P Krishna
Attack On CM YS Jagan With Stone: ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల ప్రచారాలు ఊపందుకున్నాయి. అధికార, ప్రతిపక్ష నేతలు నువ్వా.. నేనా అన్న చందంగా ప్రచారాలు చేస్తున్నారు. సీఎం జగన్ ‘మేమంతా సిద్దం’ బస్సుయాత్ర దిగ్విజయంగా కొనసాగిస్తున్నారు.
Attack On CM YS Jagan With Stone: ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల ప్రచారాలు ఊపందుకున్నాయి. అధికార, ప్రతిపక్ష నేతలు నువ్వా.. నేనా అన్న చందంగా ప్రచారాలు చేస్తున్నారు. సీఎం జగన్ ‘మేమంతా సిద్దం’ బస్సుయాత్ర దిగ్విజయంగా కొనసాగిస్తున్నారు.
P Krishna
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికార, ప్రతిపక్ష నేతలు ప్రచారాల్లో మునిగిపోయారు. ఈ ఎన్నికల్లో ప్రతిపక్షాలు కూటమిగా ఏర్పడి పోటీ చేస్తుండగా.. వైఎస్సాఆర్ సీపీ ఒంటరిగా పోరుకు సిద్దమైంది. ప్రస్తుతం ఏపీ సీఎం ‘మేమంతా సిద్దం’ అంటూ బస్సు యాత్ర మొదలు పెట్టారు. వైఎస్ జగన్ చేస్తున్న బస్సు యాత్రకు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఎక్కడికి వెళ్లిని జనాలు నీరాజనాలు పలుకుతున్నారు. నేడు సీఎం జగన్ ‘మేమంతా సిద్దం’ బస్సు యాత్ర ఎన్టీఆర్ జిల్లాకు చేరుకుంది. ఈ క్రమంలోనే మేమంతా సిద్దం బస్సు యాత్రలో అపశృతి చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే…
నేడు కృష్ణా జిల్లాలో సీఎం జగన్ ‘మేమంతా సిద్దం’ బస్సు యాత్ర కొనసాగుతుంది. బస్సు యాత్రలో భాగంగా సింగ్ నగర్ కు చేరుకున్న క్రమంలో సీఎం జగన్ పై ఓ అగంతకుడు రాయి విసిరాడు. బస్స పై పుంచి సీఎం జగన్ అభివాదం చేస్తున్న సమయంలో రాయితో దాడి చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఆ రాయి వేగంగా వచ్చి సీఎం జగన్ కనుబొమ్మకు తాకడంతో గాయం జరిగింది. క్యాట్ బాల్ తో దాడి చేసినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రాయి సీఎం జగన్ ఎడమ కంటికి కనుబొమ్మపై గాయమైంది. పక్కనే ఉన్న ఎమ్మెల్యే వెల్లంపల్లి కు కూడా స్వల్ప గాయం అయ్యింది. వెంటనే సీఎం జగన్ కి బస్సులోనే ప్రథమ చికిత్స అందించారు వైద్యులు. తర్వాత మళ్లీ బస్సు యాత్రను కొనసాగించారు. ఇదిలా ఉంటే.. సీఎం జగన్ కి వస్తున్న ప్రజాభిమానం ఓర్వలేక ప్రతిపక్ష నేతలు ఈ దాడి చేయించారని వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు అంటున్నారు. దీని గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.