iDreamPost
android-app
ios-app

మూడో పెళ్లికి అడ్డొస్తుందనీ కన్న కూతురిపై తండ్రి క్రూరత్వం!

  • Published Dec 14, 2023 | 2:53 PM Updated Updated Dec 14, 2023 | 2:53 PM

నేటికాలంలో ఎన్నో ఘోరాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా బిడ్డలను కంటికి రెప్పలా కాపాడాల్సిన తల్లిదండ్రులే యమదూతలుగా మారిపోతున్నారు. తమ సుఖానికి అడ్డొస్తున్నారని దారుణాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఓ కాసాయి తండ్రి.. కన్న కూతురిపై క్రూరత్వం ప్రదర్శించాడు.

నేటికాలంలో ఎన్నో ఘోరాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా బిడ్డలను కంటికి రెప్పలా కాపాడాల్సిన తల్లిదండ్రులే యమదూతలుగా మారిపోతున్నారు. తమ సుఖానికి అడ్డొస్తున్నారని దారుణాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఓ కాసాయి తండ్రి.. కన్న కూతురిపై క్రూరత్వం ప్రదర్శించాడు.

  • Published Dec 14, 2023 | 2:53 PMUpdated Dec 14, 2023 | 2:53 PM
మూడో పెళ్లికి అడ్డొస్తుందనీ కన్న కూతురిపై తండ్రి క్రూరత్వం!

ప్రస్తుతం సమాజంలో మానవత్వం మంట కలిసి పోతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ప్రజలను భయబ్రాంతులకు గురి చేసే సంఘటనలు..  నిత్యం మన చుట్టూ జరుగుతూనే ఉన్నాయి. ఎక్కడో జరిగిన ఎదో ఒక వార్త అందరిని కలవరపెడుతూనే ఉంటుంది. ఇక ఈరోజుల్లో అడ్డొస్తే కన్న బిడ్డలను సైతం కడతేర్చడానికి వెనుకాడడం లేదు కొందరు తల్లిదండ్రులు. అటువంటి దయనీయ స్థితిలో పయనిస్తోంది ఈ లోకం. తాజాగా ఓ కన్న తండ్రి కూతురి పట్ల క్రూరంగా  ప్రవర్తించిన ఓ ఘటన వెలుగులోకి వచ్చింది. తన మూడో పెళ్ళికి అడ్డుగా నిలిచిందని కన్న కూతురుని హతమార్చేందుకు యత్నించాడు ఓ కసాయి తండ్రి.  పూర్తి వివరాల్లోకి వెళ్తే..

ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో ఈ దారుణ సంఘటన చోటు చేసుకుంది. జగ్గయ్యపేట పట్టణం నాగమయ్య బజార్‌లో ప్రవీణ్ అనే వ్యక్తి తల్లి, ఐదేళ్ల కూతురితో కలిసి నివసిస్తున్నాడు. అతనికి ఇది వరకే రెండు పెళ్లిళ్లు అయ్యాయి. అయితే, అతని మొదటి భార్యతో వివాహం జరిగిన కొన్ని రోజులకే విడాకులు అయ్యాయి. ఆ తర్వాత రెండవ పెళ్లి చేసుకున్నాడు. అప్పుడు  వారికి  లోహిత అనే కుమార్తె జన్మించింది. కానీ, ప్రవీణ్ చిత్రహింసలు తట్టుకోలేక అతని రెండవ భార్య..  నాలుగు సంవత్సరాల క్రితం ఆత్మహత్య చేసుకుంది. దానితో  ఆ పసిపాప ఒంటరిగా మిగిలిపోయింది. ఇక ఆ తర్వాత ప్రస్తుతం ప్రవీణ్ మూడవ పెళ్ళికి సిద్ధం అయ్యాడు. కానీ, ఇప్పుడు తన పెళ్ళికి కూతురు అడ్డుగా ఉందని భావించాడు.

దీనితో ఎలాగైనా  కూతురు అడ్డు తొలగించుకోవాలని అనుకున్నాడు. ప్రవీణ్ తన తల్లి గోవర్ధనమ్మ తో కలిసి ఆ చిన్నారిని హింసించడం మొదలు పెట్టాడు. ఆ పాపను బయటకు రానివ్వకుండా ఇంట్లోనే బంధించారు. కిటికీలు, తలుపులు మూసివేసి తాళ్లతో కట్టేశారు. కనీసం తినడానికి తిండి, వేసుకోడానికి బట్టలు కూడా ఇవ్వకుండా ఘోరంగా  ప్రవర్తించారు. దానివలన ఆ చిన్నారి ఆరోగ్యం  బాగా దెబ్బతింది. దీనితో వీరి చేష్టలపై అనుమానం కలిగిన  స్థానికులు, ఇరుగుపొరుగు వారు పోలీసులకు అక్కడి పరిస్థితులను తెలియజేయడంతో.. అసలు విషయం బయట పడింది. పోలీసులు వెళ్లి చూసేసరికి ఆ చిన్నారిని బాత్రూంలోని బకెట్ లో కుక్కి పైన గుడ్డలు కప్పి ఉంచారు.

వెంటనే పోలీసులు ఆ  చిన్నారిని రక్షించి బయటకు తీసుకుని వచ్చారు. ఆ పాపకు బట్టలు ధరించి అసలు ఏం జరిగిందో తెలుసుకున్నారు. ఆమె తెలిపిన వివరాల ప్రకారం.. తన తండ్రి, నానమ్మ కలిసి.. రోజు కొట్టేవారని, తినడానికి కూడా ఏమి పెట్టేవారు కాదని తెలిసింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఏదేమైనా రోజు రోజుకు ఇటువంటి ఘటనలు పెరిగిపోవడం  చాలా విచారించాల్సిన విషయం. కన్న పేగు సైతం కర్కశంగా మారిపోతుంది. మరి, ఈ కసాయి తండ్రి తన కూతురి పట్ల ప్రవర్తించిన తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetJojobetJojobetHoliganbetJojobetHoliganbetjojobetgrandpashabetkralbetcasibomiptvjojobetcasibomcasibomGrandpashabetgrandpashabettaraftarium24 girişEscortes BelgiqueCasibomCasibomgrandpashabetJOJOBET GİRİŞLERİCasibom