు ఏవి ఉండవు. దానికి కొన్ని నిదర్శనాలు కూడా మనం అప్పుడపుడు చూస్తూనే ఉంటాము. అయితే, ఈ క్రమంలో తాజాగా ఒక జంట ప్రేమకు లింగ బేధం కూడా నిరూపించింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
సోషల్ మీడియా హావ పెరిగిన తర్వాత.. ఆన్ లైన్ లో ఒకరిని ఒకరు కలుసుకోవడం.. చాట్ చేస్తూ వారి మధ్యన అనుబంధాన్ని పెంచుకుని.. అది కాస్త వారి ప్రేమకు పునాదిగా మారి.. పెళ్లి చేసుకోవడం అనేది సహజంగా మారిపోయింది. ఇలా ఇప్పటికే ఎంతో మంది యువతీ యువకులు వివాహాలు చేసుకున్నారు. కానీ, తాజాగా ఓ యువకుడు మాత్రం ఒక ట్రాన్స్ జెండర్ ను ప్రేమించి వివాహం చేసుకుని వార్తల్లో నిలిచాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లా ఏన్కూరులో మండలంలో చోటు చేసుకుంది. ఖమ్మం జిల్లా ఏన్కూరులో నక్షత్ర అనే ట్రాన్స్‌జెండర్‌కు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్‌టీఆర్ జిల్లా విస్సన్నపేటకు చెందిన ఆజ్మీర అనే యువకుడికి.. మూడేళ్ల క్రితం ఇంస్టాగ్రామ్ లో పరిచయం ఏర్పడిందట. పోను పోను ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. దీనితో వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. కానీ, వీరి పెద్దలు ఈ వివాహానికి అంగీకరించలేదు.
ఇక వీరు పెళ్లి చేసుకోవాలనుకున్న విషయాన్ని ట్రాన్స్‌జెండర్ సంఘం సభ్యులకు తెలియజేయగా.. జిల్లాలోని వివిధ ప్రాంతాల ట్రాన్స్‌జెండర్‌లు అంతా ఏకమయ్యి .. పెళ్లి పెద్దలుగా వ్యవహరించారు. ఏన్కూరు మండలం గార్లఒడ్డు శ్రీ లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో.. అంతా కలిసి ఆజ్మీర, నక్షత్రాల వివాహం ఆదివారం ఘనంగా జరిపించారు. సామజిక మాధ్యమాలలో ఈ వార్తను చూసిన వారు దీనిపై రకరకాలుగా స్పదింస్తున్నారు. ఏదేమైనా.. ఒక ట్రాన్స్ జెండర్ ను వివాహం చేసుకుని.. ప్రేమకు లింగ బేధం కూడా లేదని నిరూపించాడు ఈ వ్యక్తి. మరి, ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.